రాహుల్ రవీంద్రన్

నటుడు,దర్శకుడు

రాహుల్ రవీంద్రన్ ఒక సినీ నటుడు. తమిళ, తెలుగు, ఇంగ్లీషు సినిమాల్లో నటించాడు. గాయని, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి ని వివాహం చేసుకున్నాడు.

రాహుల్ రవీంద్రన్
జననం (1981-06-23) 1981 జూన్ 23 (వయసు 41)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచిన్మయి
పిల్లలుదృప్త, శర్వాస్[1]
తల్లిదండ్రులురవీంద్రన్, వసుమతి రవీంద్రన్

వ్యక్తిగత జీవితంసవరించు

రాహుల్ చెన్నైలో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులు రవీంద్రన్, వసుమతి.[2] వీరి పూర్వీకులు తంజావూరు జిల్లాకి చెందినవారు. చెన్నై లోని విద్యామందిర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో చదివాడు. తర్వాత కామర్స్ లో డిగ్రీ చదివాడు. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ కోసం ముంబై వెళ్ళాడు. అక్కడే ఓ మీడియా సంస్థలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజరుగా పనిచేశాడు. ఇతనికి రోహిత్ రవీంద్రన్ అనే తమ్ముడు ఉన్నాడు. రోహిత్ వృత్తిరీత్యా ఒక ఫోటోగ్రాఫరు.

కెరీర్సవరించు

ముంబైలో ఉండగా ఇతన్ని ఓ రెస్టారెంటులో గమనించిన దర్శకుడి దివాకర్ బెనర్జీ ఇతన్ని ఓ ప్రకటనలో కనిపించమని అడిగాడు. అది విజయవంతం కాగానే మరిన్ని ప్రకటనల్లో అవకాశం వచ్చింది. ఇదే సమయంలో తమిళంలో ప్రసారమయ్యే కొన్ని పిల్లల టివి కార్యక్రమాల్లో గాత్రాన్ని అందించేవాడు.

తర్వాత ముంబైలో ఉద్యోగాన్ని వదిలేసి సహాయ దర్శకుడిగా పని చేసేందుకు చెన్నై వచ్చేశాడు.

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. A. B. P. Desam (22 June 2022). "కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  2. ఐబి టైమ్స్ వార్త