1940 లో ఒక గ్రామం

2008 జాతీయ పురస్కారం పొందిన చిత్రం

1940 లో ఒక గ్రామం 2008 లో నిర్మించబడి జాతీయ పురస్కారం పొందిన తెలుగు చిత్రం. గురజాడ అప్పారావు రచన ఘోష ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. స్తీల పట్ల, వెనకబడిన కులాల పట్ల గతంలో సమాజ వైఖరి ఎలాగుండేదో ఈ చిత్ర మూల కథ.[2]

1940 లో ఒక గ్రామం
దర్శకత్వంనరసింహ నంది
నిర్మాతఎన్.సి.నరసింహం[1]
తారాగణంబాలాదిత్య
శ్రీ
రాళ్ళపల్లి
ముక్కురాజు
రామకృష్ణ
రజిత
శ్రీలత
సాయిలక్ష్మి
సంగీతంసాకేత్ సాయిరాం
విడుదల తేదీ
2008 (2008)

సరిగ్గా కంటిచూపు కూడా లేని ధనికుడైన 70 యేళ్ల ముసలి బ్రాహ్మణుడు దీక్షుతులు (ముక్కురాజు)కు భార్యాపిల్లలు లేరు. అతడు 16 ఏళ్ల సుశీలను చూచి ఆమె తల్లిదండ్రుల వద్దకు పోయి పెద్దమొత్తంలో కన్యాశుల్కం ఆశచూపి ఆమెను పెళ్లాడతానని అడుగుతాడు. అలా దీక్షితులుతో చాలా చిన్న వయస్కురాలైన సుశీల (శ్రీ రమ్య) వివాహం జరుగుతుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సుశీలకి ఆ ముసలి భర్తతో నిరాశే మిగులుతుంది. ఒక రోజు పూజ చేయడానికి గోదావరి దగ్గరికి వెళ్ళిన సుశీలకి తన ఈడు వాడైన అట్టడుగు కులానికి చెందిన సూరి (బాలాదిత్య)తో పరిచేయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారితీస్తుంది. సుశీల ఒక బిడ్డకు తల్లయిన సంగతి తెలుసుకున్న అగ్రహారం వారు వారిద్దరికీ శిరోముండనం చేయించి సుశీలను చీకటి గదిలో బంధించి సూరిని ఊరు నుంచి బహిష్కరిస్తారు. చివరకు దీక్షితులు మనసు మార్చుకుని వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. సూరిని బహిష్కరించడంతో నిమ్న కులాల ప్రజలు పనులను బహిష్కరించడంతో అగ్రహారం పెద్దలు కూడా తమ మనసులు మార్చుకుని సూరి సుశీలల వివాహానికి సహకరిస్తారు.[3]

చిత్రీకరణ

మార్చు

దర్శకుడు ఈ చిత్రం తెర కెక్కించడంలో చాలా జాగ్రతలు తీసుకున్నాడు. ప్రతి చిన్న సన్నివేశాన్ని సహజసిద్ధంగా చిత్రీకరించాడు. 1940 నాటి పల్లెటూరి వాతావరణాన్ని, గోదావరి నది అందాలని, అగ్రకులాల, అట్టడుగు కులాల వారి మాటల్లో యాసని చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ద్వారా ప్రతి కులం వారికీ మరొక కులం వారితో అవసరం తప్పని సరిగా వుంటుంది అనే సందేశాన్ని ఇచ్చాడు.[3]

పాటలు

మార్చు

ఈ చిత్రంలో పాటలకు సాకేత్ సాయిరాం సంగీత దర్శకత్వం వహించాడు. పాటలను శ్రీకాంత్ అప్పలరాజు, కె.ఉషారాణి, రామారావులు వ్రాయగా అనిల్ కుమార్, రత్నంరాజు, తేజస్వి, ఆస్తానా, సి.రమణ, పల్లవి సూరి మొదలైనవారు పాడారు.

ఈ సినిమాలోని పాటల జాబితా:[4]

  • మల్లెపూవులా విరిసేను నేడు అందమంత
  • ఓ సీతాకోక చిలుక నీకై వేచా మనసా వాచా
  • మనవేద సారం మానవతగా తెలుసుకోలేవా
  • ఎదలోన ప్రేమ స్వర్గాలు ఎదురాయె గుడిలో నరకాలు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ - కథనం - దర్శకత్వం - నరసింహ నంది
  • సంభాషణలు : రఘుబాబు
  • సంగీతం: సాకేత్ సాయిరాం
  • ఛాయాగ్రహణం:మురళీమోహన్ రెడ్డి
  • కూర్పు:బాబు
  • నిర్మాత - ఎన్. సి. నరసింహం.[5]

పురస్కారాలు

మార్చు

జాతీయ పురస్కారములు

మార్చు

నంది పురస్కారములు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "56th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 March 2012.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-18.
  3. 3.0 3.1 వెబ్ మాస్టర్. "MOVIE REVIEWS: 1940 లో ఒక గ్రామం". తెలుగు వన్ మూవీ డేటాబేస్. Retrieved 8 May 2018.[permanent dead link]
  4. 1940 Lo Oka Gramam Telugu Movie Songs Jukebox
  5. Prakas, B V S (January 26, 2010). "Nandi: No takers for off-beat films". The Times of India. Archived from the original on 2010-09-29. Retrieved September 29, 2010.
  6. "Nandi awards 2008 announced - Telugu cinema news". idlebrain.com. Retrieved 11 May 2015.

బయటి లంకెలు

మార్చు