స్తంభం

(స్తంభము నుండి దారిమార్పు చెందింది)

స్తంభం (Pillar) ఒక ప్రత్యేకమైన నిర్మాణము. స్తంభమనేది లావుకు తగ్గ పొడవుతో ఉండే నిర్మాణ విశేషం. స్తంభాలు ముఖ్యంగా పైకప్పు బరువును మొయ్యటానికి వాడతారు. వీటిని పెద్ద ఇల్లు, మేడలు, వంతెనలు మొదలైనవి కట్టడానికి ఉపయోగిస్తారు. ఇవి గుండ్రంగా గాని లేదా చదరంగా గాని వివిధ పరిమాణాలలో ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా కొండలలోని కఠిన శిలలను స్తంభ రూపంలో చెక్కి, కావలిసిన నిడివి గలవి తయారు చేసుకునే వారు. ప్రస్తుతము వీటిని ఎక్కువగా ఇసుక, సిమెంటు, కంకర, నీరు మిశ్రమం (కాంక్రీటు), లేదా ఇనుము లేదా ఉక్కుతో తయారుచేస్తున్నారు. ఈ రెండిటి మధ్య కాలంలో కలపతో కూడా (ముఖ్యంగా టేకు చెట్టు) స్తంభాలు చేసేవారు.

భాషా విశేషాలు

మార్చు

సంస్కృత భాషలో స్తంభము పదానికి వివిధ ప్రయోగాలు ఉన్నాయి.[1] స్తంభము [ stambhamu ] stambhamu. సంస్కృతం n. A pillar, a post, a stalf, a stem, trunk, కంబము, Stupidity, stupefaction. Stoppage or suppression of any sense or power caused by magical incantations or drugs, &c. ఊరకుండుట, మ్రామపాటు, నిలుపడము. అరటి స్తంభము the stem of a plantain tree. స్తంభనము stambhanamu. n. Stopping, obstruction, hindrance. నిలుపడము, ఆటంక పరచడము. అగ్నిస్తంభనము restraining the power of fire by magical means జలన్తంభనము continuing along while under water without inconvenience. వాయుస్తంభనము raising the body in the air and maintaining it in such a position without support. భూతస్తంభనము the laying of ghosts, &c. మృగస్తంభనము restraining wild beasts. ఖడ్గస్తంభనము preventing a sword from doing injury. గతిస్తంభనము stoppage, preventing a man from moving. స్తంభించు stam-bhinṭsu. v. n. To stop, to become motionless, stupefied or insensible, నిలిచిపోవు, మ్రానుపడు. ఈ మాట విని స్తంభించి పోయినాడు on hearing this he stood stock-still. స్తంభించు or స్తంభింపజేయు stambhinṭsu. v. a. To strike dead, depriev of the power of moving, make motionless. కదలకుండా నిలిచేటట్టు చేయు, మ్రానుపడజేయు.

రకాలు

మార్చు
 
వేయి స్తంభాల గుడి. ఇందులో స్తంభ నిర్మాణం పరిశీలించవచ్చు
  • అశోక స్తంభం : అశోకుడు నిర్మించిన చాలా స్తంభాలు.
  • ధ్వజ స్తంభం : దేవాలయంలో గర్భగుడికి ఎదురుగా ఎత్తుగా కట్టబడిన స్తంభం.
  • విద్యుత్ స్తంభం : తీగలను భూమికి తగలకుండా విద్యుత్ను ఒక చోటినుండి మరొక చోటికి తరలించడానికి వాడతారు. వీటిని కలపతో గాని, సిమెంట్ తో గాని లేదా లోహపు గొట్టాలతో గాని తయారుచేస్తారు.
  • ఘంట స్తంభం : వీధి లోని అందరికీ అనుకూలంగా రహదారి కూడలిలో పెద్ద ఘంటను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.ఇప్పుడు ఇవి దాదాపు కనుమరుగయి పొయ్యాయి.
  • దీప స్తంభం : సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
  • కప్ప స్తంభం : కొన్ని దేవాలయాలలో ఉన్న ఇలాంటి స్తంభాన్ని పట్టుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని నమ్మకం. విశాఖ పట్నం, సింహాచలం దేవాలయంలో కప్పస్థంబం ఉంది.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=స్తంభం&oldid=4141067" నుండి వెలికితీశారు