2013 ఉత్తర భారతదేశం వరదలు

2013 లో ఉత్తరాఖండ్లో పలు రోజులపాటు కురిసిన విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది. 2004 లో భారతదేశం ఎదుర్కొన్న సునామీ తరువాత ఇదే అత్యంత ఘోరమైన విపత్తు. రాష్ట్రంలో మామూలుగా వచ్చే వరదల కన్నా ఎక్కువగా రావడానికి ఒక కారణం నదుల మీద నిర్మించే ఆనకట్టల తాలూకు వ్యర్ధాలు. ఈ వ్యర్థ పదార్థాలు నదుల సహజ ప్రవాహానికి అడ్డం పడి కట్టలు తెంచుకోవడానికి కారణం అయ్యాయి. 2013 జూన్ 16 ఈ వరదల్లో అతి ముఖ్యమైన రోజు. ఈ వరదలు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలనూ, నేపాల్ పశ్చిమ భాగాన్ని, టిబెట్ పశ్చిమ భాగాన్ని తాకినా కూడా 95% బాధితులు ఉత్తరాఖండ్కు చెందిన వారే. As of 16 జూలై 2013[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], ఉత్తరాఖండ్ ప్రభుత్వ నివేదికల ప్రకారం 5,700 మందికి పైగా ప్రజలు మరణించినట్లుగా భావిస్తున్నారు.[1] ఇందులో 934 ప్రాంతీయులు.[2]

2013 ఉత్తర భారతదేశం వరదలు సందర్బంగా జంతువులు మరణించిన దృశ్యచిత్రం

వంతెనలు రోడ్లు నాశనమవడంతో సుమారు 100,000 యాత్రికులు, సందర్శకులు చార్ ధామ్ లకు వెళ్ళే దారిలో లోయల్లో చిక్కుకుని పోయారు.[3][4]భారతీయ సైన్యం, భారతీయ వాయుసేనలు,, పారామిలిటరీ బలగాలు సుమారు 110,000 మందిని వరద ప్రాంతాలనుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.[5]

కారణాలు

మార్చు

2013, జూన్ 14 నుంచి 17 మధ్యలో ఉత్తరాఖండ్, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో విపరీతమైన వర్షం కురిసింది. దీని పరిమాణం మామూలు ఋతుపవనాలలో నమోదయ్యే వర్షపాతం కన్నా 375% ఎక్కువ.[6] దీనివల్ల 3800 ఎత్తులో ఉన్న చోరాబరి హిమానీనదం కరిగిపోయి మందాకినీ నది పొంగి పొర్లింది.[7] దీనివల్ల గోవింద ఘాట్, కేదారనాథ్, రుద్రప్రయాగ జిల్లా, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యాణా, ఉత్తర ప్రదేశ్, నేపాల్ పశ్చిమ భాగంలో విపరీతమైన వరదలు వచ్చాయి.[8] హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని ఎత్తైన ప్రదేశాలు అడవులు, మంచుతో కప్పబడిన పర్వతాలతో కూడుకుని ఉన్నాయి. అందుకని వాటికి దారులు కూడా సులభంగా ఉండవు. కానీ అక్కడే హిందువులు, సిక్కుల యాత్రా స్థలాలు, ట్రెక్కింగ్ గమ్యస్థానాలు నెలకొని ఉన్నాయి. నాలుగు రోజులపాటు కురిసిన భారీ వర్షం, కరిగిన మంచు వరదలను మరింత ఉధృతం చేశాయి.[9] భారతీయ వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు కుడా పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. దాంతో వేలాది మంది యాత్రికులు ఈ వరదల్లో చిక్కుకుని పోయి భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది.

మూలాలు

మార్చు
  1. "India raises flood death toll to 5,700 as all missing persons now presumed dead". CBS News. 16 July 2013. Archived from the original on 17 జూలై 2013. Retrieved 16 July 2013.
  2. "India says 5,748 missing in floods now presumed dead". AFP (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-03-25. Retrieved 2023-01-20.
  3. Kala, C.P. (2014). "Deluge, disaster and development in Uttarakhand Himalayan region of India: Challenges and lessons for disaster management". International Journal of Disaster Risk Reduction. 8: 143–152. doi:10.1016/j.ijdrr.2014.03.002.
  4. "Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath". NDTV.com. Retrieved 2023-01-20.
  5. "Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath". NDTV.com. Retrieved 2023-01-20.
  6. "Uttarakhand: Rescue efforts in full swing; 102 dead, 72000 stranded-India News". IBNLive Mobile. 18 June 2013. Archived from the original on 4 అక్టోబరు 2013. Retrieved 22 June 2013.
  7. "Kedarnath temple in Uttarakhand survives glacier, floods". www.downtoearth.org.in. Retrieved 2023-01-20.[permanent dead link]
  8. "Uttarakhand floods, landslides leave 40 dead; over 60,000 stranded". IBN Live. 18 June 2013. Archived from the original on 21 జూన్ 2013. Retrieved 18 June 2013.
  9. "58 dead, over 58,000 trapped as rains batter Uttarakhand, UP". Business Standard. 18 June 2013. Retrieved 18 June 2013.