హే సినామికా
హే సినామికా 2022లో విడుదలైన సినిమా. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు బృందా దర్శకత్వం వహించింది. దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరీ, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2022 మార్చి 4న విడుదలైంది.[2]
హే సినామికా | |
---|---|
దర్శకత్వం | బృందా |
రచన | మదన్ కార్కీ |
తారాగణం | దుల్కర్ సల్మాన్ అదితిరావు హైదరీ కాజల్ అగర్వాల్ |
ఛాయాగ్రహణం | ప్రీత జయరామన్ |
కూర్పు | రాధా శ్రీధర్ |
సంగీతం | గోవింద్ వసంత |
నిర్మాణ సంస్థలు | |
విడుదల తేదీs | 3 మార్చి 2022 31 మార్చి 2022 (ఓటీటీలో విడుదల)[1] | (థియేట్రికల్ రిలీజ్)
సినిమా నిడివి | 149 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఆర్జే గా పనిచేసే ఆర్యన్ (దుల్కర్ సల్మాన్) కి మౌన(అదితి రావ్ హైదరి) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి పెళ్ళికి దారి తీస్తుంది. పెళ్లి తరువాత ప్రతి గొడవలోను ఆర్యన్ సర్దుకుపోతుంటాడు. అది మౌన కు నచ్చదు. ఆమె ఆర్యన్ నుండి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ జీవితంలోకి సైకాలజిస్ట్ డాక్టర్ మలార్ (కాజల్ అగర్వాల్) ప్రవేశిస్తుంది. వీరిద్దరూ చనువుగా ఉండడం చుసిన మౌన తన భర్త తనకే కావాలని మలార్ తో యుద్దానికి దిగుతుంది. భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన కాజల్ ఎవరు ? చివరికి ఆర్యన్, మౌన కలిసారా..? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్
- కథ, స్క్రీన్‌ప్లే: మదన్ కార్కీ
- దర్శకత్వం: బృందా
- సంగీతం: గోవింద్ వసంత
- సినిమాటోగ్రఫీ: రాధా శ్రీధర్
- ఎడిటర్: రాధా శ్రీధర్
- పాటలు: గోసాల రాంబాబు
మూలాలు
మార్చు- ↑ Sakshi (30 March 2022). "ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల లిస్ట్!". Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.
- ↑ Sakshi (28 February 2022). "ఈ వారం థియేటర్/ ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.
- ↑ Eenadu (4 March 2022). "రివ్యూ: హే సినామిక". Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.