హరివంశ్ నారాయణ్ సింగ్

(హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ నుండి దారిమార్పు చెందింది)

హరివంశ్ నారాయణ్ సింగ్ (జననం 1956 జూన్ 30) భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త. అతను భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్. అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. జర్నలిజంలో డిప్లొమా కూడా పొందాడు. అతను రాంచీలో నివాసం ఉంటాడు.[1][2]

హరివంశ్ నారాయణ్ సింగ్
హరివంశ్ నారాయణ్ సింగ్


ముందు ప్రొఫెసర్.పి.జె.కురియన్

నియోజకవర్గం బీహార్

వ్యక్తిగత వివరాలు

జననం 30 జూన్ 1956
(వయస్సు 62)
బలియా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ జనతాదళ్(యునైటెడ్)
జీవిత భాగస్వామి ఆశా

పాత్రికేయుడిగా

మార్చు

టైమ్స్ ఆఫ్ ఇండియాతో ప్రారంభించి పాత్రికేయుడిగ పలు వేర్వేరు మీడియా ప్రచురణలలో పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు అదనపు మీడియా సలహాదారుగా పనిచేశారు. 1989 లో అప్పటికి దాదాపు కనుమరుగైపోయిన స్థితిలో ఉన్న హిందీ ప్రచురణ, ప్రభాత్ ఖబర్‌లో చేరాడు. సర్క్యులేషను పరంగా భారతదేశంలోని అగ్రశ్రేణి వార్తాపత్రికలలో ఒకటిగా దాన్ని నిలిపాడు. పశుగ్రాసం కుంభకోణంతో సహా అనేక ఉన్నత స్థాయి పరిశోధనా కథనాలకు గాను ఈ వార్తాపత్రిక ప్రసిద్ధి చెందింది.[3]

రాజకీయ జీవితం

మార్చు

2014 లో జనతాదళ్ (యునైటెడ్), సింగ్‌ను బీహార్ రాష్ట్రం నుంచి ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు నామినేట్ చేసింది.[4] 2018 ఆగస్టు 8 న, జాతీయ ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థిగా ఆరేళ్ల కాలానికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థిపై 125 - 105 ఓట్లతో విజయం సాధించాడు. గత నలభై ఏళ్ళలో ఇండియన్ నేషనల్ కాంగ్రెసుకు చెందని వ్యక్తి ఈ పదవిని నిర్వహించడం ఇది మూడవసారి.

మూలాలు

మార్చు
  1. "Harivansh Narayan Singh". Retrieved 14 October 2015.
  2. "MR. HARIVANSH NARAYAN SINGH". Archived from the original on 6 ఏప్రిల్ 2015. Retrieved 14 October 2015.
  3. "Harivansh Narayan Singh: From Rs 500 job to RS Dy Chairperson, 10 things you should know about him".
  4. "All five candidates elected unopposed to RS from Bihar". 1 February 2014. Retrieved 14 October 2015.