హనుమాన్ పాలెం గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

హనుమాన్ పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
హనుమాన్ పాలెం is located in Andhra Pradesh
హనుమాన్ పాలెం
హనుమాన్ పాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°15′55″N 80°46′48″E / 16.2652°N 80.780°E / 16.2652; 80.780
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లిపర
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522301
ఎస్.టి.డి కోడ్ 08644

గ్రామ భౌగోళికం

మార్చు

హనుమాన్ పాలెం కృష్ణ నది కుడివైపు కట్టకి కుడి వైపున ఉంది.

గ్రామములోని విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

మార్చు

కృష్ణనది కుడికట్ట కుడి పక్కన ఒక కాలువ ఉంది. దీనినే పెద్దకాలువ అని కూడా అంటారు. ఇది విజయవాడ నుంచి దిండు వరకు ఉంది. దిండు వద్ద బంగాళాఖాతములో కలుస్తుంది. ఈ కాలువ పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాల పంట భూములు, ఈ నీరు పైన ఆధారపడి ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కొల్లిపర దావీదు, సర్పంచిగా ఎన్నికైనాడు.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

మార్చు
  1. హనుమాన్ పాలెంకి పక్క న ఉన్న యాదవపాలెంలో శ్రీరామనవమి చాల బాగా చేస్తారు. నవమి అయిన మరుచటి రోజున సంతర్పణ చేస్తారు.
  2. హనుమాన్ పాలెంలో కొలువుదీరనున్న శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహ పనులు చురుకుగా సాగుచున్నవి. [2]

గ్రామములోని ప్రధాన పంటలు

మార్చు

హనుమాన్ పాలెంలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, అరటి, పసుపు, కంది, మినుము, పెసర మొదలగు మెట్ట పంటలు పండుతాయి.

గ్రామములోని ప్రధాన వృత్తులు

మార్చు

ఈ గ్రామములో అందరూ వ్యవసాయం పైన ఆధార పడి ఉన్నవాళ్ళే. ఎక్కువ రైతులు, కూలీలు.