హైదర్‌గూడ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.

హైదర్‌గూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదులో పేరొందిన వాణిజ్య, నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి. ఓల్డ్ ఎమ్మెల్యే రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి.

హైదర్‌గూడ
నగరంలోని ప్రాంతం
అపోలో హాస్పిటల్
అపోలో హాస్పిటల్
హైదర్‌గూడ is located in Telangana
హైదర్‌గూడ
హైదర్‌గూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
హైదర్‌గూడ is located in India
హైదర్‌గూడ
హైదర్‌గూడ
హైదర్‌గూడ (India)
Coordinates: 17°23′47″N 78°28′54″E / 17.39639°N 78.48167°E / 17.39639; 78.48167
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్ జిల్లా
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 029
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

సమీప ప్రాంతాలు మార్చు

ఇక్కడికి సమీపంలో విట్టల్ వాడి, రామ్‌కోటి, గన్ ఫౌండ్రి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

వాణిజ్య ప్రాంతం మార్చు

ఇక్కడ ఫుడ్ వరల్డ్, పాంటలూన్స్, మోర్ వంటి అనేక మాల్స్, దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులు ఉన్నాయి. హైదరాబాదీ రెస్టారెంట్ కేఫ్ బహార్ కూడా ఇక్కడ ఉంది.

విద్యాసంస్థలు మార్చు

భారతీయ విద్యా భవన్‌ శాఖ, సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పిజి కళాశాల,హైదరాబాద్ సెయింట్ పాల్స్ హైస్కూల్, లోటస్ నేషనల్ స్కూల్ వంటి విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి.[3] 1990లలో ఇక్కడ మదీనా హైస్కూల్, మదీనా స్టూడెంట్స్ హాస్టల్ బాగా ప్రాచుర్యం పొందాయి. హాస్టల్ ను మదీనా ఐ హాస్పిటల్గా మార్చారు.

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హైదర్‌గూడ నుండి నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] సమీపంలోని నాంపల్లిలో ఎంఎంటిఎస్ రైలు సౌకర్యం ఉంది.

అభివృద్ధి పనులు మార్చు

హైదరగూడలో 33 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు 2022 జూన్ 22న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ శంపస్థాపన చేశాడు. అత్తాపూర్‌, హైదర్‌గూడ ప్రభుత్వ పాఠశాల నుంచి హైదర్‌గూడ చౌరస్తా వరకు రూ.17.35లక్షలతో సీసీ రోడ్డును, రూ.16.80లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ సంగీత, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

మూలాలు మార్చు

  1. "Hyderguda , Hyderabad". www.onefivenine.com. Retrieved 2021-01-27.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "Lotus National School, Hyderguda". The Hindu. 2006-02-17. ISSN 0971-751X. Retrieved 2021-01-27.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-27.
  5. telugu, NT News (2022-06-22). "రూ.33 లక్షలతో అభివృద్ధి పనులు". Namasthe Telangana. Archived from the original on 2022-06-22. Retrieved 2022-06-22.

ఇతర లంకెలు మార్చు