హాఫ్లాంగ్
హాఫ్లాంగ్ అస్సాం రాష్ట్రంలోని దిమా హసాయో జిల్లా (గతంలో ఉత్తర కాచర్ హిల్స్ జిల్లా) ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. ఇది అస్సాం రాష్ట్రంలోని ఏకైక కొండప్రాంతం.[3] హాఫ్లాంగ్ అంటే చీమల కొండ (దింసా పదం) అని అర్థం.[4] గౌహతి నుండి హఫ్లాంగ్ 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తు ఉంది.
హాఫ్లాంగ్
తెల్ల చీమలపుట్ట పట్టణం | |
---|---|
పట్టణం | |
Nickname: తూర్పు స్విట్జర్లాండ్ | |
Coordinates: 25°10′08″N 93°00′58″E / 25.169°N 93.016°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | దిమా హసాయో |
Government | |
• Body | హాఫ్లాంగ్ పురపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• Total | 12.79 కి.మీ2 (4.94 చ. మై) |
Elevation | 966.216 మీ (3,170.000 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 43,756 |
భాషలు | |
• లింగ్వా ఫ్రాంకా | హాఫ్లాంగ్ హిందీ[2] |
• బోధనా మాద్యమం | బెంగాళీ, అస్సామీ, ఇంగ్లీష్[2] |
• స్థానిక భాష | దింసా[2] |
Time zone | UTC+05:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 788819 |
టెలిఫోన్ కోడ్ | 03673 |
ISO 3166 code | IN-AS |
Vehicle registration | ఏఎస్ 08-X XXXX |
ఈ కొండ భూభాగం ప్రకృతి స్వర్గం, విస్తృత ప్రకృతి దృశ్యాలు, పచ్చదనంతో, పొగమంచుతో కప్పబడిన కొండలతో నిండి ఉంటుంది.
వాతావరణం
మార్చుహాఫ్లాంగ్ ప్రాంతంలో ఉప ఉష్ణమండల స్థితి ఉంటుంది. ఇది ఉష్ణమండల సవన్నా వాతావరణం కంటే తక్కువగా ఉంటుంది.
జనాభా
మార్చు2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం హాఫ్లాంగ్ జనాభా 43,756గా ఉంది. ఇందులో పురుషులు 45%, స్త్రీలు 55% ఉన్నారు. హాఫ్లాంగ్ సగటు అక్షరాస్యత రేటు 92% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 85%, స్త్రీ అక్షరాస్యత 75%గా ఉంది. హాఫ్లాంగ్‌లోని జనాభాలో 12% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
భాషలు
మార్చుఇక్కడి స్థానికులు బెంగాలీ లిపిలో రాయబడిన దింసా భాషను ఎక్కువగా మాట్లాడుతారు. బెంగాలీ, అస్సామీ, ఆంగ్ల భాషలను బోధనా మాధ్యమంగా ఉపయోగిస్తారు. హాఫ్లాంగ్ హిందీ అనేది ఈ పట్టణం భాష.[2]
రాజకీయాలు
మార్చుహాఫ్లాంగ్ పట్టణం అటానమస్ డిస్ట్రిక్ట్ ( లోక్‌సభ నియోజకవర్గం) లో భాగంగా ఉంది.
ఇతర వివరాలు
మార్చు- బ్రిటీష్ కాలంలో ఇక్కడ ఎనిమిది పెద్ద సరస్సులు ఉన్నాయి. ఇవి హాఫ్లాంగ్ పట్టణానికి అలంకరణగా నిలిచాయి. హాఫ్లాంగ్‌కు "ది ల్యాండ్ ఆఫ్ లేక్స్" అనేపేరు వచ్చింది. ప్రస్తుతం నాలుగు సరస్సులు మాత్రమే మిగిలి ఉన్నాయి. హఫ్లాంగ్ సరస్సుతోపాటు హజోంగ్ సరస్సు కూడా ఉంది.
- హాఫ్లాంగ్ కొండల పైన ఉన్న ఫియాంగ్‌పుయి చర్చి, డిమా హసావో జిల్లాలో అతిపెద్ద చర్చి.
- హాఫ్లాంగ్ పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న జటింగా వ్యాలీ అనే చిన్న గ్రామం ‘పక్షుల ఆత్మహత్య’కు పేరొందింది. వివిధ జాతుల వేలాది పక్షులు సెప్టెంబరు, అక్టోబరు మధ్యకాలంలో ఈ ప్రదేశానికి వచ్చి, ఎవరికి తెలియని పరిస్థితులలో మరణానికి గురవుతాయి.
- 16వ శతాబ్దపు యుగంలో దిమాసా రాజ్యానికి ఈ పట్టణం రాజధానిగా ఉంది. అప్పటి శిథిలాలు ఇప్పటికీ అక్కడ చూడవచ్చు.
రవాణా
మార్చుఅన్ని ప్రధాన నగరాల నుండి రహదారి ద్వారా హాఫ్లాంగ్ కు రవాణా సౌకర్యం ఉంది. సమీపంలోని సిల్చార్ విమానాశ్రయం నుండి హాఫ్లాంగ్ వరకు క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్ హఫ్లాంగ్.
మూలాలు
మార్చు- ↑ "Haflong City Population Census 2011 - Assam". www.census2011.co.in.
- ↑ 2.0 2.1 2.2 2.3 Col. Ved Prakash (2007). Encyclopaedia of North-East India. Atlantic Publishers & Dist. pp. 574–575. ISBN 9788126907045. Retrieved 27 June 2019.
- ↑ Haflong - Assam's Hill Station Archived 26 ఆగస్టు 2014 at the Wayback Machine, India-north-east.com
- ↑ "The tourist destinations of magi". diprnchills.gov.in. Archived from the original on 26 August 2017. Retrieved 9 November 2020.
- ↑ "Census of India, 1951. Vol. X: Assam, Manipur and Tripura. Part I-A: Report".
- ↑ "Assam (India): Districts, Cities and Towns - Population Statistics, Charts and Map".
ఇతర లంకెలు
మార్చు- దిమా హసాయో వెబ్సైట్ Archived 2019-10-03 at the Wayback Machine