దినోత్సవాలు

(World Population Day నుండి దారిమార్పు చెందింది)
Population density by country (2007)

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

మార్చు

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day) ప్రతి సంవత్సరం నవంబర్ 19 తేదీన జరుపుకుంటాము. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్, టొబాగోలో 1999 లో ప్రారంభించబడింది.[1]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మార్చు

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) జరుపుకుంటాము.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మార్చు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 1999 నవంబర్ 17లో యునెస్కో సంస్థచే ప్రకటించబడింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.

అటవీ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం నవంబర్ 10 న జరుపుకుంటారు. 1991 నవంబర్ 10న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service - IFS) అధికారి శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతిసంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం

మార్చు

ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు.[2][3]

జాతీయ ఓటర్ల దినోత్సవం

మార్చు

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవమును జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా జాతీయ ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

జాతీయ పత్రికా దినోత్సవం

మార్చు

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) : ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకు ఐక్య రాజ్య సమితి 1989లో దీనిని ప్రారంభించింది. 1987లో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన రోజు జూలై 11 కాబట్టి ఆరోజును గుర్తించారు.ప్రపంచ జనాభా 20వ సంవత్సరాల తరువాత 2007 జూలై 11న 6,602,226,175 కు చేరింది.


ప్రపంచ పర్యావరణ దినం

మార్చు

ప్రధాన వ్యాసం ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినం (ప్ర.ప.ది.) (World Environment Day 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడింది. ప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారములో ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. 1972వ సంవత్సరమే స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ పధకం (United Nations Environment Programme) ఇదే వేదికను ఉపయోగించుకొని పర్యవరణానికి సంబంధించి రాజకీయులకు, ప్రజలకు ఎఱుకను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.

మానవ హక్కుల దినోత్సవం

మార్చు

ప్రతి సంవత్సరం డిసెంబరు 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం (Human Rights Day) జరుపుకుంటాము.

ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మానవ హక్కుల రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. సాధారణ, సాంఘిక సమస్యలను చర్చిస్తాయి.

2006వ సంవత్సరంలో మానవ హక్కుల దినాన్ని పురస్కరించుకుని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం సలిపారు. నిజంగా తిండి, బట్ట, గూడు లాంటి కనీస అవసరాలు తీరకపోవడం ఎంత విషాదం?! ఈ సందర్భంగా ఎందరో ఉపయుక్తమైన ప్రకటనలు విడుదల చేశారు. పేదరికాన్ని రూపుమాపాలని, అందుకు మనమంతా కృషిచేయాలని మేధావులెందరో అభిప్రాయపడ్డారు. 2008 డిసెంబరు 10న యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేషన్స్‌ సెక్రటరీ జనరల్‌ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తమ హక్కులేంటో తెలియజెప్పడం, అవసరమైన సహకారం అందించడం ధ్యేయంగా పెట్టుకుని అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. 1998లో మాల్దావా ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్‌లో షియా మింగ్‌-టెహ్‌ 1979లో హ్యూమన్‌ రైట్స్‌ ప్రదర్శనలు నిర్వహించింది. 2004లో చైనా, మాల్దివులు, వియత్నాం దేశాల్లో ఖైదీలుగా ఉన్న సైబర్‌ డిసిడెంట్స్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్నేషనల్‌ పెన్‌ ప్రదర్శనలు నిర్వహించింది. అమెరికా, ఆఫ్రికా, ఐరోపా‌ దేశాలు మానవ హక్కుల సంరక్షణకోసం యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రత్యేక దినాన సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. చిలీ మాజీ ప్రెసిడెంటు, డిక్టేటర్‌ ఆగస్టో పినోచెట్‌ ఎంత విధ్వంసం సృష్టించాడో, మానవ హక్కులకు భంగం కలిగించాడో విదితమే.

ఆ చండశాసనుడు 91 ఏళ్ళ వయసులో 2006 డిసెంబరు 10న గుండెపోటుతో మరణించాడు. కాలిఫోర్నియాలోని గే హక్కుల (హోమో సెక్సువల్స్‌, ఇంకా వారిని సమర్థించేవాళ్ళు) కార్యకర్తలు కాలింగ్‌ ఇన్‌ 'గే' పేరుతో సమాన హక్కులకోసం పోరాడుతూ ప్రజలను సహాయం అర్థించారు. గే పెళ్ళిళ్ళపై నిషేధం విధించినందుకు ఈవిధంగా నిరసన తెలియజేశారు. పారిస్‌లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ 60వ మానవ హక్కుల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఆ ఏడాది కాంబోడియా, తదితర దేశాల్లో ఉత్సవాలు జరిగాయి. 5వేలకు పైగా ప్రజలు ఈ సందర్భంగా మార్చింగ్‌ జరిపారు. వెయ్యిమందికి పైగా పెద్ద బెలూన్లను విడుదల చేశారు. రష్యా, భారత్‌ల్లోనూ మానవ హక్కుల దినోత్సవాలను గొప్పగా జరిపారు. గత సంవత్సరం కూడా ఈ ప్రత్యేక దినాన సభలు, సమావేశాలతో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నించాయి. ఈరోజు కూడా మనదేశంతో సహా అనేక దేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనమంతా మన బాధ్యతలను సక్రమంగా, నిజాయితీగా నిర్వహిద్దాం. మన కనీస హక్కులకోసం నిస్సంశయంగా పోరాడుదాం. బ్రతుకు, బ్రతకనివ్వు అనే సిద్ధాంతాన్ని నమ్ముదాం.

పోలీసులంటే భయం

మార్చు

కాలం మారినా పోలీసులపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయంలో మాత్రం తేడా రాలేదని తేలింది. పోలీసులు దశాబ్దాల తరబడి పక్షపాత నైజాన్ని మార్చుకోక పోవడంతో ప్రజల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో వారిపై అపనమ్మకం, భయం పెరిగి పోయాయని మానవ హక్కుల సంస్థ స్పష్టం చేసింది.పరపతి కలిగిన వ్యక్తులు, పెద్దస్థాయి వారితో సంబంధాలు ఉన్నవారు మాత్రమే పోలీసుల సహాయాన్ని కోరటానికి ముందుకు వస్తున్నారని, పక్షపాతంతో వ్యవహరించటం, రాజకీయ ప్రేరణలతో సామాన్యుల ఫిర్యాదులు నమోదు చేసుకోకపోవటం, అకారణంగా నిర్బంధించటం, చిత్రహింసలు, చంపటం, రాజకీయ నేతల కోసం నేరాలకు పాల్పడటం. వల్ల పోలీసులంటే భయం, అపనమ్మకం పెరిగిపోయాయని తమ నివేదికలో స్పష్టం చేశారు.

మూలాలు

మార్చు
  1. 'UNESCO comes out in Support of International Men's Day', Article Trinidad Guardian Nov 20, 2001
  2. ప్రజాశక్తి, ఎడిఓరియల్ (14 December 2019). "ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ". www.prajasakti.com. జె.వి రత్నం. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
  3. ఈనాడు, జిల్లాలు (14 December 2019). "పొదుపు చేద్దాం ఇంధనాన్ని". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.

బయటి లింకుల

మార్చు