హరి అచ్యుతరామ శాస్త్రి

హరి అచ్యుతరామ శాస్త్రి జంత్ర గాత్రజ్ఞులు. శాస్త్రీయ, లలిత, చలన చిత్ర సంగీతములలో బహు ప్రఖ్యాతి నార్జించిన వారు. రుద్రం, మహన్యాసం, విష్ణు, లలితా సహస్రనామ స్తోత్రాలను, సంధ్యావందనం, ఆదిత్య హృదయం, సత్యనారాయణవ్రతం, వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం, వినాయక పూజ, మహాలక్ష్మీ పూజ, రుద్రాభిషేకం, వేంకటేశ్వర గద్యం, గద్యత్రయం, అయ్యప్ప స్మరణం, ఇత్యాది బహు క్యాసెట్లు రూపొందించినవారు.[1]

జీవిత విశేషాలుసవరించు

అచ్యుతరామశాస్త్రి ఆంధ్ర రాష్ట్ర, కృష్ణా జిల్లా లోని బందరులో, డిసెంబరు 19, 1929 లో హరి నాగభూషణం గారి ద్వితీయ పుత్రుడిగా జన్మించారు. వీరి తండ్రి గారు ప్రముఖ ఆంధ్ర గాయకులు, వాగ్గేయకారులు. ఇంటిలోని సంగీత వాతావరణం మూలంగా ఈయనకు కూడా సంగీత జ్ఞానం అబ్బింది. ఆయన బి.ఎ. చదివారు. చెన్నైలో అలనాటి మేటి సినీ సంస్థలైన విజయా, వాహినిలలో వయొలిన్ (వాయులీన) కళాకారుడిగా కొలువు తీరారు. వీరి వివాహం ఆగుస్టు 15, 1954 లో జరిగింది. వయలిన్ కళాకారుడిగా అనేక సినీ రంగ సంగీత దర్శకుల వద్ద పనిచేశారు. వీరిలో అద్దేపల్లి రామారావు, పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరి రాజేశ్వరరావు, ఘంటశాల గార్లు ఉన్నారు. ఒక ట్రాక్ ఆర్టిస్ట్ గా మంచిగా రాణించారు. సినీ పరిశ్రమలో మంచి పేరు గడించారు.

తెలుగులో నిత్య పూజలు, రుద్రం, నమకం, చమకం, అష్టోత్తరం, సూక్తాలు, సత్యనారాయణ వ్రతం తదితర క్యాసెట్లు, సీ డీ లు రూపొందించారు. ఇవి సామాన్య జనాలకు అందుబాటులోకి రావండమే కాకుండా, విధి విధానాలతో శాస్త్రయోక్తముగా పూజలు చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఇచ్చాయి. శాస్త్రి గారి ఈ వినూత్న ప్రక్రియ అనూహ్యముగా ఫలించింది. వారికి మంచి పేరు తెచ్చిపెట్టింది.[2]

పుస్తకాలుసవరించు

 • సద్గురు శ్రీ త్యాగరాజు పంచరత్నాలు.[3]

రూపొందించిన క్యాసెట్లుసవరించు

 • ఆదిత్య హృదయం[4]
 • సూర్యసూక్తం
 • సూర్యనమస్కార మంత్రం
 • శ్రీ ఆదిత్య స్తోత్రం
 • శ్రీ సూర్య అష్టోత్తరం
 • ఆదిత్య కవచం
 • ఆదిత్య ప్రాతః స్మరణం
 • శ్రీ సూర్యమండలాష్టకం
 • పంచాంగ రుద్రం
 • గణపతి ధ్యానం
 • శాంతి మంత్రం
 • పంచముక్త ద్యానం
 • న్యాస మంత్రం
 • హంస గాయత్రి
 • శ్రీ వరలక్ష్మి వ్రత పూజా విధానం[5]
 • మహన్యాసం[6]
 • ద్వాదశ జ్యోతిర్మింగ స్తోత్రం[7]
 • పంచసూక్తం[8]
 • రుద్రనామకవచం[9]
 • శివస్త్రోత్రం[10]
 • శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రం[11]

మరణంసవరించు

2012 మార్చి 25 న ఆయన మరణించారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు