అదితిరావు హైదరీ

భారతీయ నటి

అదితి రావు హైదరి,  ఒక భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్తమిళ సినిమాల్లో నటించింది. అస్సాంకు చెందిన మహ్మద్ సలేహ్ అక్బర్ హైదరి, హైదరాబాద్కు  చెందిన  జానంపల్లి రామేశ్వరరావుల కుటుంబంలో జన్మించింది.  వీరిద్దరిదీ రాజకుటుంబమే. 2006లో మమ్ముట్టి సరసన, మలయాళ చిత్రం ప్రజాపతితో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో దేవదాసీ పాత్రలో నటించిన ఆమెకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి.

అదితి రావు హైదరి
2017లో హైదరి
జననం (1986-10-28) 1986 అక్టోబరు 28 (వయసు 36)
హైదరాబాదు
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసత్యదీప్ మిశ్రా (2009–2013)

2011లో సుధీర్ మిశ్రా దర్శకత్వంలో ఆమె నటించిన యే సాలీ జిందగీ సినిమాతో ఆమె మరింత ప్రజాదరణ సంపాదించింది. ఈ సినిమాలోని ఆమె నటనకు స్ర్కీన్ పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారం లభించింది. ఆ తరువాత ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఆమె నటించిన  రాక్ స్టార్ (2011), మర్డర్ 3 (2013), ఖూబ్ సూరత్ (2014), వాజిర్ (2016), ఫితూర్ (2016) వంటి సినిమాలు  విజయవంతయయ్యాయి. ఆమె లీలా శాంసన్ వద్ద భరతనాట్యం నేర్చుకుంది.

తొలినాళ్ళ జీవితం సవరించు

28 అక్టోబర్ న ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆమె తండ్రి అస్సాంకు చెందిన మహ్మద్ సలెహ్ అక్బర్ హైదరీ రాజ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లి విద్యారావు, వనపర్తి సంస్థానానికి చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుమార్తె.[1] అదితి అక్బర్ హైదరి మునిమనుమరాలు. అలాగే అస్సాం మాజీ గవర్నర్ మహ్మద్ సాలెహ్ అక్బర్ హైదరి మనవరాలు. సినీ నిర్మాత, ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు, అదితి కజిన్ అవుతుంది.[2] వనపర్తి సంస్థానాధీశుడు  రాజా జె.రామేశ్వరరావు, శాంతా రామేశ్వరరావులు అదితికి తాతయ్య, అమ్మమ్మలు అవుతారు. రామేశ్వరరావు ఓరియంట్ బ్లాక్ స్వాన్ అనే ప్రచురణ సంస్థకు  చైర్ పర్సన్ గా  వ్యవహరిస్తున్నారు.  ఆమె ఆరవ ఏటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది.[3] ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో ఉన్న రిషీ వ్యాలీ స్కూల్ లో ప్రాథమిక విద్య అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.

నటించిన చిత్రాలు సవరించు

హిందీ సవరించు

తెలుగు సవరించు

మూలాలు సవరించు

  1. "I can speak good hyderabadi hindi: Aditi Rao Hydari". The Times of India. 21 January 2012. Archived from the original on 10 జూలై 2013. Retrieved 29 March 2012.
  2. Drama Queen Filmfare 2 July 2013
  3. "Delhi girl's Chennai tryst". Chennai, India: The Hindu. 6 August 2005. Archived from the original on 25 February 2009. Retrieved 11 March 2009.