సూర్యాపేట ఐటీ హబ్

తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణంలో ఉన్న ఐటీ టవర్

సూర్యాపేట ఐటీ హబ్ అనేది తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట పట్టణంలో ఉన్న ఐటీ హబ్ . రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం, సూర్యాపేట పట్టణంలో జీప్లస్‌ 3 అంతస్తులతో నిర్మించిన ఈ ఐటీ హబ్ 2023, అక్టోబరు 2న ప్రారంభించబడింది.[1]

సూర్యాపేట ఐటీ హబ్
సూర్యాపేట ఐటీ హబ్
సాధారణ సమాచారం
రకంఐటీ హబ్
ప్రదేశంసూర్యాపేట సూర్యాపేట జిల్లా, తెలంగాణ
పూర్తి చేయబడినది2023
ప్రారంభం2023, అక్టోబరు 2
యజమానితెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ

ఏర్పాటు

మార్చు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ఏర్పాటు విషయమై 2022 మార్చిలో తన అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో వివిధ కంపనీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో ప్రకటించాడు. పాత కలెక్టరేట్‌లో 9 కంపెనీలతో ఏర్పాటుచేస్తున్న ఈ ఐటీ హబ్ లో తొలి దశలో భాగంగా 180 మందికి ఉపాధి కల్పించిన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.[2]

జాబ్ మేళా

మార్చు

ఈ కంపెనీలలలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ అకాడెమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో 2023 సెప్టెంబరు 26న జాబ్ మేళా నిర్వహించబడింది. సూర్యాపేటలోని సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జరిగిన ఈ జాబ్ మేళాలో బీటెక్ చదివిన నిరుద్యోగ యువత పాల్గొన్నారు. రిక్రూట్‌మెంట్‌కు 15 కంపెనీలు హాజరు కాగా దాదాపు 4 వేల మంది నమోదు చేసుకున్నారు. తొలి విడుతలో 390 మందిని ఏంపిక చేయగా ఇందులో 75 మందికి ఉద్యోగాలు లభించాయి.[3]

ప్రారంభం

మార్చు

2023, అక్టోబరు 2న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఐటీ హబ్ ను ప్రారంభించి, అందులోని వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశాడు.[4] ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్య‌స‌భ ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అదనపు కలెక్టర్ ప్రియాంక, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, వివిధ కంపెనీల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

మూలాలు

మార్చు
  1. telugu, NT News (2023-09-22). "Suryapet | సూర్యాపేటకు ఐటీ టవర్‌.. వచ్చే నెల 2న కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం : మంత్రి జగదీశ్‌ రెడ్డి". www.ntnews.com. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-27.
  2. telugu, NT News (2023-09-23). "సూర్యాపేటలో ఐటీ కొలువులు". www.ntnews.com. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-27.
  3. Velugu, V6 (2023-09-27). "సూర్యాపేటలోనే ఐటీ జాబ్.. అక్టోబర్ 2న ప్రారంభం". V6 Velugu. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "TS: సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Prabha News. 2023-10-02. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.
  5. "Trending news: ఐటీ హబ్‌తో భవిష్యత్‌కు భరోసా". Sakshi Education. 2023-10-05. Archived from the original on 2023-10-07. Retrieved 2023-10-07.

వెలుపలి లంకెలు

మార్చు