పి.వి. రంగారావు

రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు కుమారుడు.

పాములపర్తి వెంకట రంగారావు, (1940ఆగస్టు 1, 2013) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి. భారత మాజీ ప్రధాని, పి.వి. నరసింహారావు కుమారుడైన రంగారావు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశాడు.[1]

పి.వి. రంగారావు
రాష్ట్ర మాజీ మంత్రి
నియోజకవర్గంహనుమకొండ
వ్యక్తిగత వివరాలు
జననం
పి.వి. రంగారావు

1940
వంగర, కరీంనగర్ జిల్లా, హైదరాబాదు రాష్ట్రం
మరణంఆగస్టు 1, 2013
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
తల్లిసత్యమ్మ
తండ్రిపివి నరసింహారావు

జననం - విద్యాభ్యాసం

మార్చు

రంగారావు 1940లో భారతదేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు, సత్యమ్మ దంపతులకు హైదరాబాద్ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించాడు.[2] ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలను పొందాడు. ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు (పి.వి. రాజేశ్వర్ రావు, పి.వి. ప్రభాకర్ రావు), ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. ఇతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

రంగారావు రెండుసార్లు ఎమ్మెల్యేగా, శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు.

1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున హన్మకొండ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాస్యం ప్రణయ్ భాస్కర్ పై గెలుపొందాడు. 1994, 1999లలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.

ఇతను 2013, ఆగస్టు 1న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "TRIBUTE: PV RANGA RAO A leader who let his heart rule his head". Archived from the original on 1 October 2016. Retrieved 26 February 2013.
  2. Ex-PM Narasimha Rao's son P V Ranga Rao is dead - The Times of India