Stavudine స్టావిడైన్ (2'-3'-didehydro-2'-3'-dideoxythymidine, d4T, brand name Zerit®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు d4t పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 24-Jun-1994 రోజున అమోదించబడినది[1]. దీర్ఘకాలం దీనిని ఉపయోగించటంలో వున్న సమస్యలు, తిరిగి నయం చేయలేని దుష్ప్రబావాలు (irreversible sideeffects) ఉన్నందువల్ల దీనిని WHO సంస్థ 30 November 2009 రోజున HIV చికిత్సకు ఉపయోగించరాదని హెచ్చరించడమైనది. కాని ఇది విరివిరివిగా, అత్యంత చౌకగా లభ్యం అవటంవల్ల అప్రికా, ఆసియా దేశాలు దినిని ఇంకా ఉపయోగిస్తున్నాయి

దస్త్రం:180px-Stavudin.svg.png

. ఈ మందును 2012 సంవత్సరంలో మన నెషనల్ ఎయిడ్స్ కంట్రొల్ కూడా వాడకూడదని నిర్ణయించింది. కొత్తగా ఎ రొగికి ఈ మందును ఇవ్వకూడదు అలాగే వాడుతున్న రోగులను వెరే (NRTIs) అనే తరగతికి చెందిన ఎదెని వెరొక ఔషదముకు మార్చవలసిందిగా అన్ని ART సెంటర్లను అదేశించడం జరిగింది.

ఒక విదంగా చెప్పాలంటే ఎయిడ్స్ ఎంత ప్రమాదకారొ, ఎ రోగి అయినా దీని దుష్ప్రబావాలు భారిన పడితే ఈ ఔషధం కూడా అంతే ప్రమాదకారి

మోతాదు ( Dosage )

మార్చు
ఎయిడ్స్
 
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్

Stavudine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది. మీ శరీర బరువును బట్టి డొసెజ్ మారిపోతుంది. WHO ఆదేశాల ప్రకారం మీ బరువు 60Kg లకంటే ఎక్కువగా వుంటే 30 mg తీసుకొవాలి (ఒకప్పుడు 40 mg గా వుండేది). అంతకంటే తక్కువ బరువు వుంటే లేదా దుష్ప్రబావాలు (Side Effects ) ఎక్కువగా వుంటే మోతాదు సర్దుబాటు ( Dosage Adjustment )15 mg, 20 mg కుగాని చెసుకొనవలసివుంటుంది. ఈ మందును పిల్లలు కూడా తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయడం మంచిది.

దుష్ప్రబావాలు (Side Effects )

మార్చు

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. Pheripheral Neauropathy (నరాల బలహీనత) : Stavudine వల్ల వచ్చే దుష్ప్రబావాలలో ఇది మొదటిది. కాళ్ళు మొద్దుబారటం ( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలో మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలో కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసే ఇదే తరగతికి చెందిన (NRTIs) Zidovudine నుకాని TDF (Tenofovir) టెనొఫవిర్ ను కాని వాడితే Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగే వాడితే నొప్పులు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఈ మందును మార్చడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు.
  2. Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటే ఎక్కువ అవుతుంది (సాధారణంగా 0.50-2.20 mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడే రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
  3. Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ప్రదానంగా Stavudine వల్ల ఈ సమస్య మరి ఎక్కువ. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తే వెంబడే మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి
  4. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లో మాయమవుతాయి.

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?

మార్చు

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటే, ఇంతకు ముందు క్లొమ గ్రంథి లోపం వచ్చివుంటే, అనిమియా వచ్చివుంటే, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటే Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటే, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?

మార్చు

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటే దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటే గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-08.
  2. "Zerit HIV Medication". POZ (in ఇంగ్లీష్). Retrieved 2023-01-29.