1974 భారత రాష్ట్రపతి ఎన్నికలు

భారత ఎన్నికల సంఘం 1974 ఆగస్టు 17న భారత రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. అస్సాంకు చెందిన ఫకృద్దీన్ అలీ అహ్మద్ 765,587 ఓట్లతో గెలుపొందాడు. తన ప్రత్యర్థి పశ్చిమ బెంగాల్‌కు చెందిన త్రిదిబ్ చౌధురి కి 189,196 ఓట్లు వచ్చాయి.

1974 భారత రాష్ట్రపతి ఎన్నికలు

← 1969 1974 ఆగస్టు 17 1977 →
 
Nominee ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ త్రీడీబ్ చౌదరి
Party భారత జాతీయ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ
Home state అస్సాం పశ్చిమ బెంగాల్
Electoral vote 754,113 189,196
Percentage 79.94% 20.06%


ఎన్నికలకు ముందు భారతదేశ రాష్ట్రపతి

వి.వి. గిరి
స్వతంత్ర రాజకీయ నాయకుడు

Elected భారతదేశ రాష్ట్రపతి

ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్
భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల మార్పు మార్చు

1974 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎలక్టోరల్ కాలేజీలో మార్పు వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ నుండి 521, రాజ్యసభ నుండి 230 రాష్ట్ర అసెంబ్లీల నుండి 3654 ఓట్లు ఉన్నాయి.

ఎన్నికలషెడ్యూల్ మార్చు

ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం 1974 జులై 16న ప్రకటించింది [1]

స.నెం. పోలింగ్ కార్యక్రమాలు తేదీ
1. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 30 జూలై 1974
2. నామినేషన్ పరిశీలన తేదీ 31 జూలై 1974
3. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 2 ఆగస్టు 1974
4. పోలింగ్ తేదీ 17 ఆగస్టు 1974
5. కౌంటింగ్ తేదీ 20 ఆగస్టు 1974

ఫలితాలు మార్చు

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు కింది విధంగా ఉన్నాయి.[2] [3]

అభ్యర్థి పొందిన ఓట్లు
ఫకృద్దీన్ అలీ అహ్మద్ 754,113
త్రిదిబ్ చౌధురి 189,196
మొత్తం ఓట్లు 943,309
  1. "Background material related to Election to the office of President of India 2017". Election Commission of India. Retrieved 30 January 2022.
  2. http://164.100.47.5/presidentelection/6th.pdf Election Commission of India
  3. AOL news (Past and present Presidential Results)