అక్షా పార్ధసాని
అక్షా పార్ధసాని భారతీయ సినిమా నటి. ఆమె యువత, రైడ్, కందిరీగ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబైలో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంది. తెలుగు, మళయాల, తమిళ సినిమాలలో నటించిన అక్షా తొలిసారిగా 2007లో మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో నటించింది.
అక్షా పార్ధసాని | |
---|---|
జననం | నవంబర్ 8, 1991 |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2007–ప్రస్తుతం |
అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి. 5వ తరగతి చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేయడం ప్రారంభించి, సుమారు 75 ప్రకటనలలో నటించింది. మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో అక్షను చూసిన యువత సినిమా దర్శకుడు తన సినిమాలో తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. 10వ తరగతి సమయంలోనే గోల్ సినిమా పూర్తయింది. బ్యాంగిల్స్ అనే మలయాళ చిత్రంలో ప్రత్యేక పాటలో కనిపించింది.
రెండు సంవత్సరాల విరామం తరువాత బెంగాల్ టైగర్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.
సినీసమహారం
మార్చుసంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2004 | ముసఫిర్ | యంగ్ సం | హందీ | |
2007 | గోల్ | నీతు | మళయాలం | |
2008 | యువత | విశాలాక్షి | తెలుగు | |
2009 | రైడ్ | పూజా | తెలుగు | |
2010 | అది నువ్వే | సమీర | తెలుగు | |
2011 | కందిరీగ | సంధ్య | తెలుగు | |
2013 | శత్రువు | అనుషా | తెలుగు | |
రెయ్ రెయ్ | లక్ష్మీ | తెలుగు | ||
బ్యాంగిల్స్ | మళయాలం | |||
2014 | సలీం\ డా. సలీమ్ (తెలుగు) | నిషా | తమిళం | డా. సలీం (తెలుగు) |
రాంలీల | హందీ | అతిథి పాత్ర | ||
2015 | మెంటల్ | తెలుగు | ||
బెంగాల్ టైగర్ | తెలుగు | అతిథి పాత్ర | ||
డిక్టేటర్[1] | తెలుగు | |||
2017 | రాధ | రుక్మిణి (రుక్కు) | తెలుగు |
మూలాలు
మార్చు- ↑ సినీఫ్యాక్టరీ, సినిమా వార్తలు. "నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!". www.cinefactory.net. Archived from the original on 19 జనవరి 2016. Retrieved 20 September 2016.