సాయి కొర్రపాటి ఒక సినీ నిర్మాత.[1] వారాహి చలనచిత్రం బ్యానరుపై సినిమాలు నిర్మిస్తుంటాడు. రాజమౌళి దర్శకత్వంలో మంచి విజయం సాధించిన ఈగ సినిమా నిర్మించింది ఈ సంస్థే. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నాడు. నిర్మాత కాక మునుపు ఈయన డిస్ట్రిబ్యూటరుగా ఉండేవాడు.

సాయి కొర్రపాటి
జననం
విద్యపదో తరగతి
వృత్తిసినీ నిర్మాత
జీవిత భాగస్వామిరజని
పిల్లలుసాయి శివాని

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి చెన్నైలో ఏ.ఎం.ఐ.ఈ చదివి ఒక వైపు వ్యవసాయం, మరో వైపు ఎరువుల వ్యాపారం చేసేవాడు. ఒకసారి తుఫాను దెబ్బకు వ్యవసాయం, వ్యాపారం రెండూ దెబ్బ తిన్నాయి. అప్పటికే ఆయన బళ్ళారిలో కొంత పొలం కొని ఉన్నాడు. దాంతో గుంటూరులో ఆస్తులు మొత్తం అమ్మేసి సాయికి ఐదారేళ్ళ వయసులో కుటుంబం కర్ణాటకలోని బళ్ళారికి వలస వెళ్ళింది. సాయి అక్కడే పెరిగాడు. సాయి పెద్దయిన తర్వాత హైదరాబాదుకు వచ్చి కాంట్రాక్టరు అయిన బాబాయి దగ్గర పనిచేసే వాడు. తర్వాత కొద్ది రోజులు గుంటూరులో వాళ్ళ మావయ్య దగ్గర పత్తి వ్యాపారం చూసుకునే వాడు. మరి కొద్ది రోజులు కోయంబత్తూరు వెళ్ళి అక్కడ కూడా పత్తి వ్యాపారం చేశాడు. అలా 30 కి పైగా వ్యాపారాలు చేశాడు. కానీ ఎక్కడా కలిసి రాలేదు. ఆయన భార్య పేరు రజని. కూతురు సాయి శివాని.

సినిమా రంగం మార్చు

సీతారామ రాజు, సుబ్బు, ఆది, ఒక్కడు లాంటి అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశాడు. బళ్ళారిలో ప్రారంభమై, తర్వాత కర్ణాటక, రాయలసీమకు కూడా డిస్ట్రిబ్యూటరుగా మారాడు. నిర్మాత గుణ్ణం గంగరాజుతో పరిచయం ఏర్పడి ఆయనతో కలిసి అమ్మ చెప్పింది అనే సినిమా నిర్మించాడు. కానీ ఆ సినిమా ఆర్థికంగా అంత విజయం సాధించలేదు. తరువాత కీరవాణి, రాజమౌళితో పరిచయం ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా అతనికి నిర్మాతగా మంచిపేరు తెచ్చింది. దాని తర్వాత లెజెండ్, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య లాంటి సినిమాలు నిర్మించాడు.

సినిమాలు మార్చు

  • ఈగ
  • లెజెండ్
  • ఊహలు గుసగుసలాడే
  • దిక్కులు చూడకు రామయ్యా

మూలాలు మార్చు

  1. "ఈనాడు ఆదివారం: ఈగ జీవితాన్ని మార్చింది". telugucinemacharitra.com. ఈనాడు. Retrieved 15 November 2016.