అందాల రాక్షసి

2012 సినిమా

అందాల రాక్షసి హను రాఘవపూడి దర్శకత్వంలో 2012 లో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్. ఎస్. రాజమౌళి వారాహి చలన చిత్ర పతాకంపై నిర్మించారు.ఈ చిత్రం 2012 ఆగస్టు 10 న విడుదలైంది.

అందాల రాక్షసి
Andala Rakshahi Poster.jpg
దర్శకత్వంహను రాఘవపూడి
కథా రచయితహను రాఘవపూడి
దృశ్య రచయితహను రాఘవపూడి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంమురళి జి
ఎడిటర్జి. వి. చంద్రశేఖర్
సంగీతంరాధన్
ప్రొడక్షన్
కంపెనీ
డిస్ట్రిబ్యూటర్శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (ఆంధ్రప్రదేశ్)[2]
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ (విదేశాలు)[3]
విడుదల తేదీ
2012 ఆగస్టు 10 (2012-08-10)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్2 కోట్లు

కథసవరించు

1991 లో, ఒక ధనవంతుడైన గౌతమ్ (రాహుల్ రవీంద్రన్) మిథునను ( లావణ్య త్రిపాఠి) మొదటిసారి చూసి ఆమెతో ప్రేమలో పడతాడు.అయితే ఆమె ఒక ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటుంది. గౌతం ఆమెను కాపడటానికి అన్ని శస్త్రచికిత్సల కొరకు ఏర్పాటు చేస్తాడు, ఆమె తిరిగి తేరుకుంటుంది కానీ ఆమె స్పృహ పొందిన తరువాత సూర్య (నవీన్ చంద్ర) గురించి అడుగుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారని మనకి తెలుస్తుంది, కానీ మిథునకు సూర్య చనిపోయినట్లు చెబుతారు.ఇంతలో, గౌతం తన భావాలను వ్యక్తపరిచి, ఆమెను ఊటీకి తీసుకెళ్తాడు.తన ప్రేమను మిథునకు చూపించటానికి అతను చాలా ప్రయత్నాలు చేస్తాడు, కాని ఆమె సూర్యాని మర్చిపోలేదు.ఇద్దరూ తరచూ గొడవ పడుతుంటారు, ఒక రోజు మిథున కనిపించకుండా పోతుంది.మిథున ఇల్లు వదిలి, ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళిందని గౌతం భావిస్తాడు.అతను ఆమెను చంప మీద కొదతాడు కాని ఆమె తన ప్రేమను అంగీకరించినట్లు, అతనిని వివాహం చేసుకోవటానికి అంగికరించిదని తెలుసుకుంటాడు.అతను పెళ్లి కోసం ఏర్పాట్లు చేయడానికి హైదరాబాద్ వెళుతుండగా, అతను అకస్మాత్తుగా రోడ్డు మీద మిథున చిత్రలేఖనాన్ని చూస్తాడు. సూర్య పేరున్న పిచ్చివాడు దానిని గీసాడని ఒక బిచ్చగాడు అతడికి చెబుతాడు, గౌతం ఇది విన్నందుకు ఆశ్చర్యపోతాడు. సూర్య కర్మాగారానికి సమీపంలో ఉంటాడని అతడు చెబుతాడు. అతను కర్మాగారంలో వివిధ రంగుల గాజు సీసాలతో మిథున యొక్క ముఖాన్ని ప్రతిబింబం చుస్తాడు.సూర్య బ్రతికే ఉన్నట్లు వెల్లడవుతుంది, మిథున చనిపోయిందనే ఆలోచనతో అతనిలా మారాడని తెలుస్తుంది.

3 నెలల క్రితం, మిథున క్రిస్టియన్, ఒక సేవ సంస్థలో భాగంగా, ప్రజలకు పువ్వులు ఇస్తుంది.వారిలో ఒకరు సూర్య మొదటి చూపులో ఆమెతో ప్రేమలో పడతాడు .అతను ఈ సమయంలో ఆమెను అనుసరిస్తాడు, కానీ మిథున ఎప్పుడూ అతనిని దూరంగా ఉంచుతుంది. ఆమె తనను ఎప్పటికీ ఇష్టపడదు, ఆమె ఎప్పుదైతే అతడిని ఇష్టపదురుందో ఆ రోజు అతను చనిపొతాడు లేదా ఆమె చనిపోతుందని ఆమె అంటుంది.నెలల దాటిపోయిన తరువాత ఒకరోజునుంచి సూర్య మిథున వెంటపడటం మానెస్తాడు.ఆమె సుర్య ఇంటిని సందర్శించి, ఒక చిత్రకారుడని తెలుసుకుంటుంది, సూర్యని ప్రెమిస్తున్నానని చెబుతుంది.మిథునకు యక్సిడెంట్ అవుతుంది. అమే చికిత్స ఖర్చును ఆమె తల్లిదండ్రులు భరించలేకపొతారు.

గౌతమ్ తండ్రి తన కుమారుని వివాహం మిథునతో చెయలని వస్తాడు.మిథున తండ్రి ఆమెను విడిచిపెట్టమని సూర్యను కోరతాడు. ఆ భాధతో అనంతగిరి రహదారులపై లక్ష్యరహితంగా సూర్య తిరుగుతుంటాదు.నిజం తెలుసుకున్న తరువాత గౌతం మిథునకు సూర్య బ్రతికే ఉన్నాదని చెబుతాడు. దానితో ఆమె అతనిని పెళ్ళి చెసుకొవటానికి నిరాకరిస్తుంది.గౌతమ్ తండ్రి తన కుమారుని ప్రేమ కోసం సూర్యను చంపాలని నిర్ణయించుకుటాడు.ఈ విషయం తెలుసుకున్న గౌతం మీరు పంపించిన రౌడీల చేతుల్లో సూర్య బదులు నేను చనిపొతున్ననని తన తండ్రికి ఫొన్లో చెబుతాడు.గౌతమ్ మిథున కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు.తరువాత మిథున, సూర్యుడు ఒకరితో ఒకరు కలుస్తారు.గౌతమ్ ను మర్చిపోవటానికి మిథున సూర్యను అడిగినప్పుడు గౌతమ్ ప్రేమ సఫలమవుతుంది.కొంతకాలం తప్పిపోయిన గౌతమ్ తండ్రి, శ్మశానం వద్ద చనిపోయిన వ్యక్తి అని తరువాత తెలుస్తుంది.

తారాగణంసవరించు

పురస్కారాలుసవరించు

  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో ఉత్తమ కళా దర్శకుడు (ఎస్. రామకృష్ణ) విభాగంలో అవార్డు వచ్చింది.[4][5][6][7]

మూలాలుసవరించు

  1. "SS Rajamouli buys shares in 'Andala Rakshasi'". IBN. 26 July 2012. Archived from the original on 30 జూలై 2012. Retrieved 1 August 2012.
  2. "Andala Rakshasi sold out to Dil Raju". Indiaglitz. Retrieved 2 August 2012.
  3. "Andala Rakshasi: Overseas by 14 Reels Entertainment through Ficus". Idlebrain. Archived from the original on 8 ఆగస్టు 2012. Retrieved 6 August 2012.
  4. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
  5. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
  7. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.