హుషారు

శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం

హుషారు 2018, డిసెంబరు 14న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాణ సారథ్యంలో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ, ప్రియా వడ్లమాని, హేమ ఇంగల్, రాహుల్ రామకృష్ణ, రమ్య పసుపిలేటి, దక్ష నాగర్కర్ తదితరులు నటించగా, సన్నీ ఎంఆర్, రాధన్, వరికుప్పల యాదగిరి సంగీతం అందించారు.[2][3]

హుషారు
హుషారు సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీహర్ష కొనుగంటి
రచనశ్రీహర్ష కొనుగంటి
నిర్మాతబెక్కెం వేణుగోపాల్
రియాజ్
తారాగణంతేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ, ప్రియా వడ్లమాని, హేమల్ ఇంగ్లే, రాహుల్ రామకృష్ణ, రమ్య పసుపిలేటి, దక్ష నాగర్కర్
ఛాయాగ్రహణంరాజ్ తోట
కూర్పువిజయ్ వర్ధన్
సంగీతంసన్నీ ఎంఆర్, రాధన్, వరికుప్పల యాదగిరి
నిర్మాణ
సంస్థ
లక్కీ మీడియా
విడుదల తేదీ
2018 డిసెంబరు 14 (2018-12-14)
దేశంభాతరదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

ఆర్య (తేజ‌స్ కంచ‌ర్ల‌), చెయ్ (అభిన‌వ్), బంటి (తేజ్ కూర‌పాటి), ధ్రువ్ (దినేష్ తేజ్‌) లు చిన్ననాటి నుండి స్నేహితులు, కలిసి చదువుకున్నారు. పెద్ద‌య్యాక అల్ల‌రి కుర్రాళ్లుగా మారి, స‌ర‌దాలు, షికార్ల‌తో కాలం వెళ్ల‌దీస్తుంటారు. వారిలో చెయ్.. రియా ప్రేమ‌లో, ఆర్య.. గీత ప్రేమ‌లో ప‌డ‌గా, మిగ‌తా ఇద్ద‌రు కూడా తమ తోడు కోసం వెదుక్కుంటుంటారు. కొంతకాలం తరువాత చెయ్ ప్రేమకు ఒడుదొడుకులు ఏర్ప‌డి రియాతో నుండి దూర‌మ‌వుతాడు. అదే సమయంలో చెయ్ కి ప్ర‌మాదం జ‌రుగడంతోపాటు క్యాన్స‌ర్ కూడా ఉన్న‌ట్టు తెలుస్తుంది. వైద్యానికి కావలసిని 30 ల‌క్ష‌లకోసం చెయ్ స్నేహితులు ఏం చేశారన్నది మిగతా కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • రచన, దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి
 • నిర్మాత: బెక్కెం వేణుగోపాల్, రియాజ్
 • సంగీతం: సన్నీ ఎంఆర్, రాధన్, వరికుప్పల యాదగిరి[5]
 • ఛాయాగ్రహణం: రాజ్ తోట
 • కూర్పు: విజయ్ వర్ధన్
 • నిర్మాణ సంస్థ: లక్కీ మీడియా

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నా నా నా (రచన: భాస్కరభట్ల రవికుమార్, సంగీతం: రాధన్)"భాస్కరభట్ల రవికుమార్బోబో శశి3:53
2."ఉండిపోరాదే (రచన: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: రాధన్)"కిట్టు విస్సాప్రగడసిద్ శ్రీరామ్2:53
3."ఫ్రెండ్ షిప్ (రచన: కృష్ణకాంత్, సంగీతం: సన్నీ ఎం.ఆర్.)"కృష్ణకాంత్తుషార్ జోషి3:30
4."పిచ్చాక్ (రచన, సంగీతం: వరికుప్పల యాదగిరి)"వరికుప్పల యాదగిరివరికుప్పల యాదగిరి4:08
5."నాటు నాటు (రచన: కృష్ణకాంత్, సంగీతం: రాధన్)"కృష్ణకాంత్రాహుల్ సిప్లిగంజ్, ప్రియా హిమేష్1:43
6."నువ్వే నువ్వే (రచన: కృష్ణకాంత్, సంగీతం: సన్నీ ఎం.ఆర్.)"కృష్ణకాంత్అర్జిత్ సింగ్3:10
7."ఓ పిల్లా కాబూమా (రచన: కళానిధి మాస్టార్జీ, సంగీతం: వరికుప్పల యాదగిరి)"కళానిధి మాస్టార్జీరాహుల్ రామకృష్ణ1:28
8."ఉండిపోరాదే (రచన: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: రాధన్)"కిట్టు విస్సాప్రగడసిద్ శ్రీరామ్2:33
9."కాబూమ్ (రచన: రోల్ రైడా, సంగీతం: సన్నీ ఎం.ఆర్.)"రోల్ రైడారోల్ రైడా1:30
10."ఉండిపోరాదే (రచన: స్ఫూర్తి యాదగిరి, సంగీతం: రాధన్)"స్ఫూర్తి యాదగిరిస్ఫూర్తి యాదగిరి2:25
11."బ్యాడ్ బాయ్స్ (రచన: కృష్ణకాంత్, సంగీతం: సన్నీ ఎం.ఆర్.)"కృష్ణకాంత్రోల్ రైడా, సన్నీ ఎం.ఆర్.3:00
మొత్తం నిడివి:30:13

ఇతర వివరాలు మార్చు

 1. ఈ చిత్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా 3/5 రేటింగ్ ఇచ్చింది.[4]
 2. థియేటర్లలో 50రోజులు ప్రదర్శించబడింది.[6]
 3. రాజ్ సూర్య దర్శకత్వంలో చందన్ ఆచార్, అనూప్ రేవన్న, శ్రీమహదేవ్ లతో కన్నడంలో రిమేక్ చేయబడింది.[7]

మూలాలు మార్చు

 1. "'Husharu' gearing up for an August release? - Times of India". The Times of India.
 2. "'Husharu': The youthful comedy-drama gets a release date - Times of India". The Times of India.
 3. సితార, రివ్యూ. "హుషారు". www.sitara.net. Archived from the original on 22 జూలై 2020. Retrieved 22 July 2020.
 4. 4.0 4.1 "Hushaaru movie review {3/5}: You'll come out of theatres with a smile". The Times of India.
 5. "Hushaaru - All Songs - Download or Listen Free - JioSaavn". JioSaavn.
 6. "Rahul Ramakrishna in an American thriller". The Hindu. February 2, 2019.
 7. "Chandan Achar to be seen in Husharu remake in Kannada - Times of India". The Times of India.

ఇతర లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=హుషారు&oldid=4204216" నుండి వెలికితీశారు