అంబటి బ్రాహ్మణయ్య

అంబటి బ్రాహ్మణయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు.

అంబటి బ్రాహ్మణయ్య
అంబటి బ్రాహ్మణయ్య
జననంఅంబటి బ్రాహ్మణయ్య
1940 జనవరి 13
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం, వక్కపట్లవారిపాలెం గ్రామం
మరణం2013 ఏప్రిల్ 21
ప్రసిద్ధిశాసన సభ్యుడు

అంబటి బ్రాహ్మణయ్య గల్లీ నుండి ఢిల్లీకి ఎదిగిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. దివిసీమలోని కుగ్రామమైన నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెంలో అంబటి రాయుడయ్య, వెంకట సుబ్మమ్మలకు బ్రాహ్మణయ్య 13-01- 1940న జన్మించారు. రైతు కుటుంబలో జన్మించిన ఆయన వ్యవ సాయదారు డిగా తన జీవితాన్ని ప్రారంభించారు.

రాజకీయ జీవితం

మార్చు

ఆయన తొలి నాళ్లలోనే నంగేగడ్డ పం చాయితీ వార్డు మెంబరుగా రాజకీయ అరంగేట్రం చేశారు.1964లో గ్రామ పంచాయితీ వార్డు మెంబరుగా ఎన్నికై 70 నుండి 81 వరకు వక్కపట్లవారిపాలెం సర్పంచిగా, 81 నుండి 86 వరకు అవనిగడ్డ సమితి అధ్యక్షుడిగా బ్రహ్మణయ్య పనిచేశారు. 1985లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన జిల్లా పార్టీ కన్వీనర్‌గా 86 నుండి 88 వరకు జిల్లా టిడిపి కార్యదర్శిగా, 88 నుండి 90 వరకు రాష్ట్ర టిడిపి కార్యదర్శిగా, 1990 నుండి 94 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, 1994 నుండి 99 వరకు మచిలీపట్నం ఎమ్మెల్యేగా, 1999 నుండి 2004 వరకు బందరు పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ శాసనసభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు శ్రీహరిప్రసాద్, కుమార్తెలు సులోచన, వరలక్ష్మీ, భాగ్యలక్ష్మీ ఉన్నారు. 1994లో అవనిగడ్డ నియోజకవర్గానికి సీటు కోసం చివరి వరకు ప్రయత్నించిన ఆయన అప్పటి పరిస్ధితిలో పార్టీ అధ్యక్షులు ఎన్టీ రామారావు కోరిక మేరకు మచిలీపట్నం శాసన సభ్యునిగా పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. నాటి సంగతులను ఆయన పదే పదే దివిసీమ ప్రజానీకానికి చెబుతూ ఉండేవారు. ఎన్టీ రామారావు మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో లక్ష్మీ పార్వతీ స్ధాపించిన అన్న తెలుగుదేశం పార్టీలో క్రియా శీలక పాత్ర పోషించి పార్లమెంటులో జరిగిన ఉప ఎన్నికల్లో తెనాలి పార్లమెంటు అభ్యర్థిగా 1996 లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే విధంగా 2004లో బందరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.[1]

మూలాలు

మార్చు
  1. http://www.suryaa.com/main/news/Article.asp?Category=1&SubCategory=2&ContentId=133865[permanent dead link]