హ్యారీ చెరింగ్టన్ బ్రూక్ (జననం 1999 ఫిబ్రవరి 22) ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్, యార్క్‌షైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడే ఇంగ్లాండ్ క్రికెటరు. [1] [2] ప్రధానంగా అతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. 2022 జనవరిలో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.[3]

హ్యారీ బ్రూక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హ్యారీ చెర్రింగ్‌టన్ బ్రూక్
పుట్టిన తేదీ (1999-02-22) 1999 ఫిబ్రవరి 22 (వయసు 25)
కెలీ, వెస్ట్ యార్క్‌షైర్, ఇంగ్లాండ్
ఎత్తు183 cమీ. (6 అ. 0 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 707)2022 సెప్టెంబరు 8 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2023 జూలై 27 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 267)2023 జనవరి 27 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2023 ఫిబ్రవరి 1 - దక్షిణాఫ్రికా తో
తొలి T20I (క్యాప్ 92)2022 జనవరి 26 - వెస్టిండీస్ తో
చివరి T20I2023 సెప్టెంబరు 1 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–presentయార్క్‌షైర్
2021–presentNorthern Superchargers
2021/22Hobart Hurricanes
2022లాహోర్ కలందర్స్
2023సన్ రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా
మ్యాచ్‌లు 12 3 22 68
చేసిన పరుగులు 1,181 86 482 4,248
బ్యాటింగు సగటు 62.15 28.66 32.13 40.84
100లు/50లు 4/7 0/1 0/2 11/24
అత్యుత్తమ స్కోరు 186 80 81* 194
వేసిన బంతులు 84 1,077
వికెట్లు 1 9
బౌలింగు సగటు 37.00 53.22
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/25 3/15
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 0/– 13/– 53/–
మూలం: ESPNcricinfo, 2023 సెప్టెంబరు 2

మొదటి ఆరు టెస్టు మ్యాచ్‌లలో పదిసార్లు బ్యాటింగ్ చేసి 80.90 కెరీర్ సగటుతో దాదాపు 100 స్ట్రైక్ రేట్‌తో 809 పరుగులు చేసి బ్రూక్, తన టెస్టు కెరీర్‌ను అసాధారణంగా ప్రారంభించాడు.[4] [5] 2022 T20 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో బ్రూక్ సభ్యుడు.

తొలినాళ్ళ జీవితం

మార్చు

బ్రూక్ కీలీలో జన్మించాడు. వార్ఫెడేల్‌లోని బర్లీలో పెరిగాడు. అతని కుటుంబం క్లబ్ క్రికెట్‌లో చురుకుగా ఉండేది. [6]

అతను పశ్చిమ యార్క్‌షైర్‌లోని ఇక్లీలో ఉన్న ఇల్క్లీ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నాడు . 14 సంవత్సరాల వయస్సులో, కుంబ్రియాలోని ఒక ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్ అయిన సెడ్‌బర్గ్ స్కూల్‌లో స్కాలర్‌షిప్ రావడంతో అక్కడికి వెళ్ళాడు.[2] [7] [8] మాజీ ప్రొఫెషనల్ క్రికెటరు, సెడ్‌బర్గ్ స్కూల్ క్రికెట్ కోచ్ అయిన మార్టిన్ స్పీట్, బ్రూక్ పాఠశాల రోజుల్లో అతని కెరీర్‌పై చాలా పెద్ద ప్రభావాన్ని చూపాడని జర్నలిస్టు అలెక్స్ మాసన్ క్రికెటర్ మ్యాగజైన్ లో రాసాడు.[9]

బ్రూక్ బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ చేస్తున్నప్పుడు టీమ్ హోప్ కోసం వీడియో సందేశాన్ని రికార్డ్ చేయడంతో సహా అనేక స్వచ్ఛంద ప్రయత్నాలకు మద్దతు ఇచ్చారు. [10]

క్రికెట్ కెరీర్

మార్చు

దేశీయ క్రికెట్‌లో

మార్చు

బ్రూక్ తన ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం యార్క్‌షైర్ తరపున స్కూల్‌లో ఉండగానే 2016 జూన్ 26న హెడ్డింగ్లీలో పాకిస్తాన్ Aతో ఆడాడు. [7] [2] [8] [11] 2017 జూన్ 19న లార్డ్స్‌లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యార్క్‌షైర్ తరపున కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడడం మొదలుపెట్టాడు. ఆ తరువాతి పక్షం రోజులలో యార్క్‌షైర్ సెకండ్ ఎలెవెన్ తరఫున మూడు సెంచరీలు చేసాడు.[12] అంతర్జాతీయ స్థాయిలో, 2017 ప్రారంభంలో ఇంగ్లండ్ అండర్-19 తో కలిసి భారతదేశంలో పర్యటించి, భారత అండర్-19 కి వ్యతిరేకంగా రెండు U-19 టెస్టులు, ఐదు U-19 LOI లలో ఆడాడు. [13] [14]

