మండలి బుద్ధ ప్రసాద్

(Mandali Budhaprasad నుండి దారిమార్పు చెందింది)

మండలి బుద్ధ ప్రసాద్ ప్రముఖ రాజకీయ నాయకుడు,ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, తెలుగు భాషాభిమాని. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. సేవయే ధ్యేయంగా, జాతీయవాదం, గాంధేయవాదం కలగలిపిన మనిషి. తెలుగు భాషా, సంస్కృతులపై ఆసక్తి గల వ్యక్తిగా సుపరిచితులు.

మండలి బుద్ధ ప్రసాద్
మండలి బుద్ధ ప్రసాద్


ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి
అవనిగడ్డ శాసనసభ్యులు
పదవీ కాలం
2014 – 2019
ముందు అంబటి శ్రీహరి ప్రసాద్
తరువాత సింహాద్రి రమేశ్‌ బాబు
నియోజకవర్గం అవనిగడ్డ

అధికార భాషా సంఘం అధ్యక్షుడు
పదవీ కాలం
2010-2013

అవనిగడ్డ శాసనసభ్యులు
పదవీ కాలం
2004-2009
తరువాత అంబటి బ్రాహ్మణయ్య
నియోజకవర్గం అవనిగడ్డ

అవనిగడ్డ శాసనసభ్యులు
పదవీ కాలం
1999-2004
ముందు సింహాద్రి సత్యనారాయణ
నియోజకవర్గం అవనిగడ్డ

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-26) 1956 మే 26 (వయసు 68)
నాగాయలంక, కృష్ణా జిల్లా
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (1972-2014)
తెలుగుదేశం (2014- 2024)
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
నివాసం హైదరాబాదు

మండలి బుద్ధప్రసాద్ 2024 ఏప్రిల్ 1న  జనసేన పార్టీలో చేరాడు.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

మండలి బుద్ధ ప్రసాద్ మే 26, 1956 తేదీన నాగాయలంక, కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు ప్రముఖ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, సమాజ సేవకుడు. చిన్నప్పుడు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా వుండడంతో అభద్రతా భావంతోనే మండలి పెరిగారు. సాహిత్య, చరిత్ర పుస్తకాలు అప్పడు ఎక్కువగా చదవటం అలవడింది. బుద్ధప్రసాద్ ఆర్ట్స్ లో పట్టాపుచ్చుకున్నారు. విజయలక్ష్మిని పెళ్ళిచేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు.[2]

రాజకీయ జీవితం

మార్చు

అవనిగడ్డ నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పన్నెండేళ్ళ పాటూ పనిచేశారు. 2007 ఏప్రిల్ లో పశుసంవర్థక, పాలపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిత్వమును నిర్వహించారు. రైతు కుటుంబ నుండి వచ్చినవారు కాబట్టి రైతుల సంక్షేమం కోసం పాటుబడ్డారు. కృష్ణా డెల్టాకు రెండు పంటల నీరుపంపిణీకి కృషి చేసి సాధించారు. ఆయన తండ్రి జీవితాశయమైన పులిగడ్డ -పెనుమూడి వారధిని సాకారం చేశారు. రాజకీయాలలో నీతి, నిజాయితీకి పేరుతెచ్చుకున్నారు.[2] తెలుగు మాధ్యమంగా పాఠశాల విద్యకొరకు జి.వో సాధించటానికి కృషి చేశారు.[3]

2012 అక్టోబరులో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘంకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు[4]. ఆయన ఆధ్వర్యంలో 2012 ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి, పరిపాలనా భాషగా అమలుకు కృషి చేశారు. అయితే తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక 2013 ఆగస్టు 1 న రాజీనామా చేశారు.[5] తదుపరి తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకుని అవనిగడ్డ నుండి పోటీ చేసి 2014 సాధారణ ఎన్నికలలో గెలిపొందారు.ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఉపసభాపతిగా ఎన్నుకోబడ్డారు.

సామాజికసేవ

మార్చు

"గాంధేయ" సమాజసేవాసంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. తెలుగుకి ప్రాచీన భాషా హోదా కొరకు ఏర్పాటైన భాషోద్యమశాఖకు బలమైన ఆధారంగా నిలిచాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సేవలందించాడు.

సాహిత్య సేవ

మార్చు
  • భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం వజ్రభారతి కి సంపాదకత్వం వహించాడు.[6]
  • పసిడి పేరుతో ఆంధ్ర ప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో 50 ఏళ్ళ తెలుగు భాషా, సంస్కృతి సాహిత్య వికాస పరిణామాల సమీక్షగా 112 వ్యాసాల సంకలనానికి సహసంపాదకునిగా వ్యవహరించాడు.[7]

మూలాలు

మార్చు
  1. Eenadu (1 April 2024). "పవన్‌ సమక్షంలో జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్‌". Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  2. 2.0 2.1 పి, రమేష్ రెడ్డి (2012). "ప్రజల మనిషి మండలి". తెలుగు తేజం. 4 (12). బొగ్గవరపు మాల్యాద్రి: 24.
  3. "అనుభవం (అంధ్రజ్యోతి దినపత్రిక)". Retrieved 2014-03-21.
  4. అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012
  5. "తెలుగు టైమ్స్ వార్త". Archived from the original on 2016-03-04. Retrieved 2013-11-26.
  6. మండలి, బుద్ధప్రసాద్ (సం) (2007). వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం. కృష్ణా జిల్లా రచయితల సంఘం. Archived from the original on 2013-04-29. Retrieved 2014-03-20.
  7. మండలి, బుద్ధప్రసాద్ , ఇతరులు (2006). పసిడి : ఆంధ్ర ప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో 50 ఏళ్ళ తెలుగు భాషా, సంస్కృతి సాహిత్య వికాస పరిణామాల సమీక్షగా 112 వ్యాసాల సంకలనం. కృష్ణా జిల్లా రచయితల సంఘం.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]