సుల్తాన్ (2021 సినిమా)
సుల్తాన్ 2021 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళం, తెలుగులో ఒకే రోజు విడుదలైంది.[2] ఈ సినిమా షూటింగ్ 2019, మార్చి 13న ప్రారంభమైంది.[3]
సుల్తాన్ | |
---|---|
దర్శకత్వం | బక్కియరాజ్ కణ్ణన్ |
రచన | అరుళ్ కుమార్ రాజశేఖరన్ హరిహరసుతన్ తంగవేలు (మాటలు) |
స్క్రీన్ ప్లే | బక్కియరాజ్ కణ్ణన్ |
కథ | బక్కియరాజ్ కణ్ణన్ |
నిర్మాత |
|
తారాగణం | కార్తిక్ శివకుమార్, రష్మికా మందన్న |
ఛాయాగ్రహణం | సత్యన్ సూర్యన్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | వివేక్- మెర్విన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా [1] |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ వారియర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2 ఏప్రిల్ 2021 |
సినిమా నిడివి | 155 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సినిమా కథ
మార్చుసేతుపతి (నెపోలియన్) పెద్ద రౌడీ. అతడి వద్ద ప్రాణాలిచ్చే వంద మంది రౌడీలుంటారు. సేతుపతికి ఒకే ఒక్క కొడుకు సుల్తాన్ (కార్తీ). చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సుల్తాన్‌ను ఈ వంద మంది రౌడీలు ప్రేమగా పెంచుతారు. ఓ సమస్యను పరిష్కరించడం కోసం అమరావతి దగ్గర్లోని వెలగపూడి గ్రామానికి వెళ్తాడు సుల్తాన్. అక్కడే రుక్మిణి (రష్మిక) ని చూసిన సుల్తాన్ ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఆ గ్రామానికి ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్యను తీరుస్తానని సుల్తాన్ తండ్రి గతంలోనే మాటిచ్చి ఉంటాడు. తండ్రి మాట నెరవేర్చేందుకు సుల్తాన్ ఆ గ్రామంలోనే ఉండిపోతాడు. ఈ క్రమంలో తను అన్నలుగా భావించే వంద మంది రౌడీలకు, సుల్తాన్‌కు మధ్య అభిప్రాయబేధాలోస్తాయి. అసలు రౌడీలకు, సుల్తాన్‌కు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది.. ఇంతకీ ఊరికి వచ్చిన సమస్యేంటి అనేది బ్యాలెన్స్ ఈ సినిమా కథ.[4]
నటించిన నటులు \ సినిమాలో పాత్ర పేరు
మార్చు- కార్తీ - విక్రమ్ సుల్తాన్
- రష్మిక మందన్నా - రుక్మణి
- రామచంద్ర రాజు - జయశీలన్
- నవాబ్ షా - బహుళజాతి సంస్థ అధిపతి
- లాల్ - మన్సూర్
- నెపోలియన్ - సేతుపతి, విక్రమ్ తండ్రి
- జైంట్ జనజీర్ - గదా
- అభిరామి - అన్నలక్ష్మి, విక్రమ్ తల్లి (అతిధి పాత్రలో)
- పొన్‌వన్నన్ - రుక్మణి తండ్రి, గ్రామా పెద్ద
- యోగి బాబు - కింగ్-కాంగ్ (తమిళ వెర్షన్ లో పేరు "ఒత్త లోరి")
- కల్యాణన్ - సమరసం
- సతీష్ -విక్రమ్ స్నేహితుడిగా (అతిధి పాత్రలో)
- హరీశ్ పేరడీ - మాణికేవెల్, పోలీస్ కమీషనర్
- ఆర్జై - తలయ
- సింగంపులి - గ్రామస్థుడిగా
- సెండ్రయాన్ - మన్సూర్ వద్ద గుండగా
- శరత్ కుమార్ - మన్సూర్ వద్ద గుండగా
- కామరాజ్ - మైఖేల్
- భాస్కర్ - న్యాయవాదిగా
- రామ
- మరిముత్తు
- సేంతి కుమారి
- సంగీత
మూలాలు
మార్చు- ↑ The Times Of India, News » Entertainment » Tamil » Music (25 March 2021). "Yuvan Shankar Raja to score the background music for Karthi's 'Sulthan' - Times of India". The Times of India. Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
- ↑ Sakshi (2 April 2021). "'సుల్తాన్' మూవీ రివ్యూ". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
- ↑ The New Indian Express (13 March 2019). "Karthi-Rashmika film launched". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
- ↑ Telugu, TV9 (2 April 2021). "Sulthan Review: ఆద్యంతం ఆసక్తికరంగా 'సుల్తాన్'.. మరోసారి కార్తీ యాక్టింగ్ అదుర్స్ అంటూ ట్వీట్స్.. - Sulthan Telugu Movie Review twitter talk audience talk Karthi Rashmika Mandannna starrer". TV9 Telugu. Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)