Ritonavir, రిటనోవిర్ (1,3-thiazol-5-ylmethyl N-[ (2S,3S,5S) -3-hydroxy-5-[ (2S) -3-methyl-2-{[methyl ({[2- (propan-2-yl) -1,3-thiazol-4-yl]methyl}) carbamoyl]amino}butanamido]-1,6-diphenylhexan-2-yl]carbamate, RTV, brand name Norvir®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు RTV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 01-Mar-1996[1] రోజున అమోదించబడింది. ఇది Abbott Laboratories అనే సంస్థచే కనుగొనబడింది.

Ritonavir.svg.png

మోతాదు ( Dosage )సవరించు

ఎయిడ్స్
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్
పెద్దలకు 600Mg రెండు సార్లు ప్రతిరోజు లేదా దుష్ప్రబావాలు ఎక్కువగా వుంటే 300Mg ప్రతిరోజు రెండు సార్లు. 

ఈ మందును పిల్లలకు వారి బరువును బట్టి డొసేజ్ ఇవ్వవచ్చును. ఈ మందును తిన్న తర్వాత వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.

దుష్ప్రబావాలు (Side Effects )సవరించు

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. Protease Inhibitor తరగతికి చెందిన ప్రతి మందు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. దీనివల్ల చాతి బాగంలో, మెడ వెనక భాగంలో గొపురంలా కొవ్వు ముందుకు రావచ్చు, అలాగే మోహం పైన చర్మం కుంచించుకుపొవచ్చు. రక్తంలో కొవ్వు శాతం పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అలాగే Protease Inhibitor లను వాడే వారిలో డయాబెటిస్ (మధుమేహం) వచ్చే అవకాశం ఉంది.
  2. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం, నోటి ప్రాంతంలో మొద్దుబారటం అలాగే జలదరించడం

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?సవరించు

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు లివర్, కిడ్ని సమస్యలు ముందు ఉండివుంటే. గుండె సంబందిత సమస్యలు వుండి వుంటే, ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది.

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?సవరించు

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటే గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-10.
  2. http://www.aidsmeds.com/archive/Norvir_1561.shtml
"https://te.wikipedia.org/w/index.php?title=రిటనోవిర్&oldid=2996113" నుండి వెలికితీశారు