సకుటుంబ సపరివార సమేతం

సకుటుంబ సపరివార సమేతం ' 2000లో విడుదలైన తెలుగు చిత్రం. దీనిని విఎండి రెడ్డి, ఎం. మోహన్ గాంధీ రెడ్డి నిర్మించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు . ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, సీమా, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎస్.వి.కృష్ణారెడ్డి సంగీతం అందించాడు.[1]

సకుటుంబ సపరివార సమేతంగా
(2000 తెలుగు సినిమా)
Sssametham.jpg
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణం వి.ఎం.డి.రెడ్డి
మోహన్ గాంధీ రెడ్డి
కథ ఎస్. వి. కృష్ణారెడ్డి
చిత్రానువాదం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
మేకా శ్రీకాంత్,
సుహాసిని
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
సంభాషణలు సత్యమూర్తి
ఛాయాగ్రహణం శరత్
కూర్పు వి. నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ సాయి చరణ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

వంశీ (శ్రీకాంత్) మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి. అతడి కుటుంబంలో ఎవరూ సరైన వాళ్ళు కాదు - తాగుబోతు తండ్రి (కోట శ్రీనివాసరావు), గయ్యాళి తల్లి (వై.జయ), జూదరి అన్నయ్య (మహర్షి రాఘవ), స్వార్థపూరితమైన అక్క ( రజిత ), సోమరి బావ (బ్రహ్మానందం). ఆ ఇంట్లో వంశీపై ప్రేమ చూపించే ఏకైక వ్యక్తి అతని వదిన వాణి (సుహాసిని). అతడామెను తల్లిగా గౌరవిస్తాడు. ఈ కుటుంబ సభ్యులను చూసి ఏవగించుకునే వంశీ, పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ వాసంతి (సీమా) తో పరిచయమై, ఆమెతో ప్రేమలో పడతాడు. వాసంతి తమ పెళ్ళికి తన తాత జానకి రామయ్య (అక్కినేని నాగేశ్వరరావు) నుండి అనుమతి పొందమని అతణ్ణి కోరుతుంది. వెంటనే, వంశీ తన సన్నిహితుడు రవి (రవితేజ) తో కలిసి జానకి రామయ్య వద్దకు వెళ్లి పరిస్థితిని వివరిస్తాడు.

అక్కడ, జానకి రామయ్య గతాన్ని వెల్లడించడం ప్రారంభిస్తాడు. తన కుమార్తె (ప్రియా) కు చేసిన పెళ్ళి, వారు ఆమెను హింసించటం ఆమె మరణించడం చెబుతాడు. అందువల్ల వాసంతిని ఆదర్శ కుటుంబంలోకి పంపాలని జానకి రామయ్య నిర్ణయించుకుంటాడు. అది తెలుసుకున్న రవి తన స్నేహితుడి ప్రేమను విజయవంతం చేయడానికి వంశీ కుటుంబాన్ని మంచి కుటుంబంగా చిత్రీకరిస్తాఅడు. ప్రస్తుతం, జానకి రామయ్య వారిని అధ్యయనం చేయడానికి తాను ఒక నెల పాటు కుటుంబంతో కలిసి ఉంటాననే షరతు పెడతాడు. వంశీ తన కుటుంబ సభ్యులను డబ్బు ఆశ చూపి, 1 నెలపాటు నిజమైన ప్రేమ ఉన్నట్లుగా వ్యవహరించడానికి ఏర్పాట్లు చేస్తాడు. జానకి రామయ్య వస్తాడు. ఆ కాలంలో వారి మధ్య ప్రేమ, ఆప్యాయతలు వికసిస్తాయి. చివరకు, జానకి రామయ్య అనుమతి ఇచ్చి వివాహ ఏర్పాట్లు చేస్తాడు. కానీ వంశీ ఈ ద్రోహం చెయ్యడానికి మనసొప్పుకోదు. దాంతో తాను వాగ్దానం చేసిన మొత్తాన్ని తన కుటుంబ సభ్యులకు ఇచ్చేసి, జానకి రామయ్యను కలిసి అసలు సత్యాన్ని వెల్లడిస్తాడు. ఆశ్చర్యకరంగా, జానకి రామయ్య తాను ప్రారంభంలోనే దానిని గ్రహించానని ప్రకటిస్తాడు. కాని వాణీ అభ్యర్థన మేరకు తాను ఆ కుటుంబాన్ని సంస్కరించడానికి అక్కడే ఉండిపోయానని చెబుతాడు. చివరికి, వంశీ కుటుంబ సభ్యులు కూడా తమ పనులకు పశ్చాత్తాపపడి, వంశీని అంగీకరించమని వేడుకుంటారు. చివరగా, ఈ చిత్రం వంశీ, వాసంతిల పెళ్ళితో ముగుస్తుంది.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."పుట్టింటి తులసిగా"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:21
2."లవ్ ఈజ్ ది ఫీలింగ్"హరిహరన్, హరిణి4:32
3."పచ్చి వెన్న తెచ్చి"ఉదిత్ నారాయణ్, మహాలక్ష్మి అయ్యర్4:47
4."ఒళ్ళంత తుళ్ళింత"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:12
5."మనసంత మనసుపడి"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:55
6."మనసును కానుక చేసి"సుధారాణి1:00
7."అందచందాల చందమామ"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర5:39
Total length:25:47

మూలాలుసవరించు

  1. "Sakutumba Saparivaara Sametam Trailers, Videos - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-17. Retrieved 2020-08-17.