1980 భారత సార్వత్రిక ఎన్నికలు
7వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1980 జనవరి 3, 6 తేదీలలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించడంతో 1977 సాధారణ ఎన్నికలలో జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే 1980లో జనతా పార్టీ ప్రభుత్వం సాధారణ ఎన్నికలలో మెజారిటీ లేక ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన భారతీయ లోక్‌దళ్ నాయకులు చరణ్‌సింగ్ జగ్జీవన్ రామ్‌లు అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌తో విభేదించారు.
| |||||||||||||||||||||||||||||||||
Registered | 356,205,329 | ||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 56.92% ( 5.55pp) | ||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||
|
1979లో జనతా పార్టీ కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు జనతా పార్టీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నాయి. తదనంతరం, మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. జనతా కూటమిలోని కొంతమంది భాగస్వాములను నిలుపుకున్న చరణ్ సింగ్ 1979 జూన్ లో భారత దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో చరణ్ సింగ్ కు మద్దతు ఇస్తామని ప్రకటించింది, అయితే చరణ్ సింగ్ ప్రభుత్వం లోక్‌సభలో మెజారిటీని నిరూపించుకోవడానికి కేవలం రెండు రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకొని వెనక్కి తగ్గింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపన్సంహరించుకోవడంతో చరణ్ సింగ్, రాజీనామా చేయవలసి వచ్చింది, 1980 జనవరిలో చరణ్ సింగ్ ఎన్నికలకు పిలుపునిచ్చాడు పార్లమెంటు విశ్వాసం పొందని ఏకైక భారతదేశ ప్రధానమంత్రి. సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఇందిరా గాంధీ నాయకత్వంలోని బీహార్‌లో సత్యేంద్ర నారాయణ్ సిన్హా కర్పూరి ఠాకూర్, కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే, మహారాష్ట్రలో శరద్ పవార్ వంటి ప్రాంతీయ సత్రాప్‌లు జనతా పార్టీ ప్రముఖ నాయకుల గెలాక్సీ నుండి బలమైన రాజకీయ సవాలును ఎదుర్కొంది., హర్యానాలో దేవి లాల్ & ఒరిస్సాలో బిజూ పట్నాయక్ వంటి నాయకులు ఇందిరా గాంధీకి తమ మద్దతు ఉపసంహరించుకున్నారు . జనతా పార్టీ జగ్జీవన్ రామ్ ను 1980 పార్లమెంట్ ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.[1][2] జనతా పార్టీ నాయకుల మధ్య అంతర్గత వైరం దేశంలోని రాజకీయ అస్థిరత ఇందిరా గాంధీకి అనుకూలంగా మారింది. 1980 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
ఎన్నికలలో, భారత జాతీయ కాంగ్రెస్ 353 సీట్లు జనతా పార్టీ కేవలం 31 సీట్లు గెలుచుకుంది, చరణ్ సింగ్ జనతా పార్టీ (సెక్యులర్) 41 సీట్లు గెలుచుకుంది. ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా జనతా పార్టీ కూటమి చీలిక కొనసాగింది.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఫలితాలు
మార్చుఇంకా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Chawla, Prabhu (September 30, 2013). "As general elections loom large, new four-party United Front formed to counter Cong(I)". India Today. Retrieved 2019-09-23.
- ↑ Jagjivan Ram: Most experienced artful dodger of Indian politics India Today, 23 December 2014