యువరత్న రాణా

{{}}

యువరత్న రాణా
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం బాలకృష్ణ,
హీరా
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ ఋగ్వేద క్రియెషన్స్
భాష తెలుగు
దస్త్రం:Nt 1671 NBK-Bheeshma.jpg
నందమూరి బాలకృష్ణ

యువరత్న రాణా 1998 లో వచ్చిన సినిమా. ఋగ్వేద ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె. మీనాక్షి నాయుడు నిర్మించగా, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు . ఇందులో నందమూరి బాలకృష్ణ, హీరా రాజగోపాల్, భాగ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం సమకూర్చాడు.[1][2]

కథసవరించు

భీమరాజు ( జయ ప్రకాష్ రెడ్డి ) మాఫియా డాన్, తన అనుచరుడు రాజేశ్వరరావు ( చలపతి రావు ) ను చంపేస్తాడు. రాజేశ్వరరావు కుమారుడు రాణా ( నందమూరి బాలకృష్ణ ) భీమరాజును చంపి స్వయంగా తానే మాఫియా డాన్ అవుతాడు. అతను సమాజంలో చాలా శక్తివంతమైన వ్యక్తి అవుతాడు. ఒక అమాయక గ్రామీణ అమ్మాయి గంగ ( హీరా రాజగోపాల్ ) ను పెళ్ళి చేసుకుంటాడు. భీమరాజు కుమారుడు దేవరాజ్ ( చరణ్ రాజ్ ) రాణాను చంపడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు, కానీ ఏవీ పనిచేయవు. బాలికపై అత్యాచారం చేసినందుకు మున్సిపల్ కమిషనరు (రఘునాథ్ రెడ్డి) ను రాణా చంపాడు. విలన్లకు స్నేహితురాలైన డాక్టర్ కస్తూరి ( భాగ్యశ్రీ ) పోస్టుమార్టం చేసి, హత్య గురించి పోలీసులకు చెప్పి, రాణాను జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. రాణా కస్తూరిని కిడ్నాప్ చేసి బెదిరిస్తాడు. అతను ఆమెను చంపేటప్పుడు, శంకరం మాస్టర్ ( చంద్ర మోహన్ ) అతడిని అడ్డుకుని, తన కుమార్తెను విడిచిపెట్టమని వేడుకుంటాడు. అప్పుడు హఠాత్తుగా ఆమె తాను కోల్పోయిన సోదరేనని రాణా తెలుసుకుంటాడు. కానీ అతను అతను తన దత్తత తండ్రి రాజేశ్వరరావుకు ఇచ్చిన వాగ్దానం మేరకు, ఈ సత్యాన్ని వ్యక్తపరచలేకపోతున్నాడు. దేవరాజ్ ఈ పరిస్థితిని ఉపయోగించుకుని, కస్తూరి, రాణాల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచుతాడు. కస్తూరిని ఉపయోగించి రానాను చంపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ఈ చిత్రం చివరలో రానా తన సోదరుడని ఆమెకు తెలుస్తుంది.[3]

నటవర్గంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "మా కళ్యాణ సీతను"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:30
2. "గుమ్మ గుమ్మలారా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:47
3. "ఎప్పుడు మన"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 3:46
4. "చెంగు జారిపోతాంది"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:39
5. "రంపచికం"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:18
6. "ఓ యామినీ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 4:03
మొత్తం నిడివి:
26:03

మూలాలుసవరించు

  1. Heading. Filmibeat.
  2. Heading-2. chithr.com.
  3. Story. The Cine Bay.