2014 జమాల్‌పూర్ ఎన్‌కౌంటర్

2014 జమాల్‌పూర్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు జమాల్‌పూర్ ప్రాంతం, లూధియానా, పంజాబ్ లో ఇద్దరు దళిత సోదరులు: హరీందర్ సింగ్ (23), జతీందర్ సింగ్ (25)లను నకిలీ ఎన్‌కౌంటర్ లో చంపిన సంఘటనపై సాగుతున్న క్రిమినల్ కేసు.[1] ఎస్.ఎస్.పి. సహా ముగ్గురు పోలీసు అధికారులను ఈ ఘటనకు బాధ్యులుగా పంజాబ్ పోలీసులు సస్పెండ్ చేశారు. శిరోమణి అకాలీ దళ్ సభ్యుడైన గుర్జిత్ సింగ్ ఈ అంశంలో పంజాబ్ పోలీసులతో కుమ్మక్కయ్యారన్న అంశం బయటకి వచ్చాకా ఈ కేసు వెలుగు చూసింది.

బీహార్ లో జమాల్ పూర్ జిల్లా

వివరాలుసవరించు

హరీందర్ సింగ్, జతీందర్ సింగ్ సోదరులు పంజాబ్ లోని మచ్ఛీవారాకు సమీపంలో భోపూర్ నివాసులైన దళిత కులస్తులు. దగ్గరలోని సమారా పట్టణంలో ప్రైవేటు కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదువుతూ, జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారులుగా రాణిస్తున్నారు. ఇద్దరు సోదరులకూ నేర చరిత్ర ఉంది. 2013-14లో అనుమతి లేకుండా ఇంటి పరిధిలోకి ప్రవేశించి, ఒక అమ్మాయిని అవమానించి, లైంగికంగా వేధించి, హత్యా ప్రయత్నం చేసినందుకు గాను వీరి మీద కేసు ఉంది.[2] కానీ వీరి కుటుంబం ఇవి తప్పుడు కేసులని వాదిస్తోంది.

జమాల్ పూర్ లో ఇద్దరు సోదరులూ, మరో ఇద్దరు స్నేహితులతో అద్దె ఇంటిలో ఉంటున్నారు. కానిస్టేబుల్ యద్విందర్ సింగ్, ఇద్దరు హోం గార్డులు బల్దేవ్ సింగ్, అజిత్ సింగ్ లు వీరిపై దాడిచేశారు. భూస్వామి, శిరోమణి అకాలీ దళ్ పార్టీ సభ్యుడు అయిన గుర్జీత్ సింగ్ ఈ ఎన్ కౌంటర్ విషయంలో నిందితుడు. ఆయన ఈ దాడి జరిగిన సమయంలో పోలీసులుతో ఉన్నట్టు వాదనలున్నాయి. గుర్జీత్ సింగ్ భార్య రాజ్విందర్ కౌర్ సర్పంచ్ ఎన్నికల్లో అకాలీ దళ్ తరఫున పోటీచేశారు.[3]

నిరసనలుసవరించు

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబీ శాఖ ఈ కేసులో సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తోంది. ఆప్ పంజాబ్ సమన్వయకర్త సచా సింగ్ - పోలీసుల ప్రమేయం చూస్తోంటే ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రగా ఇప్పటికే స్పష్టమైందన్నారు. ఆయన పంజాబ్ లోని వివిధ జిల్లాల్లో నిరసనలకు ప్రణాళిక వేశారు. [4]

హతుల కుటుంబ సభ్యులు, సమర్థకులు లూధియానా - చండీగఢ్ జాతీయ రహదారిని నిరసనపూర్వకంగా నిరోధించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాట్ కులస్తుడైన గుర్జీత్, దళిత యువకులు ఇద్దరూ తమను మించిపోవడం సహించలేక కుల వివక్షాపూరిత హింసకు పాల్పడ్డారని అన్నారు.[5]

అధికారులపై చర్యలుసవరించు

హత్యాయత్నం కేసులో ఉన్న ఈ ఇద్దరు సోదరులను చంపినందుకు పోలీసులు రివార్డు ఆశించారు. అయితే కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డులు సర్వీసు నుంచి డిస్మిస్ అయ్యారు. మోచివారా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మంజీందర్ సింగ్ కూడా డిస్మిస్ అయ్యారు. ఖన్నా జిల్లా ఎస్.ఎస్.పి. హర్ష్ కుమార్ బన్సాల్ ను కర్తవ్యాన్ని విడిచిపెట్టాడంటూ సస్పెండ్ చేశారు.[6] షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులపై కేసు నమోదైంది.

దర్యాప్తుసవరించు

14 అక్టోబర్ 2014న బొహాపూర్, జమాల్ పూర్ ప్రాంతాలు, అకాలీ నేత గుర్జిత్ సింగ్ స్వంత గ్రామమైన ఖొఖ్రాన్ ప్రాంతాల్లో ప్రజలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తోంది.[7] యువకుల గ్రామంలో వారికి మద్దతు లభిస్తూండగా, గుర్జీత్ గ్రామంలో మాత్రం ఆ సోదరులు ప్రమాదకారులని, భయంకరమైనవారనీ చెప్తున్నారు. బొహార్ పూర్, ఇరాక్ గ్రామాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలను ఈ సోదరులు లైంగికంగా వేధించినందుకు నేరనిరూణ అయింది, ఆ అమ్మాయిలను కూడా విచారిస్తున్నారు.[8]

మూలాలుసవరించు

  1. "Family blocks Ludhiana-Chandigarh road, demands CBI inquiry". Hindustan Times. 2014-09-28. Archived from the original on 2014-10-03. Retrieved 2016-07-16.
  2. Ludhiana shooting: SAD leader shot at brothers from close range:Retrieved from Hindustan Times Archived 2014-10-01 at the Wayback Machine: 30 September 2014
  3. Ludhiana fake encounter killings – Who is SAD (Badal) leader Gurjit Singh Machhiwara?:Retrieved from Sikh Siyasat Archived 2017-01-06 at the Wayback Machine: 1 October 2014
  4. AAP demands CBI probe into Ludhiana killings: Retrieved from The Times of India: 1 October 2014
  5. Family blocks Ludhiana-Chandigarh road, demands CBI inquiry: Retrieved from Hindustan Times Archived 2014-10-03 at the Wayback Machine: Dated 28 September 2014
  6. Punjab Government Constitutes Special Investigation Team into Jamalpur Fake Encounter: Retrieved from NDTV: Dated 30 September 2014
  7. Ludhiana killings: SIT records statements of family, villagers: Retrieved from Hindustan Times Archived 2014-10-14 at the Wayback Machine: Dated 14 October 2014
  8. Astonishing opening in Jamalpur Encounter case:Retrieved from Jag Bani