బ్రూక్ 2018 జూలై 5న 2018 t20 బ్లాస్ట్‌లో యార్క్‌షైర్ తరపున తన ట్వంటీ20ల్లో ప్రవేశించాడు.[15] ది హండ్రెడ్ 2021 టోర్నమెంట్ కోసం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌తో సంతకం చేశాడు. [16]

2022లో, బ్రూక్‌తో లాహోర్ క్వలందర్స్ సంతకం చేసింది. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో, లాహోర్ 12-3 వద్ద ఉండగా బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్, 49 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేశాడు. అతని జట్టు మొత్తం 197 పరుగులు చేసింది. ఇది అతని తొలి T20 సెంచరీ, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యంత పిన్న వయస్కుడైన శతకకర్త అయ్యాడు. [17]

2022 ఏప్రిల్లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం బ్రూక్‌ను నార్తర్న్ సూపర్‌చార్జర్స్ కొనుగోలు చేసింది. [18]

దక్షిణాఫ్రికా కొత్త SA20 పోటీలో, బ్రూక్ తన సేవలకు R2.3 మిలియన్లు చెల్లించిన జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ (JSK) తరపున ఆడతాడు. [19]

2022 డిసెంబరులో, బ్రూక్‌ను 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు మొదటిసారిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ₹ 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. [20] 2023 ఏప్రిల్ 14న, అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌పై IPLలో తన తొలి సెంచరీ సాధించాడు. [21] IPL, PSL రెండింటిలోనూ సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు. [22]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2017 ఆగస్టులో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ అండర్-19 క్రికెట్ జట్టుకు బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

2017 డిసెంబరులో బ్రూక్, 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [23] ఇంగ్లండ్ రెండవ గ్రూప్ మ్యాచ్‌లో, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 102 నాటౌట్ స్కోర్ చేశాడు, U19 ప్రపంచ కప్‌లో అలిస్టయిర్ కుక్ తర్వాత సెంచరీ చేసిన రెండవ ఇంగ్లాండ్ కెప్టెన్ అయ్యాడు. [24] టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ మ్యాచ్‌ల తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బ్రూక్‌ను జట్టులో రైజింగ్ స్టార్‌గా పేర్కొంది. [25] అతను 239 పరుగులతో టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. [26]

2022 జనవరిలో, వెస్టిండీస్‌తో సిరీస్ కోసం ఇంగ్లాండ్ T20I జట్టులో బ్రూక్ ఎంపికయ్యాడు. [27] తన తొలి T20I మ్యాచ్, 2022 జనవరి 26న వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ తరపున ఆడాడు. [28] 2022 మేలో, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ కోసం ఇంగ్లాండ్ టెస్టు జట్టులో బ్రూక్ ఎంపికయ్యాడు. [29] 2022 జూలైలో, బ్రూక్ భారత్‌తో జరిగే వారి స్వదేశీ సిరీస్ కోసం ఇంగ్లాండ్ యొక్క వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [30] 2022 ఆగష్టులో, దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం ఇంగ్లాండ్ యొక్క టెస్టు జట్టులో ఎంపికై, [31] 2022 సెప్టెంబరు 8న దక్షిణాఫ్రికాపై తన తొలి టెస్టు ఆడాడు.[32] 2022 సెప్టెంబరులో, బ్రూక్ 2022 పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు, ఇంగ్లాండ్ ఆ టోర్నమెంట్‌ను గెలుచుకుంది.


బ్రూక్‌ను, 2022-23లో పాకిస్తాన్‌లో జరిగిన టెస్టు, T20I ల కోసం ఇంగ్లాండ్‌ జట్టులోకి తీసుకున్నారు. రావల్పిండిలో జరిగిన మొదటి టెస్టులో, అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అత్యధిక స్కోరు సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులత్యో తన మొదటి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. రెండవ ఇన్నింగ్సులో 87 పరుగులు ఆఖరి రోజున ఇంగ్లండ్‌ను విజయతీరాలు చేర్చింది.[33] 2023 జనవరి 27న ఇంగ్లండ్ తరపున దక్షిణాఫ్రికాపై తన వన్‌డే రంగప్రవేశం చేసాడు. [34]

