91వ అకాడమీ పురస్కారాలు

91వ అకాడమీ పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం 2019, ఫిబ్రవరి 24న (భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25 సోమవారం ఉదయం) అమెరికా కాలిఫోర్నియా లాస్ ఎంజెల్స్ నగరంలోని హాలీవుడ్ డాల్బీ థియేటర్లో జరిగింది. 2018లో ప్రపంచవ్యాప్తంగా రూపొందిన చిత్రాలనుండి ఉత్తమ చిత్రాలను ఎంపికచేసి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సెస్ వారిచే ఆస్కార్ అవార్డులు ఇవ్వబడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ లో ఈ కార్యక్రమాన్ని అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ టెలివిజన్ ప్రసారం చేసింది, దీనికి డోనా గిగ్లియోట్టి, గ్లెన్ వైస్ నిర్మాతలుగా వ్యవహరించగా, గ్లెన్ వైస్ దర్శకత్వం వహించాడు.[4] 1989లో 61వ అకాడమీ పురస్కారాలు కార్యక్రయం మాదిరిగానే వ్యాఖ్యాత లేకుండా నిర్వహించిన రెండవ వేడుక ఇది.

91వ అకాడమీ పురస్కారాలు
అధికారిక పోస్టర్
Dateఫిబ్రవరి 24, 2019 (భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 25 సోమవారం ఉదయం)
Siteడాల్బీ థియేటర్
హాలీవుడ్, లాస్ ఎంజెల్స్, కాలిఫోర్నియా, అమెరికా
Produced byడోనా గిగ్లియోట్టి
గ్లెన్ వైస్
Directed byగ్లెన్ వైస్
Highlights
ఉత్తమ చిత్రంగ్రీన్‌బుక్
ఎక్కువ పురస్కారాలు బొహెమియన్ రాప్సోడి (4)
ఎక్కువ నామినేషన్లుది ఫెవరెట్, రోమా (10)
Television coverage
Networkఅమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ
Duration3 గంటల, 23 నిముషాలు[1]
Ratings29.6 మిలియన్[2]
20.6% (Nielsen ratings)[3]

అకాడమీ 11వ వార్షిక గవర్నర్స్ అవార్డుల వేడుక 2018, నవంబరు 18న హాలీవుడ్ ప్రాంతంలోని హైలాండ్ సెంటర్ గ్రాండ్ బాల్‌రూమ్‌లో నిర్వహించబడింది.[5] 2019, ఫిబ్రవరి 9న బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ విల్షైర్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో అకాడమీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డులను హోస్ట్ డేవిడ్ ఓయెలోవో అందజేశాడు.

చరిత్ర

మార్చు

ఆస్కార్ అవార్డుగా పిలవబడుతున్న అకాడమీ పురస్కారాలు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతీ ఏటా చలనచిత్రరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు. మొట్టమొదటి అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 1929, మే 16న హాలీవుడ్‌లోగల హోటల్ రూజ్వెల్ట్‌లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడంకోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.[6]

పురస్కార విజేతలు

మార్చు

గ్రీన్‌బుక్ ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు మూడు అవార్డులను గెలుచుకుంది. బొహెమియన్ రాప్సోడి ఉత్తమ నటుడు (రమీ మాలిక్) అవార్డుతోపాటు నాలుగు అవార్డులను గెలుచుకొని ప్రథమస్థానంలో నిలిచింది. రోమా, బ్లాక్ పాంథర్ సినిమాలు మూడు అవార్డుల చొప్పున గెలుచుకున్నాయి.[7] రోమా చిత్ర దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోగా, ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్ర అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి మెక్సికన్ చిత్రంగా నిలిచింది. ది ఫేవరెట్‌ సినిమాలో గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే పాత్ర పోషించినందుకు ఒలివియా కోల్మన్ ఉత్తమ నటిగా ఎంపికయింది.[8] యునైటెడ్ స్టేట్స్ లో 29.6 మిలియన్ల వీక్షకుల సంఖ్యతో 2018 వేడుకకంటే 12% పెరిగింది. కాని ఇప్పటికీ అతి తక్కువమంది చూసిన వేడుకల జాబితాలో ఇది కూడా ఉంది.[9][10][11]

  • ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్
  • ఉత్తమ నటి: ఒలివియా కోల్మన్ (ది ఫెవరెట్)
  • ఉత్తమ నటుడు: రమీ మాలిక్ (బొహెమియన్ రాప్సోడి)
  • ఉత్తమ దర్శకుడు: అల్ఫాన్సో క్వేరాన్ (రోమా)
  • ఉత్తమ సంగీతం: బ్లాక్ పాంథర్
  • మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: గ్రెగ్ కన్నమ్, కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ (వైస్)
  • ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: రోమా
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: ఫస్ట్‌మ్యాన్
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: జాన్ ఓట్మాన్ (బొహెమియన్ రాప్సోడి)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: అల్ఫాన్సో క్వేరాన్ (రోమా)
  • ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: బొహెమియన్ రాప్సోడి
  • ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: బొహెమియన్ రాప్సోడి
  • ఉత్తమ సహాయనటి: రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
  • ఉత్తమ సహాయ నటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్)
  • ఉత్తమ యానిమేషన్‌ చిత్రం: స్పైడర్‌మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వర్స్
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: గ్రీన్‌బుక్
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: బావ్
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: స్పైక్ లీ (బ్లాక్లాంన్స్‌మాన్)
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: స్కిన్
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: హన్నా బీచ్లర్ (బ్లాక్ పాంథర్)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: రూత్ కార్టర్ (బ్లాక్ పాంథర్)
  • ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్‌): ఫ్రీ సోలో
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్: షాలో (ఏ స్టార్ ఈజ్ బార్న్)
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్

నామినేషన్లు - బహుమతులు

మార్చు

91వ అకాడమీ పురస్కారాల్లో, 52 సినిమాల నుండి 121 నామినేషన్లు వచ్చాయి. వాటిల్లో 15 సినిమాలకు 24 విభాగాల్లో అకాడమీ బముమతులు వచ్చాయి.

సినిమాల వారిగా నామినేషన్లు
నామినేషన్లు సినిమాలు
10 ది ఫెవరెట్
రోమా
8 ఏ స్టార్ ఈజ్ బార్న్
వైస్
7 బ్లాక్ పాంథర్
6 బ్లాక్లాంన్స్‌మాన్
5 బొహెమియన్ రాప్సోడి
గ్రీన్‌బుక్
4 ఫస్ట్‌మ్యాన్
మేరీ పాపిన్స్ రిటర్న్స్
3 ది బల్లాడ్ ఆఫ్ బస్టర్ స్క్రూగ్స్
కెన్ యు ఎవర్ ఫర్గీవ్ మీ?
కోల్డ్ వార్
బీల్ స్ట్రీట్ కుడ్ టాక్
2 ఐల్ ఆఫ్ డాగ్స్
మేరీ క్వీన్ స్కాట్స్
నెవర్ లుక్ అవే
ఆర్.జి.బి.
ఎక్కువ పురస్కారాలు పొందిన సినిమాలు
పురస్కారాలు సినిమాలు
4 బొహెమియన్ రాప్సోడి
3 బ్లాక్ పాంథర్
గ్రీన్‌బుక్
రోమా

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Adalian, Josef (25 February 2019). "Oscars See Ratings Bump, Host Be Damned". Vulture. Archived from the original on 26 ఫిబ్రవరి 2019. Retrieved 16 February 2020.
  2. Patten, Dominic (25 February 2019). "Oscar Ratings Up From 2018 To 29.6M Viewers With Hostless Show". Deadline Hollywood. Archived from the original on 25 February 2019. Retrieved 16 February 2020.
  3. Rourke, Robert (25 February 2019). "Oscar ratings 2019: 13 percent spike after all-time low in 2018". New York Post. Archived from the original on 2019-02-26. Retrieved 25 February 2019.
  4. McNary, Dave (అక్టోబరు 22, 2018). "Oscars: Donna Gigliotti, Glenn Weiss to Produce Telecast". Variety. Archived from the original on ఆగస్టు 15, 2018. Retrieved ఫిబ్రవరి 16, 2020.
  5. Goldstein, Micheline (4 September 2018). "The Academy to Honor Kathleen Keneedy, Marvin Levy, Frank Marshall, Lalo Schifrin and Cicely Tyson with Oscars at 2018 Governors Awards". Academy of Motion Picture Arts and Sciences. Archived from the original on 2017-12-02. Retrieved 16 February 2020.
  6. 90వ అకాడమి పురస్కారాలు. "OSCARS 2018: WINNERS LIST". edition.cnn.com. సీ ఎన్ ఎన్. Retrieved 16 February 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. సాక్షి, ఎడ్యుకేషన్ (26 February 2019). "ఆస్కార్ అవార్డులు-2019". www.sakshieducation.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
  8. "Oscars 2019: Green Book wins best picture as Rami Malek and Olivia Colman reign – as it happened". The Guardian. 24 February 2019. Archived from the original on 25 February 2019. Retrieved 16 February 2020.
  9. Patten, Dominic (25 February 2019). "Oscar Ratings Rise Over All-Time Low of 2018 with Hostless ABC Show". Deadline Hollywood. Archived from the original on 25 February 2019. Retrieved 16 February 2020.
  10. Pallotta, Frank (25 February 2019). "Oscars ratings rebound after record low year". CNN. Archived from the original on 26 February 2019. Retrieved 16 February 2020.
  11. Rourke, Robert (25 February 2019). "Oscar ratings 2019: 13 percent spike after all-time low in 2018". New York Post. Archived from the original on 2019-02-26. Retrieved 16 February 2020.

ఇతర లంకెలు

మార్చు