అజిత్ శర్మ
అజిత్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన భారతీయ రాజకీయవేత్తగా మారిన వ్యాపారవేత్త. ఆయన బీహార్ శాసన సభ సభ్యుడు.[1] ఆయన 2014, 2015, 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో భాగల్పూర్ విధానసభ నియోజకవర్గం నుండి గెలిచాడు. ఆయన బీహార్ శాసనసభలో ప్రస్తుత కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు.[2][3]
అజిత్ శర్మ | |
---|---|
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ | |
Assumed office 2014 | |
నియోజకవర్గం | భాగల్పూర్ విధాన సభ నియోజకవర్గం, భాగల్పూర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1954 (age 69–70) భాగల్పూర్, బీహార్, భారతదేశం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సంతానం | నేహా శర్మ (కుమార్తె) ఆయిషా శర్మ (కుమార్తె) |
నివాసం | బిహార్ |
వృత్తి | రాజకీయనాయకుడు |
వ్యక్తిగత జీవితం
మార్చుఆయన కుమార్తెలు నేహా శర్మ, ఆయిషా శర్మ భారతీయ నటీమణులుగా వెలుగుతున్నారు. నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుత(2007)లో రాం చరణ్ సరసన నటించింది. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. కాగా ఆయిషా శర్మ మొదట ఆయుష్మాన్ ఖురానా ఐక్ వారి (Ik Vaari) మ్యూజిక్ వీడియోలో నటించింది.[4] ఆ తర్వాత ఆమె హిందీ యాక్షన్ థ్రిల్లర్ సత్యమేవ జయతే (2018)లో జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పాయ్‌లతో కలిసి నటించింది.[5][6] ఈ సోదరీమణులిద్దరూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు.
మూలాలు
మార్చు- ↑ "Ajit Sharma (Indian National Congress): Constituency - Bhagalpur - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2022-09-21.
- ↑ "Ajeet Sharma Appointed Congress Legislative Party Leader In Bihar". NDTV.com. 2020-11-13. Retrieved 2021-10-12.
- ↑ Nezami, Sheezan (November 14, 2020). "Bihar: Ajit Sharma made Congress legislature party leader". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-12.
- ↑ "Watch: 'Ik Vaari' song featuring Ayushmann Khurrana and Aisha Sharma has an unexpected twist!". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-27.
- ↑ "'Satyamev Jayate': Debutante Aisha Sharma probably didn't seek John Abraham's help to prep for her role - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-27.
- ↑ "Satyameva Jayate actress Aisha Sharma on her character Shikha: Not just a pretty face; she's a social crusader-Entertainment News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2018-08-14. Retrieved 2022-09-27.