2023 ఫిబ్రవరిలో, బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ, ఆఖరి టెస్టు మ్యాచ్‌లో, అతను కేవలం తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 800 టెస్టు పరుగులను చేరుకున్న మొదటి బ్యాటర్ అయ్యాడు. మొత్తం టెస్టు కెరీర్‌లో కేవలం 803 బంతులను ఎదుర్కొని 800 పరుగులు సాధించాడు. [35] టెస్టు మ్యాచ్‌లలో, సునీల్ గవాస్కర్ (912 పరుగులు), సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ (862 పరుగులు) మాత్రమే మొదటి ఆరు మ్యాచ్‌లలో అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. [36]

అతను టెస్టు మ్యాచ్‌లో 105.68 స్ట్రైక్ రేట్‌తో కేవలం 174 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో తన కెరీర్ బెస్టు టెస్టు స్కోరు 186 నమోదు చేశాడు. జో రూట్‌తో కలిసి ఇంగ్లాండ్‌ను 21/3 అనిశ్చిత స్థితి నుండి డిక్లరేషన్‌కు ముందు మొత్తం 435/8 కి చేర్చి రక్షించాడు. అతను, రూట్ నాల్గవ వికెట్‌కు కీలకమైన 302 పరుగులను జోడించారు. టెస్టు క్రికెట్‌లో మొదటి తొమ్మిది టెస్టు ఇన్నింగ్స్‌ల తర్వాత 809 పరుగులతో, 9 ఇన్నింగ్స్‌లలో 792 పరుగులు చేసిన భారత ఆటగాడు వినోద్ కాంబ్లి పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించి అత్యధిక పరుగుల స్కోరర్‌గా చరిత్ర సృష్టించాడు. [37] రూట్‌తో అతని భాగస్వామ్యం న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌పై ఒక ఇంగ్లీషు జోడీ ద్వారా ఏ వికెట్‌కైనా సాధించిన అత్యధిక భాగస్వామ్య రికార్డును బద్దలు కొట్టింది. మునుపటి 282 పరుగుల రికార్డు ఆండ్రూ ఫ్లింటాఫ్, గ్రాహం థోర్ప్‌ల పేరిట ఉంది. [38] బ్రూక్ తన నాల్గవ టెస్టు సెంచరీ కేవలం ఆరు టెస్టు మ్యాచ్‌లలో పూర్తి చేసాడు. అతని కెరీర్ సగటు 100 దాటింది. [39] [40]


2023 యాషెస్ 3వ టెస్టులో, బ్రూక్ 75 పరుగులు చేసి ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడంలో సహాయం చేశాడు. [41] ఈ ఇన్నింగ్స్‌లో అతను అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల ద్వారా) 1000 పరుగులకు చేరుకున్నాడు. [42]

అంతర్జాతీయ శతకాలు

మార్చు
హ్యారీ బ్రూక్ చేసిన టెస్టు శతకాల జాబితా [43]
No. స్కోర్ ప్రత్యర్థి వేదిక Date Result Ref
1 153   పాకిస్తాన్ రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి 1 December 2022 1 గెలిచింది [44]
2 108   పాకిస్తాన్ ముల్తాన్ క్రికెట్ స్టేడియం, ముల్తాన్ 9 December 2022 గెలిచింది [45]
3 111   పాకిస్తాన్ నేషనల్ స్టేడియం, కరాచీ 17 December 2022 గెలిచింది [46]
4 186   న్యూజీలాండ్ బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ 24 February 2023 కోల్పోయిన [47]

