హీరో - 76
(హీరో 76 నుండి దారిమార్పు చెందింది)
హీరో -76 1976, డిసెంబరు 3న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] 1975లో విడుదలైన తమిళ సినిమా వైర నెంజమ్ ను హీరో -76 పేరుతో తెలుగులో డబ్ చేశారు. నిజానికి 1973లో విడుదలైన సి.వి.శ్రీధర్ స్వంత హిందీ సినిమా గెహరీ చాల్ ను తమిళంలో పునర్మించారు.
హీరో - 76 (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.శ్రీధర్ |
---|---|
నిర్మాణం | కె.తిరువెంకటస్వామి |
నిర్మాణ సంస్థ | నందిని స్క్రీన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శివాజీ గణేశన్
- పద్మప్రియ
- ఆర్.ముత్తురామన్
- కె.బాలాజీ
- సి.ఐ.డి.శకుంతల
- సచ్చు
- ధూళిపాళ
- హలం
సాంకేతిక వర్గం
మార్చు- కథ, దర్శకత్వం: సి.వి.శ్రీధర్
- మాటలు, పాటలు: రాజశ్రీ
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, మారెళ్ళ రంగారావు
- ఛాయాగ్రహణం: పి.రాజగోపాల్
- కూర్పు: ఎన్.ఎం.శంకర్
- నిర్మాత: కె.తిరువెంకటస్వామి
పాటలు
మార్చు- ఈనాడు రాగం మధుర రాగం పైవారు భోగం ఇంద్రబోగం - వాణీ జయరాం
- కార్తీక మాసమిది కళ్యాణ కాలమిది జాతకం చూడాలి సింగారి - ఎస్.పి. బాలు, పి. సుశీల
- మై స్వీటి నీమల్లెల చిరునవ్వులే నా మదిలో పల్లవులే - ఎస్.పి. బాలు
- రాగము పాడే ఎద కదలాడే ఆశలు పొంగెను నాలో రాణి - ఎస్.పి. బాలు, పి. సుశీల