అక్కినేని అన్నపూర్ణ (ఆగస్టు 14, 1933 - నవంబరు 28, 2011) ప్రముఖ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య. ప్రముఖ నటుడైన అక్కినేని నాగార్జున యొక్క తల్లి.

అక్కినేని అన్నపూర్ణ
Akkineni annapurna.jpg
అక్కినేని అన్నపూర్ణ
జననంఅక్కినేని అన్నపూర్ణ
ఆగస్టు 14, 1933
దెందులూరు, పశ్చిమ గోదావరి జిల్లా
మరణంనవంబరు 28, 2011
హైదరాబాద్, తెలంగాణ
ప్రసిద్ధిఅక్కినేని నాగేశ్వరరావు గారి భార్య
మతంహిందూ
భార్య / భర్తఅక్కినేని నాగేశ్వరరావు
పిల్లలుఅక్కినేని నాగార్జున, వెంకట్
తండ్రికొల్లిపర వెంకటనారాయణ
తల్లినాగ భూషణమ్మ

జీవిత విశేషాలుసవరించు

అన్నపూర్ణ 1933, ఆగస్టు 14పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొర్లిపర వెంకటనారాయణ, నాగభూషణమ్మ దంపతులకు జన్మించారు. అక్కినేని గారితో కలిసి కీలుగుర్రం సినిమాలో హీరోయిన్ గా నటించారు. 1949 ఫిబ్రవరి 18న అక్కినేని నాగేశ్వరరావును వివాహం చేసుకున్నారు.[1] ప్రేమానురాగాలు పంచే ఆదర్శవంతుడైన భర్త. షూటింగ్ నుంచి వచ్చాక సాధారణ గృహస్థుగా మారిపోయే ఆయన అన్నపూర్ణతో ఎన్నో విషయాలు చర్చించేవారు. ఆమె చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించేవారు.ఆమె కోసం, పిల్లల కోసం, వారితో ఆనందంగా గడపడం కోసం విధిగా ఏడాదికి ఒక నెల రోజులు పూర్తిగా కేటాయించేవారు అక్కినేని. ఆమె పేరిట అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి అక్కడ షూటింగ్‌లు చేసుకోవడానికి ఫ్లోర్‌లు నిర్మించడమే కాకుండా, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లనూ నెలకొల్పారు. అదే పేరుతో బేనర్‌ను ఏర్పాటుచేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు అక్కినేని. వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించి, భోజనం పెట్టారు. వృద్ధాప్యం కారణంగా అన్నపూర్ణ ఆరోగ్యం దెబ్బతిన్నాక నాగేశ్వరరావు సినిమాలు తగ్గించుకున్నారు. అన్నపూర్ణతో గడిపేందుకు ఎక్కువ కాలం వెచ్చించేవారు. 'సకుటుంబ సపరివార సమేతం' (2000) సినిమా తర్వాత ఆమెను చూసుకోవడం కోసం ఆయన ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. సహధర్మచారిణి తనను విడిచి వెళ్లిపోయాక అన్నపూర్ణ స్టూడియోస్‌లో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అక్కినేని. స్టూడియోకు వచ్చిన వాళ్లందరినీ విగ్రహం రూపంలో అన్నపూర్ణ పలకరిస్తున్నట్లే ఉంటుంది.

అక్కినేని దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు జన్మించారు. వీరిలోఒక కుమార్తె మరణించారు. కుమారుల్లో నాగార్జున సినిమా హీరో కాగా, వెంకట్ సినీ నిర్మాత.

మరణంసవరించు

అన్నపూర్ణ 2011, నవంబరు 28 న మృతి చెందారు.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు