అత్తిపత్తి
అత్తిపత్తి లేదా సిగ్గాకు (ఆంగ్లం Touch-me-not) ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల ప్రాకే మొక్క. సంస్కృతంలో నిద్రభంగి, లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని అంటారు ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం మైమోసా ప్యూడికా (లాటిన్లో ప్యూడికా అంటే సిగ్గు అని అర్ధం). ఈ మొక్కను కేవలం దాని విలక్షణతకై పెంచుకుంటుంటారు. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపుమొక్కగా పెరుగుతుంది.
అత్తిపత్తి | |
---|---|
ముట్టుకుంటే ముడుచుకొనే (మైమోసా పుడికా) ఆకులు , పుష్పం | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | |
Species: | మై. ప్యూడికా
|
Binomial name | |
మైమోసా ప్యూడికా |
వివరణ
మార్చుమిమోసా పూడిక అనే మొక్కని సున్నితమైన మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క ఫాబేసి కుటుంబంకి చెందినది. ఈ మొక్క పాకే వార్షిక లేదా శాశ్వత మూలిక.దిని స్వస్థలం దక్షిణ అమెరికా, మధ్య అమెరికా. ఇది ఆసియా ఖండం లోనీ థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కూడా చూడ వచ్చు. ఇది చెట్లు లేదా పొదల క్రింద, చీకటిగావుండే ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. వీటిని తాకినప్పుడు గాని కదిలించినప్పుడు గాని హాని నుండి తమను తాము కాపాడుకొవదడం కోసం ఆకులు ముడుచుకుంటాయి, మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత తిరిగి తెరచుకుంతటాయి.
కాండం యువ మొక్కలలో నిటారుగా ఉంటుంది, కాని పెరిగే కొద్ది తీగ లాగ ప్రాకుతుంది.కాండం సన్నగా 1.5 m (5 ft) పొడవు పెరుగుతుంది.మొక్క పెరిగే కొద్ది పూవ్వులూ బాగా పూస్తాయి.ఈ మొక్క యొక్క పువ్వు లేత గులాభి రంగులో గుండ్రంగా ఉంతటాయి. ఈ మొక్క యొక్క పండు సమూహాలుగా 1–2 cm పొడవు ఉంటుంది. ఈ పండు ఎండిపోయినప్పుడు 2-5 సమూహాలుగా విడిపోతాయి. వీటి విత్తనాలు 2.5 mm పొడవుతో లేత గోధుమ రంగులో ఉంటాయి.పువ్వులలో గాలి, కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. విత్తనాలు మొలకెత్త కుండా గట్టి విత్తన పొర ఉంటుంది.
లక్షణాలు
మార్చు- కంటకాలు వంటి నిర్మాణాలతో సాగిలబడి పెరిగే చిన్నపొద.
- ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- సమపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న కెంపురంగు పుష్పాలు.
- నొక్కులు కలిగి తప్పడగా ఉన్న కాయలు.
ముట్టుకోగానే ఆకులన్నీ ముడుచుకొని కొంత సమయం తరువాత మళ్ళి విచ్చుకుంటాయి. వర్షాకాలంలో మన గ్రామాలచుట్టూ నీటితడివున్న ప్రదేశాలలో ఈమొక్క పెరుగుతుంది.ఇందులోఓ ముళ్ళులేని, ముళ్ళుఉన్న రెండురకాలు ఉంటాయి. ముళ్ళున్న అత్తపత్తి భూమినుండి జానెడు మొదలు మూరడు వరకు ఎత్తు పెరుగుతుంది. ఆకులు తుమ్మ ఆకులలాగా చిన్నగా ఉంటాయి. కొమ్మలకు ముళ్ళు ఉంటాయి. పూలు ఎరుపుకల్కిసిన ఊదారంగులో ఉంటాయి. ముళ్ళు లేని అత్తపత్తి నేలపై పరచుకొని ఉంటుంది.ఇదికూడా నీరున్న ప్రాంతాలలోనే పెరుగుతుంది. నేలపైన రెండు మూడు గజాలదాకా పాకుతుంది.దీనికి పసుపు రంగు పూలు పూస్తాయి, సన్నటి కాయలుంటాయి. కాయల్లో గింజలు లక్కరంగులో ఉంటాయి.
అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి?
మార్చుఅత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి.
దీనిలో కొన్ని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి. ఆకుల కింద ద్రవంతో నిండిన సంచులుంటాయి. ఆ సంచులలో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకొని వుంటాయి. ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు స్మర్శని గ్రహిస్తాయో అవి వెంటనే ఆ సంకేతాలను సంచులకు పంపుతాయి. అప్పుడు సంచులలో నుండి ద్రవం బయటకు (మొక్క కొమ్మలోపలికి) వెళ్లి పోతుంది. దాంతో ఆకులు ముడుచుకు పోతాయి. మరల కొద్దిసేపటికి సంచులలో ద్రవం నిండి ఆకులు విచ్చుకొంటాయి. ఇది ఒక రక్షణ పద్ధతి. పశువులు, జంతువులు ఆకులను తాకగానే ముడుచుకోవటం వలన మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది. దీని వల్ల జంతువులు తినకుండా వెళ్లిపోతాయి. మరికొన్ని మొక్కలు రాత్రిళ్ళు వాటంతట అవే ఆకుల్ని ముడుచుకుంటాయి.[1]
ఔషధ గుణాలు
మార్చుఈ మొక్కలో వుండే రసాయనం మైమోసిన్ (ఆల్కలాయిడ్).
