హాట్సింగరి
హాట్సింగరి, అస్సాం రాష్ట్రంలోని దక్షిణ సల్మారా జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. గతంలో ఇది దక్షిణ సల్మారా సబ్ డివిజన్ ప్రధాన కార్యాలయంగా ఉండేది. 2016, జనవరి 16న అస్సాం ముఖ్యమంత్రి శ్రీ తరుణ్ గొగోయ్, ఇతర 4 జిల్లాలతోపాటు దక్షిణ సల్మారాను పరిపాలనా జిల్లాగా ప్రకటించాడు.[1] 2016, ఫిబ్రవరి 9న జిల్లాను ప్రారంభించారు.
హాట్సింగరి | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°42′59″N 89°53′55″E / 25.71647°N 89.89858°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | దక్షిణ సల్మారా |
Government | |
• Type | ప్రజాస్వామ్యం |
• Body | భారత ప్రభుత్వం |
Elevation | 28 మీ (92 అ.) |
జనాభా (2011) | |
• Total | 5,55,114 |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఏఎస్-34 |
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణంలో 3445 మంది జనాభా ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 77.73% కాగా, ఇది జాతీయ సగటు అక్షరాస్యత 73.72% కంటే ఎక్కువగా ఉంది.
పద వివరణ
మార్చుహాట్, సింగిమరి అనే రెండు వేర్వేరు పదాల నుండి హాట్సింగరి అనే పేరు వచ్చింది. హాట్ అనే పదానికి వారపు సంత అని అర్ధం. ఇక్కడ ప్రతి ఆదివారం సంత నిర్వహించబడుతుంది. అందుకే దీనికి హాట్ అనే పదం వచ్చింది. సింగిమారి అంటే క్యాట్ ఫిష్ ఫిషింగ్ అని అర్థం,
అస్సాం రాష్ట్ర దక్షిణ ఒడ్డున పశ్చిమ భాగంలో ఈ పట్టణం ఉంది. దీనికి దక్షిణాన మంకాచార్ పట్టణం, పశ్చిమాన బ్రహ్మపుత్రా నది ఉపనది జింజిరామ్ నది, తూర్పున మేఘాలయ రాష్ట్రం ఉంది. ఈ పట్టణం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి కేవలం 3 కి.మీ.ల దూరంలోనే ఉంది.
సంత
మార్చుప్రతి ఆదివారం ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు ఇక్కడ వారపు సంత జరుగుతుంది. 2 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెటు అస్సాం రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడ పశువులు, కూరగాయలు, జీడిపప్పు, ఐరన్ స్టీల్ వస్తువులు, కలప, పండ్లు, పౌల్ట్రీ, జనపనార, దుస్తులు, బొమ్మలు, అపరాలు, పప్పుధాన్యాలు, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, మెకానికల్ వస్తువులు, అనేక ఇతర వస్తువులు అమ్ముతారు.
షాపింగ్ మాల్
మార్చుఎం బజార్ అనే షాపింగ్ మాల్ 2019, డిసెంబరు 28న ప్రారంభించబడింది.[2]
మూలాలు
మార్చు- ↑ "CM Tarun Gogoi announces 5 new districts in Assam on Independence Day". Daily News and Analysis. Guwahati. Press Trust of India. 15 August 2015. Retrieved 24 December 2020.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-29. Retrieved 2020-12-23.
ఇతర లంకెలు
మార్చు- "Fekamari Development Block". cic.nic.in. Archived from the original on 13 February 2012. Retrieved 24 December 2020.
- "Hatsingimari Facts and Census Reports". Govt. Of India.
- "New District South Salmara Mankachar Announced". DNA India.
- "Police District". Assam Tribune. Archived from the original on 2016-03-25. Retrieved 2021-12-28.