సెలా సొరంగం
సెలా సొరంగం సముద్ర మట్టం నుండి 3,000 మీటర్లు (9,800 అ.) ఎత్తున ఉన్న రోడ్డు సొరంగం. దీని వలన్ అస్సాంలోని గౌహతి, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ల మధ్య సకల వాతావరణ రవాణా సౌకర్యం కలిగింది. 13,000 అడుగుల పొడవుతో ఇది, ప్రపంచంలోనే అతి పొడవైన రెండు వరుసల సొరంగం. సెలా కనుమ నుండి 400 మీటర్ల దిగువన ఉన్న సెలా సొరంగం శీతాకాలంలో కూడా అంతరాయం లేని ముఖ్యమైన మార్గం. ఈ సొరంగం గుండా భారత సైన్యాన్ని, ఆయుధాలను, యంత్రాలనూ చైనా-భారత సరిహద్దు వద్దకు త్వరగా తరలించడానికి వీలుకలుగుతుంది. కొత్త 12.4 కి.మీ.ల రహదారి దీన్ని, ఎన్‌హెచ్ 13 తో కలుపుతుంది. దిరాంగ్, తవాంగ్‌ల మధ్య దూరం 10 కి.మీ. తగ్గింది. 2024 మార్చి 9 న ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించాడు.[1] బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మించిన ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు, ఒక లింక్ రోడ్డు ఉన్నాయి. మొదటిది 980-మీటర్ల పొడవు గల ఒకే గొట్టపు సొరంగం కాగా, రెండవది 1,555-మీటర్ల పొడవు గల రెండు గొట్టాలు కలిగిన సొరంగం. వీటిలో ఒక గొట్టం ఒక రెండు వరుసల ట్రాఫిక్ కోసం కాగా, రెండవది అత్యవసర సేవల కోసం నిర్మించారు. ఈ సొరంగాల మధ్య లింక్ రోడ్డు 1,200 మీటర్లు విస్తరించి ఉంది. ఈ సొరంగం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతం నుండి తవాంగ్‌కు వెళ్ళేందుకు సకల వాతావరణ రహదారి సౌకర్యం కలిగిస్తుంది.[2]
అవలోకనం | |
---|---|
ప్రదేశం | సెలా కనుమ, తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 27°30′26″N 92°04′58″E / 27.5073°N 92.0827°E |
స్థితి | ప్రాంభమైంది |
నిర్వహణ వివరాలు | |
ప్రారంభ తేదీ | 2020 అక్టోబరు 15 |
ప్రారంభం | 2024 మార్చి 9 |
నిర్వాహకుడు | జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (NHIDCL) |
ట్రాఫిక్ | మోటారు వాహనాలు |
సాంకేతిక వివరాలు | |
పొడవు | 12.04 కి.మీ. |
సందుల సం. | రెండు (ఇరుదిశల్లోనూ చెరొకటి) |
వ్యుత్పత్తి
మార్చు1962 భారత చైనా యుద్ధ సమయంలో, మహావీర చక్ర అవార్డు గ్రహీత జస్వంత్ సింగ్ రావత్, సెలా, నూరా అనే ఇద్దరు స్థానిక మోన్పా అమ్మాయిల సహాయంతో ఈ పర్వత మార్గం వద్ద చైనీస్ సైన్యాన్ని నిలువరించాడు. తరువాత, సెలా చనిపోగా, నూరా చైనీయుల చేతికి చిక్కింది. ఒక చోటి నుండి మరొక చోటికి పరుగెత్తుతూ రావత్, 72 గంటలపాటు శత్రువును అడ్డుకున్నాడు. చైనీయుల చేతికి బందీగా చిక్కిన స్థానిక సరఫరాదారు, భారత సైన్యం తరఫున యుద్ధం చేస్తున్నది ఒక్క సైనికుడే నని వారికి చెప్పాడు. చైనీయులు రావత్ స్థానాన్ని ఆక్రమించి రావత్‌ను చంపేసారు.[3] భారత సైన్యం జస్వంత్ సింగ్ కోసం జస్వంత్ గఢ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించింది. సెలా చేసిన త్యాగానికి గాను ఆమె పేరు మీద కనుమకు, సొరంగానికి, సరస్సుకూ పేరు పెట్టారు.[4] సెలా సొరంగానికి ఉత్తరాన జాంగ్‌కు తూర్పున 2 కిమీ దూరంలో ఉన్న జలపాతానికి నురానాంగ్ జలపాతం అని నూరా పేరు పెట్టారు.
