ఇండినవిర్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
Indinavir, ఇండినవిర్ ( (2S) -1-[ (2S, 4R) -4-benzyl-2-hydroxy-4-{[ (1S, 2R) -2-hydroxy-2, 3-dihydro-1H-inden-1-yl]carbamoyl}butyl]-N-tert-butyl-4- (pyridin-3-ylmethyl) piperazine-2-carboxamide, IDV, brand name Crixivan®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము. దీనికి IDV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 13-Mar-1996 [1] రోజున అమోదించబడింది. ఇది Merck అనే సంస్థచే కనుగొనబడింది.
మోతాదు ( Dosage )
మార్చుఎయిడ్స్ | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
Indinavir టాబ్లెట్లను రోజుకు రెండు సార్లు లేదా మూడు సార్లు వేసుకొవాలి..ఇండినవిర్ చాలా త్వరగా తన ప్రభావాన్ని కొల్పొతుంది కాబట్టి డొసెజ్ మరచి పోకుండ వేసుకొవాలి
ఒకవేళ మూడు సార్లు రోజుకు వేసుకుంటే డొసెజ్ ఇలా ఉండాలి.
400 Mg ప్రతి 8 గంటల తర్వాత.
ఒకవేళ రోజుకు రెండు సార్లు వేసుకుంటే డొసెజ్ ఇలా ఉండాలి.
400 Mg ప్రతి 12 గంటల తర్వాత కాని మీరు రెండు సార్లు వేసుకుంటే తప్పనిసరిగా ఇదే తరగతికి చెందిన ఇంకొ మందును వాడాలి. రిటనొవిర్ వెసుకుంటే రక్తంలో ఇందినవిర్ మోతాదును పెంచుతుంది కాబట్టి రెండుసార్ల డొసెజ్‌కు ఈ మందును ఎంచుకొవటం మంచిది.
ఈ మందును పిల్లలకు కూడా ఇవ్వవచ్చును. ఈ మందును తినకముందు మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
దుష్ప్రబావాలు (Side Effects )
మార్చుఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
- కిడ్ని సమస్యలు: 40% మందికి ఈ కిడ్ని సమస్యలు వచ్చేప్రమాదం ఉంది. మూత్రంలో రాళ్లను ఇండినవిర్ ఏర్పరుస్తుంది దీనితో కిడ్నిలో రాళ్ళు ఏర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలో నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటే ఎక్కువ పరిమాణంలో నిళ్ళను త్రాగాలి. రోజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
- చర్మం పైన దుద్దుర్లు సాధారణంగా ఈ మందు వాడే వారిలో కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం, నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెండ్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి, కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
- Indinavir రక్తంలో Creatinine పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల అంతగా ప్రమాదం ఉండదు.
- Indinavir రక్తంలో bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చేప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులోనికి మారటం దీని ప్రదాన లక్షణం.
- Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక భాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే Protease Inhibitor లను వాడే వారిలో డయాబెటిస్ (మధుమేహం) వచ్చేఅవకాశం ఉంది.
ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?
మార్చుఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటే. ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది
గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?
మార్చుఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి Cగా వర్గీకరించబడ్డది. అంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటే గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. గర్భవతి మహిళలు Indinavirతో పాటుగా ritonovirను వెసుకొవాలి. ఎందుకంటే గర్భవతి మహిళల్లో ఈ మందు ప్రభావం తక్కువగా వుంటుంది
అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-09.
- ↑ http://www.aidsmeds.com/archive/Crixivan_1557.shtml