సోనియా ఆకుల
సోనియా ఆకుల తెలుగు సినిమా నటి. ఆమె 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[1][2]
సోనియా ఆకుల | |
---|---|
జననం | సోనియా ఆకుల 31 మే |
జాతీయత | భారతదేశం |
విద్య | ఎల్.ఎల్.బి |
వృత్తి | సినీ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2019– ప్రస్తుతం |
తల్లిదండ్రులు | ఆకుల చక్రపాణి, మల్లీశ్వరి |
బంధువులు | ఆకుల నాగేష్ (సాప్ట్‌వేర్ ఉద్యోగి), డా. ఆకుల నరేష్ |
సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొని[3][4], నాల్గొవ వారంలో ఎలిమినేట్ అయ్యింది.[5][6]
జననం, విద్యాభాస్యం
మార్చుసోనియా ఆకుల మే 31న తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, మంథనిలో ఆకుల చక్రపాణి, మల్లీశ్వరి దంపతులకు జన్మించింది. ఆమె తొమిదో తరగతి వరకు మంథనిలో, పదవ తరగతి వరంగల్ హన్మకొండ లోని ఎస్.ఆర్ స్కూల్ లో పూర్తి చేసింది. సోనియా హైదరాబాద్ లోని భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో బిటెక్ పూర్తి చేసింది. ఆమె బిటెక్ అనంతరం కొంతకాలం ఒక సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.[7]
ఆసా స్వచ్చంద సంస్థ
మార్చుచిన్ననాటి నుండి సేవ దృక్పధం కలిగినా సోనియా 2017లో సామాజానికి తన వంతు సేవ చేయాలని 'ఆసా' (యాక్షన్ ఎయిడ్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్ మెంట్ ) అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది.దీని ద్వారా అనాథ పిల్లలకు ఆర్థిక సాయం, లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల పంపిణీ , దిశా అత్యాచార నింధితుడి భార్య రేణుకకు నెలకు పదిహేను వేలు సాయం, 'ప్రాజెక్ట్ ప్రేరణ' పేరుతో యువతకు అవగాహన కార్యక్రమాలు, 50 మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించాలని లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువుకయ్యే ఖర్చులను సేకరించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.[8][9]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | చిత్రం | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | జార్జ్ రెడ్డి | జార్జ్ రెడ్డి చెల్లి | తెలుగు | మొదటి సినిమా | |
2019 | కరోనా వైరస్ | శాంతి | తెలుగు | రెండవ సినిమా | [10] |
2021 | ఆశ ఎన్‌కౌంటర్ | దిశ | తెలుగు | మూడవ సినిమా | [11] |
మూలాలు
మార్చు- ↑ The New Indian Express (14 October 2020). "Activist first, actor next, the story of Sonia Akula". The New Indian Express. Archived from the original on 6 November 2020. Retrieved 31 May 2021.
- ↑ The New Indian Express. "Why there's a whole lot more to Sonia Akula than you saw in Telugu hit George Reddy". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 21 January 2021. Retrieved 31 May 2021.
- ↑ "ఆర్జీవీ హీరోయిన్, కరీంనగర్ రైతు బిడ్డ... 'బిగ్ బాస్ 8' సోనియా ఆకుల బ్యాగ్రౌండ్ తెలుసా?". 1 September 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ NT News (1 September 2024). "బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్‌గా ఆర్జీవీ హీరోయిన్ సోనియా.. ఈ బ్యూటీ స్వస్థలం పెద్దపల్లి..!". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
- ↑ Sakshi (30 September 2024). "సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Eenadu (30 September 2024). "ఈ వారం సోనియా ఎలిమినేట్.. చివరిలో ఊహించని బాంబు పేల్చిన నాగార్జున". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ The New Indian Express (3 May 2017). "Telangana directory for aspiring actors underway". The New Indian Express. Archived from the original on 31 May 2021. Retrieved 31 May 2021.
- ↑ Nava Telangana (5 July 2020). "సేవలోనూ.. నటనలోనూ." Archived from the original on 2020-07-05. Retrieved 31 May 2021.
- ↑ Namasthe Telangana (5 February 2022). "కాలేజీ రోజుల్లోనే సేవ.. ఇప్పుడు అనాథ ఆడబిడ్డల కోసం కృషి". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
- ↑ Telangana Today, Entertainment (24 June 2020). "'RGV told that acting comes naturally to me'". Archived from the original on 5 July 2020. Retrieved 31 May 2021.
- ↑ Sakshi Post (5 February 2021). "Censor Board Members Reject RGV's Disha Encounter Plot, Find Out Why". Sakshi Post (in ఇంగ్లీష్). Archived from the original on 31 May 2021. Retrieved 31 May 2021.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సోనియా ఆకుల పేజీ