స్థానం
మార్చుసెలా సొరంగం సెలా-చర్బెలా శిఖరం గుండా వెళుతుంది, ఇది తవాంగ్ జిల్లాను పశ్చిమ కమెంగ్ జిల్లా ( దిరాంగ్ సర్కిల్ ) నుండి వేరు చేస్తుంది. ఇది సెలా పాస్‌కు పశ్చిమాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. సొరంగం 3,000 మీటర్లు (9,800 అ.) ఎత్తున ఉంది. సెలా కనుమ మాత్రం 4,200 మీటర్లు (13,800 అ.) ఎత్తున ఉంది. ఇది సెలా పాస్‌లో శీతాకాలం ఉండే హిమపాతాల నుండి తప్పుకుంటుంది. తవాంగ్‌కు ప్రయాణ సమయాన్ని గంటపాటు తగ్గుతుంది.[5]
నిజానికి ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉంటాయి. మొదటి సొరంగం, 475 మీటర్లు (1,558 అ.) పొడవు, దానిలో ప్రవేశించే రేఖాంశ శిఖరం ద్వారా కత్తిరించబడుతుంది
వ్యూహాత్మక ప్రాముఖ్యత
మార్చుఈ వ్యూహాత్మక సొరంగం ప్రాజెక్ట్ వర్తక్ కింద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మించింది. దీని వలనభారతదేశ తూర్పు సెక్టార్‌లో వాస్తవ నియంత్రణ రేఖకు ఆవల చైనా వారి వెస్ట్రన్ థియేటర్ కమాండ్ నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో భారత సైనిక సామర్థ్యాలను మెరుగుపడతాయి. ఈ సొరంగం వలన తేజ్‌పూర్‌లోని భారత సైన్యపు IV కార్ప్స్ ప్రధాన కార్యాలయం నుండి తవాంగ్‌కు పట్టే ప్రయాణ సమయం కనీసం 10 కి.మీ. లేదా 1 గంట తగ్గుతుంది. సాధారణంగా శీతాకాలంలో మంచుతో కప్పడిపోయి, తవాంగ్‌కు రవాణా సౌకర్యం తెగిపోయే పరిస్థితి మారిపోయి, ఎన్‌హెచ్13 సకల వాతావరణ రహదారిగా మారుతుంది.[1] ఈ సొరంగాల వలన, బోమ్డిలా తవాంగ్‌ల మధ్య 171 కి.మీ.ల రహదారి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉంటుంది.
BRO భారత-చైనా వాస్తవ నియంత్రణ రేఖపై (మెక్‌మహాన్ రేఖ లోని వివాదాస్పద భాగాలు) సంగెస్టర్ త్సో (తవాంగ్‌కు ఉత్తరాన) నుండి బమ్ లా కనుమ వరకు ఉన్న రహదారిని కూడా మెరుగుపరుస్తోంది.[1] ఎన్‌హెచ్13 ను రెండు వరుసల రోడ్డుగా ఉన్నతీకరించింది.[1]
సెలా కనుమ సముద్ర మట్టం నుండి 4,200 మీటర్ల ఎత్తున ఉంది.[1] అయితే ఈ రెండు సొరంగాలు మాత్రం 3,000 మీటర్ల ఎత్తున ఉన్నాయి. సొరంగం సెలా-చాబ్రేలా శిఖరం గుండా వెళుతుంది. కొత్త 12.37 కి.మీ.ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సొరంగం నుండి నూరానంగ్ వైపు ఉన్న బలిపర-చౌదుర్-తవాంగ్ రహదారిని కలుస్తుంది. సెలా కనుమకు వెళ్ళే మార్గంలో హెయిర్‌పిన్ వంపులను తప్పించవచ్చు. సరికొత్త న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM) ని ఉపయోగించి నిర్మించిన సొరంగం మంచు కురిసే రేఖకు చాలా దిగువన ఉండడంతో, మంచు తొలగించడం లాంటి సవాళ్లు లేకుండా సకల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణాలు నిరాటంకంగా చెయ్యవచ్చు.
