నెవిరపిన్
నెవిరపైన్ ( 11-cyclopropyl-4-methyl-5,11-dihydro-6H- dipyrido[3,2-b:2′,3′-e][1,4]diazepin-6-one, NVP, brand name Viramune®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించె non-nucleoside reverse transcriptase inhibitor (NNRTI) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు NVP పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV, 21-Jun-1996[1] రోజున అమోదించబడింది.ఇది Boehringer Ingelheim Pharmaceuticals, Inc అనె సంస్థచే కనుగొనబడింది.
మోతాదు ( Dosage )
మార్చుఎయిడ్స్ | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
Nevirapine టాబ్లెట్లను మొదటి పదిహెను రోజులు రోజుకు ఉదయం కాని సాయంత్రం 200 mg ఒక్కసారే తీసుకోవాల్సి వుంటుంది.ఆ తర్వాత ఎలాంటి దుష్ప్రబావాలు లేకపోతె ఉదయం, సాయంత్రం 200Mg రెండుసార్లు తీసుకొవాలి. ఈ మందును పిల్లలు కూడా వారి బరువును బట్టి తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో NRTI కి చెందిన కనీసం రెండు మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది. .మహిళలు వారి CD4 >250, అలాగే మగవాళ్ళు వారి CD4>400 గా ఉన్నప్పుడు ఈ మందును వేసుకొక పోవటం ఉత్తమం.
దుష్ప్రబావాలు (Side Effects )
మార్చుఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
- కాలేయ సమస్యలు: ఈ మందు వెసుకొనె వారిలో ప్రాణాంతకమైన కాలెయ సమస్యలు మొదటి ఆరు వారల్లో రావచ్చు. మహిళల్లో ముఖ్యంగా ఇది ఎక్కువ. మీ డాక్టరు ఎప్పటికప్పుడు మీ లివర్ ఎంజైములను (LFT's) టెస్ట్ చెస్తు మీ లివరు యొక్క పనితనాన్ని పరీక్షించవచ్చు. అలసట అకలి లేకపొవటం. కళ్ళు, చర్మం పసుపు రంగులోనికి మారటం, తెల్లటి విరేచనాలు అయితే వెంబడె డాక్టరును సంప్రందించండి.
- చర్మం పైన దుద్దుర్లు సాధారణంగా ఈ మందు వాడె వారిలో కనిపిస్తుంది. కొన్ని సార్లు ఇది ప్రమాదకరంగా మారుతుంది, మరణం కూడా సంబవిచ్చవచ్చు. ఈ దుద్దుర్లు జ్యరం, నోతిపూత, కండరాలనొప్పితొ పాటు రావచ్చును. మొహం పైన వాపు కూడా రావచ్చును.
- ఈ మందును పై దుష్ప్రబావాల వల్ల ఒకసారి అపివేసి వుంటె తిరిగి రెండవసారి ప్రారంబించటం కుదరదు.
ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?
మార్చుఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్ సమస్యలు ఇంతకు ముందు వచ్చివుంటె, ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది. ఈ మందును దుష్ప్రబావాల వల్ల ఒకసారి అపివేసి వుంటె తిరిగి వెసుకోకూడదు.
గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?
మార్చుఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి B గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండానికి హాని చేకురుస్తుంది . కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకునెముందు డాక్టరుతొ చర్చించడం ఉత్తమం అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు వుంటుంది కాబట్టి HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-08.
- ↑ http://www.aidsmeds.com/archive/Viramune_1616.shtml