పాత ఢిల్లీ

(Old Delhi నుండి దారిమార్పు చెందింది)

పాత ఢిల్లీ, ఢిల్లీ నగరం లోని భాగం. 1639 లో షాజహానాబాద్  పేరుతో షాజహాన్ దీనిని నిర్మించాడు.తన రాజధానిని ఆగ్రా నుండి దీని నిర్మాణం 1639 లో ప్రారంభమై 1648 లో పూర్తయింది. అప్పటి నుండి 1857 లో మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకూ ఇది వారికి రాజధానిగా ఉంది.[1][2][3] 1857 తరువాత ఇది బ్రిటిషు వారి అధీనంలోకి వచ్చింది. ఐతే  బ్రిటిషువారు కలకత్తానుండి రాజ్యం చేస్తున్నందువలన ఢిల్లీ, రాజధాని నగరం హోదాను కోల్పోయింది.ఇది మధ్య ఢిల్లీ జిల్లా పరిధిలో ఉంది.

పాత ఢిల్లీ

(షాజహానాబాద్)
—  గోడల నగరం  —
పాత ఢిల్లీ is located in ఢిల్లీ
పాత ఢిల్లీ
పాత ఢిల్లీ
దేశం  భారతదేశం
కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ
జిల్లా మధ్య ఢిల్లీ జిల్లా

దీనిని 1911 లో మరల రాజధానిగా ప్రకటించిన తరువాత పునర్వైభవం అందుకుంది.ఇది మొగలుల చారిత్రిక  నిర్మాణాలకు ప్రతీకగా నిలిచింది.ఒకప్పుడు దర్బారు ఉద్యోగుల నివాస భవనాలతో, అందమైన మసీదులు, తీటలతో పాత ఢిల్లీ కళకళలాడుతూ ఉండేది. నేటికీ, జనసంద్రం దీన్ని ముంచెత్తినప్పటికీ, ఇది మెట్రోపాలిటన్ ఢిల్లీకి కేంద్రంగానే ఉంది. ఆనాటి హవేలీలు కొద్ది సంఖ్యలో మాత్రమే మిగిలాయి. ఆనాటి ఇస్లామిక్ శైలి నిర్మాణాలకు ప్రతీక వంటి జామా మసీదు వంటి కొన్ని నిర్మాణాలు ఇంకా హుందాగా నిలబడి ఉన్నాయి. పాత ఢిల్లీ వీధి తినుబండారాలకు, షాపింగుకూ కూడా ప్రసిద్ధి.

2012 లో ఢిల్లీ నగరపాలక సంస్థను మూడు విభాగాలుగా విభజించాక, పాత ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషను పాలన లోకి వచ్చింది.[4][5]

చరిత్ర

మార్చు
 
ఎర్రకోట

షాజహానాబదును నిర్మించిన స్థలం అంతకు ముందున్న నివాస ప్రాంతాలకు ఉత్తరంగా ఉంది. ఈ కొత్త నగర దక్షిణపు కొన అంతకు ముందరి పాలకులైన తుగ్లకుల నివాస స్థావరాలతో కలిసేది. 14 వ శతాబ్దంలో ఆ ప్రాంతం ఢిల్లీ సుల్తానేటుకు పీఠంగా ఉండేది. ఢిల్లీ సుల్తానేట్లు 1206 ఉండి 1526 వరకు ఢిల్లీ నుండి పాలించారు,.

ఢిల్లీ నగరం మొగలులకు ముఖ్యమైన స్థానంగానే ఉంటూ వచ్చింది. వారిక్కడ రాజప్రాసాదాలను, కోటలనూ నిర్మించారు. అన్నిటికంటే ముఖ్యంగా 1638-1649 మధ్య షాజహాన్ నిర్మించిన నగరం. అందులో ఎర్ర కోట, చాందినీ చౌక్ లను నిర్మించాడు. ధిల్లీ తొలి హోల్‌సేల్ మార్కెట్టు, చావడీ బజారు 1840 లో మొదలైంది. 1850 లో సుగంధ ద్రవ్యాల మార్కెట్టు మొదలైంది. దర్యాగంజ్ లో పూల మార్కెట్టు 1869 లో మొదలైంది. ఈ నాటికీ ఈ మార్కెట్టు ఉంది.[6]

1857లో మొగలులు పతనమయ్యాక, బ్రిటిషు వారు రాజధానిని కలకత్తాకు మార్చారు., 1911 వరకూ రాజధాని అక్కడే ఉంది. రాజధానిని ఢిల్లీకి మార్చాలని నిశ్చయించాక, బ్రిటిషు వారు కొత్త ఢిల్లీని (లుట్యెన్స్ ఢిల్లీ) నిర్మించారు.1931 లో అది పూర్తైంది. అప్పటి నుండి అంతకు ముందున్న నగరాన్ని పాత ఢిల్లీ అని పిలవడం మొదలైంది.

