ప్రధాన మెనూను తెరువు

ముక్కురాజు

సినీ నటుడు, నృత్య దర్శకుడు


ముక్కు రాజు గా ప్రసిద్ధిచెందిన సాగిరాజు రాజంరాజు (1931 - జూలై 31, 2014) తెలుగు సినిమా నటుడు మరియు డాన్స్ మాస్టర్[1].

ముక్కురాజు
ముక్కురాజు.jpg

జననం సాగిరాజు రాజంరాజు
1931
ఆంధ్రప్రదేశ్
మరణం జూలై 31, 2014
వృత్తి సినిమా నటుడు, నృత్యదర్శకుడు, నృత్యకళాకారుడు

విషయ సూచిక

జీవిత విశేషాలుసవరించు

వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర కుముదవల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941లో క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఈ ఇంగ్లీషు చదువులు మాకొద్దు అంటూ, పుస్తకాలు విసిరేసి చదువు మానేశారు.[2]. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

సినిమా ప్రస్థానంసవరించు

1955లో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మాయాబజార్ చిత్రంలోని "మోహినీ భస్మాసుర డాన్స్ డ్రామా"తో సినిమాలలో ప్రవేశించాడు. వివిధ భాషలలో దాదాపు 500 చిత్రాలలో నటించిన వీరు 200 చిత్రాలకు డాన్స్ మాస్టార్ గా, చాలా సినిమాలకు ఫైటర్ గా పనిచేశాడు. మాజీ ముఖ్యమంత్రి మహా నటుడు ఎన్టీఆర్‌ కు తొలిరోజుల్లో వ్యక్తిగత డాన్స్ మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి చిత్రరంగ ప్రవేశం కొత్తలో ప్రాణం ఖరీదు, పునాది రాళ్ళు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆర్.నారాయణమూర్తి నిర్మించి, నటించిన ఎర్ర సైన్యం, అడవి దివిటీ లతో పాటు దాదాపు అన్ని చిత్రాలకు నృత్య రూపకల్పనతో పాటు డప్పు పట్టి నటించాడు.[3] "1940 లో ఒక గ్రామం" చిత్రంలో ముక్కురాజు నటనకు ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది[4][5]. టి.వి.నంది పురస్కారాలకమిటీలో 2000 సంవత్సరానికి సభ్యులుగా ఉన్నాడు. హైదరాబాద్ లో నృత్య దర్శకుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు.

నటించిన చిత్రాలుసవరించు

మరణంసవరించు

2014, జూలై 31వ తేదీ గురువారం తెల్లవారుఝామున ముక్కురాజు కన్నుమూశారు.

మూలాలుసవరించు

  1. "Actor Mukku Raju passes away". indiaglitz. July 31, 2014. Retrieved July 31, 2014.
  2. తెలుగులో.కాంలో ముక్కురాజు ఇంటర్వ్యూ
  3. "Veteran actor Mukku Raju passes away". Sakshi Post. Retrieved 2014-07-31.
  4. "Nandi awards 2008 announced". idlebrain. Oct 24, 2008. Retrieved July 31, 2014.
  5. "'1940 lo oka gramam' release soon". The Hindu. February 19, 2010. Archived from the original on September 29, 2010. Retrieved September 29, 2010.

ఇతర లింకులుసవరించు