- రక్త శుద్ధి చేస్తుంది.
- ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుంది
- స్త్రీరోగాలను హరించి వేస్తుంది.ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీచేస్తుంది,
- ఇది వాతాన్ని హరిస్తుంది.
- పాత వ్రణాలనుమాన్పుతుంది.
- మధుమేహ రోగాల్ని, ములవ్యాధిని, బోధకాలును, కమేర్లను, పోడలను కుష్టును, విరేచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాసాలను, తుంటి నొప్పిని, ఉబ్బరోగం వంటి వాటిని తగ్గిస్తుంది.
అత్తపత్తి - గుణ ప్రభావాలు : ఇది వాతాన్ని హరిస్తుంది, రక్త శుద్ధిచేస్తుంది, ఋతురక్తాన్ని, మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తుంది. ముక్కునుండి కారే రక్తాన్ని ఆపుతుంది. పాత వ్రణాలను మాన్పుతుంది..మేహ రోగాలను, మూల వ్యాధిని, బోదకాలును, కామెర్లను, పొడలను, కుష్ఠును, విరెచనాలను, జ్వరమును, గుండెదడను, శ్వాసకాలను, తుంటినొప్పిని, ఉబ్బురోగాన్ని, స్త్రీరోగాలౌ హరించి వేస్తుంది.
వీర్యహీనతకు - బ్రహ్మాస్త్రం : అత్తపత్తి గింజలు, చింతగింజలపప్పు, నీరుగొబ్బిగింజలు సమంగా తీసుకొని మఱ్ఱిపాలలో ఒకరాత్రి నానపెట్టి తరువాత గాలికి ఆరపెట్టి మెత్తగానూరి శనగ గింజలంత మాత్రలుచేసి గాలికి ఎండపెట్టి నిలువ చేయాలి. రెందు పూటలా పూటకు మూడు మాత్రలు నీటితో వేసుకొని వెంటనే నాటుఆవుపాలు కండచక్కెర కలిపి తాగాలి. నలభై రోజుల్లో వీర్యము పోవడం, శిఘ్రస్కలనం, నపుంసకత్వం, అంగబలహీనత హరించి ధాతుపుష్టి కలుగుతుంది. వేడి, పులుపు, కారం పదార్థాలు నిషేధించి బ్రహ్మచర్యం పాటించాలి.
ఎరుపు, తెలుపు, పసుపు శెగలకు : ఇది ఇతరులు మూత్రం పోసిన చోట మరొకరు మూత్రంపోయటం వలన గానీ, లేక సెగరోగం ఉన్న వారితో సంభోగం జరపటం వల్లగానీ, ఈ సుఖరోగం కలుగుతుంది. ఈ సమస్యకు అత్తపత్తి ఆకు, మంచిగంధంపొడి సమంగా తీసుకొని కలబందగుజ్జుతో మెత్తగానూరి మాత్రలుకట్టి నీడలో గాలికి బాగా ఎండపెట్టి నిలువ చేయాలి. రోజూ రెండు పూటలా పూటకు ఒక మాత్ర మంచినీటితో వేసుకుంటూవుంటే సెగరోగం తగ్గిపోవటమే కాక వీర్యవృద్ది కలుగుతుంది.
నారి కురుపులు నశించుటకు : అత్తపత్తి ఆకులు మెత్తగానూరి నారికురుపులపై వేసి కట్టుకడుతుంటే అవి హరించి పోతాయి. గోగూర వంకాయ, మాంసం, చేపలు నిషేధం.
ఆగిన బాహిష్టు మళ్ళి వచ్చుటకు : అత్తపత్తి ఆకుపొడి ఒకభాగము, పటికబెల్లం పొడి రెందుభాగాలు కలిపిపూటకు అరచెంచా పొడి మంచినీటితో సేవిస్తుంటే ఆగిన బాహిష్టు మరలా వస్తుంది. రాగానే చూర్ణం వాడటం ఆపాలి. బెల్లం, నువ్వులు, గంజి, తీపి పాదార్థాలు వాడాలి.
వీర్యస్తంభనకు : అత్తపత్తి వేర్లను మేకపాలతోగానీ, గొర్రెపాలతోగానీ, గంధంలాగానూరి ఆగంధాన్ని పురుషులు తమ అరికాళ్ళకు మర్థించుకొని ఆతరువాత రతిలో పాల్గొంటే చాలాసేపటివరకూ వీర్యపతనంకాదు. తీపిపదార్థాలు బాగావాడుకోవాలి.
మూలాలు
మార్చుయితర లింకులు
మార్చు- A list of notable chemical compounds found in Mimosa pudica
- View occurrences of Mimosa pudica in the Biodiversity Heritage Library
- "Sensitive Plant" page by Dr. T. Ombrello
- Page about nyctinasty and leaf movement of Mimosa pudica by John Hewitson
- Youtube video: Mimosa Pudica
- Indiana.edu "Plants in motion" videos of Mimosa pudica: 1 and 2