Atazanavir, అటాజనవిర్ (methyl N-[ (1S) -1-{[ (2S,3S) -3-hydroxy-4-[ (2S) -2-[ (methoxycarbonyl) amino]-3,3-dimethyl-N'-{[4- (pyridin-2-yl) phenyl]methyl}butanehydrazido]-1-phenylbutan-2-yl]carbamoyl}-2,2-dimethylpropyl]carbamate, ATV, brand name Reyataz®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు ATV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 20-Jun-2003 [1] రోజున అమోదించబడింది. ఇది Bristol-Myers Squibb అనే సంస్థచే కనుగొనబడింది.

మోతాదు ( Dosage )

మార్చు
ఎయిడ్స్
 
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్

ఇంతకు ముందు ఎలాంటి HIV మందులు వాడని వాళ్ళు ఈ మందుతొ గనక ప్రారంబించాలనుకుంటే ప్రతి రోజు 300 Mg ఒక్కసారి మాత్రమే వేసుకొవాలి. అలాగే దీనితో పాటుగా రిటనోవిర్ను తప్పకుండా వేసుకొవాలి.ఒక వేళ రిటనోవిర్ దుష్ప్రబావాలు ఎక్కువ గనక వుంటే ఏ పరిస్థితుల్లో గనక రిటనోవిర్ దొరకకపోతె, ఈ మందును 200Mg చొప్పున రోజుకు రెండుసార్లు వాడాలి.

ఈ మందును అరు సంవత్సరాలు పై బడిన పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. ఈ మందును తిన్న తర్వాత మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.

దుష్ప్రబావాలు (Side Effects )

మార్చు

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. కిడ్ని సమస్యలు: ఈ మందు వల్ల కిడ్ని సమస్యలు వచ్చేప్రమాదం ఉంది. మూత్రంలో రాళ్లను ఇండినవిర్ ఏర్పరుస్తుంది దీనితో కిడ్నిలో రాళ్ళు ఏర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటే ఎక్కువ పరిమాణంలో నిళ్ళను త్రాగాలి. రోజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
  2. చర్మం పైన దుద్దుర్లు సాధారణంగా ఈ మందు వాడే వారిలో కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం, నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెండ్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి, కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
  3. Atazanavirరక్తంలో bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చేప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులోనికి మారటం దీని ప్రదాన లక్షణం.
  4. Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక భాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే Protease Inhibitor లను వాడే వారిలో డయాబెటిస్ (మధుమేహం) వచ్చేఅవకాశం ఉంది.
  5. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, కాళ్ళు చేతులు మొద్దుబారటం అలాగే జలదరించడం

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?

మార్చు

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటే. అలాగెమధుమేహం ఉండివుంటే ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది. అరు సంవత్సరాల కంటే చిన్న పిల్లల పైన ఇది ఎలా పనిచేస్తుందొ ఇంకా తెలియదు

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?

మార్చు

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటే గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-10.
  2. http://www.aidsmeds.com/archive/Reyataz_1563.shtml

'