వావిలాల గోపాలకృష్ణయ్య
వావిలాల గోపాలకృష్ణయ్య (సెప్టెంబరు 17, 1906 - ఏప్రిల్ 29, 2003) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. కళా ప్రపూర్ణ బిరుదు గ్రహీత.
బాల్యంసవరించు
1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వావిలాల నరసింహం, పేరిందేవి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. స్వాతంత్య్రోద్యమ కార్యకర్త. నాయకుడు. ప్రజాప్రతినిధి. వక్త. బహుగ్రంథకర్త. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. ఖాదీ దుస్తులతో, చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాతశత్రువు, ఆజన్మ బ్రహ్మచారి .
విద్యసవరించు
స్వాతంత్రోద్యమంలోసవరించు
భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి స్వరాజ్య భిక్ష పేరుతో బియ్యం, జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించాడు. పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావల్సిందే. సోవియెట్ పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.1925లోనే సత్తెనపల్లిలో 'శారదానిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయర్ స్టడీస్ అనే సంస్థని గుంటూరు అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. చివరి రోజులలో ఆనారోగ్యానికి గిరై పక్షవాతంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో నిమ్స్‌లో కొంతకాలం వైద్యం చేయించుకొన్న ఆయన 2003 ఏప్రిల్ 29న పరమపదించారు.
పదవులు, బిరుదులుసవరించు
- ఆంధ్రా గాంధీ అని పిలిచే ఈయన సోషలిస్టు
- 1974 - 77 కాలంలో తెలుగు అధికారభాషా సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు.
- గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేసారు
- గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేసారు
- 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందారు.
- 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు.
రచనలుసవరించు
గోపాలకృష్ణయ్య తన జీవిత కాలంలో పలు రచనలు చేసాడు. తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించాడు. వాటిలో కొన్ని