అంజనీరెడ్డి
అంజనీరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
అంజనీరెడ్డి | |
---|---|
జననం | 1951 నందికంది గ్రామం, సంగారెడ్డి జిల్లా, |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | చిత్రకారిణి |
జననం
మార్చుఅంజనీరెడ్డి 1951 లో సంగారెడ్డి జిల్లా, నందికంది గ్రామంలో జన్మించారు.[2]
విద్యాభ్యాసం - ఉద్యోగం
మార్చుఅంజనీరెడ్డి హైదరాబాద్ లోని జేఎన్టీయూలో పెయింటింగ్‌లో నేషనల్ డిప్లొమా పూర్తిచేసింది. రెండు దశాబ్దాలకు పైగా ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అధ్యాపకురాలిగా పనిచేసింది.
చిత్రకళారంగంలో
మార్చుఅంజనీరెడ్డి 1976 నుంచి చిత్రకారిణిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పెయింటింగ్ ఎగ్జిబిషన్లలో పాల్గొని తెలంగాణ ఖ్యాతి చాటిచెప్పింది. అమెరికా, రష్యా, సింగపూర్, బ్యాంకాక్ లతో పాటు న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో పెయింటింగ్ ప్రదర్శనలు ఏర్పాటుచేసింది. దేశవ్యాప్తంగా క్యాంపులు, పెయింటింగ్, మల్టీమీడియా వర్క్‌షాపులకు హాజరయింది. ఈవిడ మహిళల సమస్యలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ఎక్కువగా చిత్రాలు చిత్రీకరించింది.
బహుమతులు - పురస్కారాలు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం (2014), 14 జూలై 2016[3]
- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2017 మార్చి 8
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 8 April 2017.
- ↑ కళాకృతి ఆర్ట్ గ్యాలరీ. "Anjani Reddy". Retrieved 8 April 2017.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (29 June 2016). "తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు". www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.