మూలాలు

మార్చు
  1. "Harry's time will surely come again". 3 October 2020. Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 22 సెప్టెంబరు 2023.
  2. 2.0 2.1 2.2 "Harry Brook". CricketArchive. Retrieved 3 July 2017.
  3. "Harry Brook profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-02-10.
  4. "Believe the hype: Harry Brook is heading where few have gone before". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-02-25.
  5. "Harry Brook batting bowling stats, averages and cricket statistics, 2023". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-02-28.
  6. "Harry Brook: From Burley to his Yorkshire CCC debut". 5 September 2022.
  7. 7.0 7.1 Playfair. Marshall, Ian (ed.). Playfair Cricket Annual (70th edition) (2017 ed.). London: Headline. p. 197.
  8. 8.0 8.1 "Harry Brook first-class debut for Yorkshire". Sedbergh School. 28 June 2016. Archived from the original on 27 సెప్టెంబరు 2018. Retrieved 3 July 2017.
  9. "Brook No Argument". 28 September 2018. Archived from the original on 21 మే 2024. Retrieved 22 సెప్టెంబరు 2023.
  10. "Login • Instagram". www.instagram.com. Retrieved 2023-07-09. {{cite web}}: Cite uses generic title (help)
  11. Birkinshaw, Alan (29 June 2017). "Burley's Harry Brook makes his Yorkshire debut". Wharfedale Observer. Retrieved 3 July 2017.
  12. Fuller, John (20 June 2017). "Harry Brook's journey to a County Championship debut with Yorkshire". Cricket Yorkshire. Retrieved 3 July 2017.
  13. "Under-19 Test Matches played by Harry Brook". CricketArchive. Retrieved 6 July 2017.
  14. "Under-19 LOI Matches played by Harry Brook". CricketArchive. Retrieved 6 July 2017.
  15. "North Group (N), Vitality Blast at Leeds, Jul 5 2018". ESPN Cricinfo. Retrieved 5 July 2018.
  16. "The Hundred 2021 - full squad lists". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-01-13.
  17. "Yorkshire sensation Brook makes Pakistan Super League history". Bradford Telegraph and Argus (in ఇంగ్లీష్). Retrieved 2023-04-15.
  18. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  19. "Live report - SA20 player auction". ESPNcricinfo. Retrieved 2022-09-19.
  20. "ipl-auction-2023-live-updates". Archived from the original on 2022-12-23. Retrieved 2023-09-22.
  21. "Harry Brook smashes maiden IPL century against Kolkata at Eden Gardens". The National News. Retrieved 15 April 2023.
  22. Tyagi, Abhinav (2023-04-14). "Harry Brook becomes the first player to score a century in PSL and IPL". Crictoday (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-15.
  23. "Brook tasked with World Cup mood swing". England and Wales Cricket Board. Retrieved 11 December 2017.
  24. "Brook century studs comprehensive England win". International Cricket Council. Retrieved 18 January 2018.
  25. "U19CWC Report Card: England". International Cricket Council. Retrieved 3 February 2018.
  26. "ICC Under-19 World Cup, 2017/18 - England Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 3 February 2018.
  27. "Harry Brook added to England T20I squad as cover for Sam Billings". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-01-12.
  28. "3rd T20I (D/N), Bridgetown, Jan 26 2022, England tour of West Indies". ESPN Cricinfo. Retrieved 26 January 2022.
  29. "James Anderson & Stuart Broad recalled by England for New Zealand Tests". BBC Sport. Retrieved 18 May 2022.
  30. "Richard Gleeson wins first England call-up for T20Is against India". ESPN Cricinfo. Retrieved 1 July 2022.
  31. "England v South Africa: Ollie Robinson recalled for first two Tests". BBC Sport. Retrieved 2 August 2022.
  32. "3rd Test, The Oval, September 08 - 12, 2022, South Africa tour of England". ESPN Cricinfo. Retrieved 8 September 2022.
  33. "Relive England's incredible final day in Rawalpindi". BBC Sport. 4 December 2022. Retrieved 6 December 2022.
  34. "1st ODI (D/N), Bloemfontein, January 27, 2023, England tour of South Africa". ESPN Cricinfo. Retrieved 27 January 2023.
  35. Gardner, Ben (2023-02-24). "Harry Brook Is Proof Of A Game That Will Live Forever". Wisden. Archived from the original on 2023-02-25. Retrieved 2023-02-25.
  36. Witney, Katya (2023-02-24). "Is Harry Brook's The Best Start To A Test Career Ever?". Wisden. Retrieved 2023-02-25.
  37. "Harry Brook shatters Vinod Kambli's 30-year-old world record, goes past Gavaskar, other legends with breathtaking knock". Hindustan Times. 2023-02-24. Retrieved 2023-02-25.
  38. "Harry Brook rates latest Test carnage his best so far". ESPNcricinfo. Retrieved 2023-02-25.
  39. "Brook & Root tons put England in dominant position". BBC Sport. Retrieved 2023-02-25.
  40. Daanyal Saeed (February 25, 2023). "Englishman Harry Brook is rewriting cricket's record books". News. Retrieved 6 March 2023.
  41. "3rd Test 2023 Ashes". Cricinfo. Retrieved 10 July 2023.
  42. "Ashes: England's Harry Brook becomes fastest batter to 1000 runs in Test cricket". India Today. Retrieved 10 July 2023.
  43. "Harry Brook Test centuries". ESPNcricinfo. Retrieved 7 January 2023.
  44. "1st Test: Pakistan v England at Rawalpindi, Dec 1-5, 2022". ESPNcricinfo. Retrieved 1 December 2022.
  45. "2nd Test: Pakistan v England at Multan, Dec 9-13, 2022,". ESPNcricinfo. Retrieved 9 December 2022.
  46. "3rd Test: Pakistan v England at Karachi, Dec 17-21, 2022,".
  47. "1st Test, England tour of New Zealand at Wellington, Feb 24-28 2023". ESPNcricinfo. Retrieved 12 April 2020.