నిర్మాణ విశేషాలు
మార్చు- 2018 ఫిబ్రవరి: 2018-19 యూనియన్ బడ్జెట్‌లో ప్రాజెక్టును ప్రకటించారు.[6]
- 2019 ఫిబ్రవరి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో, 2022 ఫిబ్రవరి నాటికి, సొరంగం సిద్ధం అవుతుంది.[1][7]
- 2019 సెప్టెంబరు: అప్రోచ్ రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. నెలాఖరులో సొరంగం తవ్వకం ప్రారంభమైంది.[8]
- 2020 సెప్టెంబరు: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, 2020 సెప్టెంబరు 4న పని పురోగతిని పరిశీలించి, "పని పురోగతిలో ఉన్నందుకు సంతోషంగా ఉంది, 2021 చివరి నాటికి అన్ని పనులు పూర్తవుతాయి" అన్నాడు.[5]
- 2021 జూలై: 980 మీటర్ల ఎస్కేప్ ట్యూబ్ తవ్వకం 2021 జూలైలో పూర్తయింది [9] ఇది 1,555 రెండు-వరుసల ట్యూబ్‌లో ఏకకాల కార్యకలాపాలను చేపట్టి, సెలా సొరంగాన్ని వేగంగా పూర్తి చేయడానికి, 8.8 కి.మీ. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికీ దోహదపడుతుంది.
- 2024 మార్చి: అరుణాచల్ ప్రదేశ్‌లో ర్యాలీకి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సొరంగాన్ని జాతికి అంకితం చేశాడు.
ఇవి కూడా చూడండి
మార్చు- భారత-చైనా సరిహద్దు రోడ్లు
- భలుక్పాంగ్-తవాంగ్ రైల్వే, నిర్మాణంలో ఉంది
- అరుణాచల్ సరిహద్దు రహదారి, ఎగువ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇండో-చైనా LOC వెంట ప్రతిపాదించబడింది
- తూర్పు-పశ్చిమ పారిశ్రామిక కారిడార్ రహదారి, అరుణాచల్ ప్రదేశ్ దిగువ పర్వతాలలో ప్రతిపాదించబడింది
- Z-మలుపు సొరంగం
- జోజి-లా సొరంగం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Sela tunnel construction to start soon, Business Standard, 21 Nov 2018.
- ↑ "Delay hits Sela tunnel project in Arunachal Pradesh".
- ↑ "Indian Army's 'Immortal' soldier Jaswant Singh Rawat, on duty even after being martyred" (in ఇంగ్లీష్). 2021-10-21. Archived from the original on 2022-10-17. Retrieved 2022-05-21.
- ↑ जसवंत-सेला शहीद न हों, इसलिए बनी सेला टनल:1962 जैसे नहीं घुस पाएगा चीन; सड़कों, पुलों और सुरंगों का सुरक्षा जाल तैयार, Bhaskar, accessed 14 June 2023.
- ↑ 5.0 5.1 "Sela Pass tunnel to be ready by 2021: CM". Arunachal Observer. 4 September 2020.
- ↑ Sela pass tunnel, The Economic Times, 1 February 2018.
- ↑ "PM Modi inaugurates Sela tunnel project in Arunachal Pradesh". Business Standard. 9 February 2019.
- ↑ "Work on important Sela tunnel connecting with Tawang to begin by September end". The New Indian Express. 20 September 2019.
- ↑ Last blast of Sela Tunnel’s escape tube conducted by DG Border Roads through video conferencing, Ministry of Defence Press release, 22 July 2022.