గోడలు, ద్వారాలు

మార్చు
 
పాత ఢిల్లీ నగరంలో కాశ్మీర్ గేట్

పాత ఢిల్లీ నగరాన్ని పావు వృత్తం ఆకారంలో నిర్మించారు. ఎర్ర కోట దీని కేంద్రం వద్ద ఉంటుంది. పాత నగరం చుట్టూ ఒక గోడ, దానికి 14 ద్వారాలూ ఉన్నాయి.[7] గోడ 12 అడుగుల వెడ్ల్పు, 26 అడుగుల ఎత్తుతో ఉంటుంది. తొలుత దీన్ని మట్టితో కట్టారు. 1657 లో దాని స్థానంలో ఎర్ర రాతితో కొత్తగా నిర్మించారు. మొగలుల కాలంలో రాత్రి వేళ ఈ ద్వారాలకు తాళాలు వేసేవారు. ప్రస్తుతం ఈ గోడ చాలావరకు మాయమై పోగా, ద్వారాలు మాత్రం మిగిలాయి.[8] ఢిల్లీకి దక్షిణాన, గోడకు వెలుపల ఉన్న ఖూనీ దర్వాజా, షేర్ షా సూరి కట్టించింది.

  1. నిగంబోధ్ ద్వారం: ఈశాన్యాన. యమునా నదిపై ఉన్న నిగంబోధ్ ఘట్టానికి వెళ్ళే దారి ఇక్కడ మొదలౌతుంది
  2. కాశ్మీరీ గేట్: ఉత్తరాన
  3. మోరీ గేట్: ఉత్తరాన
  4. కాబూలీ గేట్: పశ్చిమాన
  5. లాహోరీ గేట్: పశ్చిమాన సదర్ రైల్వే స్టేషనుకు సమీపాన ఉంది.[9][10]
  6. అజ్మీరీ గేట్: నైఋతిలో ఉంది. కనాట్ ప్లేస్ కు వెళ్ళే దారి ఇక్కడ మొదలౌతుంది.
  7. తుర్క్‌మన్ గేట్: నైఋతి. షాజహాన్ కు ముందరి కట్టడాలకు దగ్గరగా ఉంటుంది. అవి గోడల లోపలే ఉన్నాయిఉదా: షా తుర్క్‌మన్ బయాబానీ సమాధి
  8. ఢిల్లీ గేట్: దక్షిణాన ఫెరోజ్ షా కోట్లాకు వెళ్ళే దారిలో ఉంది.

మూలాలు

మార్చు
  1. Spear, Percival (2012). "Delhi: A Historical Sketch - The Mogul Empire". The Delhi Omnibus. New Delhi: Oxford University Press. p. 26. ISBN 9780195659832.
  2. History of Mughal Architecture By Ram Nath, Abhinav Publications, 2006
  3. City of Djinns: A Year in Delhi By William Dalrymple, Olivia Fraser, HarperCollins, 1993
  4. Kavitha, Rao (8 October 2012). "Tragic chapter in an Old Delhi library's history". The National (in ఇంగ్లీష్). Archived from the original on 15 February 2018. Retrieved 14 February 2018.
  5. "Remove overhead wires in old Delhi: North body". The Indian Express. 13 December 2017. Archived from the original on 11 October 2019. Retrieved 14 February 2018.
  6. Ashok Kumar Jain (2009). Urban transport: planning and management. APH Publishing. pp. 166, 176. ISBN 81-313-0441-8.
  7. http://www.milligazette.com/Archives/2004/01-15Jun04-Print-Edition/011506200496.htm Archived 19 జూన్ 2017 at the Wayback Machine Dilli's gates and windows By Mahtab Jahan
  8. Showers bring down ASI-protected wall in Old Delhi Archived 21 సెప్టెంబరు 2013 at the Wayback Machine, ExpressIndia (web-site), The Indian Express, 2003-07-19
  9. Rehnuma-e-Mazaraat Delhi, Mohammad Asim-ul-Qadri Sanbhli, Mohammad Book Depot, 2007, Old Delhi India
  10. Sunbhli, Mohammad Asim Al-Qadri, 2007, Rehnuma-e-Mazaraat Delhi Sharif, Muhammadi Book Depot, 523 Waheed Kutb Market Matia Mahal Jamai Mosque, Delhi-6, India, p.p. 284

వెలుపలి లంకెలు

మార్చు