అడిగొప్పుల

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, దుర్గి మండలంలోని గ్రామం

అడిగొప్పుల, పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన దుర్గి నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మాచర్ల నుండి 19 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2280 ఇళ్లతో, 8816 జనాభాతో 3349 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4424, ఆడవారి సంఖ్య 4392. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1061 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 381. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589827[1].ఈ గ్రామం పలనాడు ప్రాంతంలో ఉంది. ఈ గ్రామం మాచర్లకు 21 కి.మీ దూరంలో, కారంపూడికి 12 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామం మాచర్ల నియోజకవర్గంలో ఉంది.

అడిగొప్పుల
—  రెవెన్యూ గ్రామం  —
అడిగొప్పుల is located in Andhra Pradesh
అడిగొప్పుల
అడిగొప్పుల
అక్షాంశరేఖాంశాలు: 16°26′17″N 79°37′24″E / 16.438021°N 79.623414°E / 16.438021; 79.623414
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దుర్గి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ వలపా చినరాములు
జనాభా (2011)
 - మొత్తం 8,816
 - పురుషులు 4,424
 - స్త్రీలు 4,392
 - గృహాల సంఖ్య 2,280
పిన్ కోడ్ 522612
ఎస్.టి.డి కోడ్ 08642

సమీప గ్రామాలు మార్చు

నిదానంపాడు 5 కి.మీ, ఓబులేశునిపల్లి 7 కి.మీ, ధర్మవరం 8 కి.మీ, నర్మలపాడు 2 కి.మీ, మిరియాల 5 కి.మీ, మాడుగుల 8 కి.మీ, రామాపురం 6 కి.మీ.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి మాచర్లలో ఉంది. సమీప జూనియర్ కళాశాల దుర్గిలోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు అలుగురాజుపల్లిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

అడిగొప్పులలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో 2 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. ఇద్దరు డిగ్రీ లేని డాక్టర్లు ఉన్నారు.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

అడిగొప్పులలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది.పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్ ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

అడిగొప్పులలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 338 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 419 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 648 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 526 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 324 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 388 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 368 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 338 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 706 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

అడిగొప్పులలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • కాలువలు: 10 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 696 హెక్టార్లు

తయారీ మార్చు

అడిగొప్పులలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి (అవరోహణ క్రమంలో) :

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

ప్రత్తి, మిరప, కంది

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

విద్యుత్తు ఉపకేంద్రo మార్చు

అడిగొప్పుల గ్రామంలో, గుట్టమీద సెంటరు సమీపంలో, కారంపూడి వెళ్ళే దారిలో, ఒక ఎకరం పోరంబోకు భూమిలో, ఒకటిన్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రం నిర్మాణం పూర్తి అయినది. ఈ కేంద్రం వలన, అడిగొప్పుల గ్రామంతోపాటు, చుట్టుప్రక్క గ్రామాలయిన ధర్మవరం, ఓబులేశునిపల్లె, రాజానగర్, నిదానంపాడు గ్రామాలలో గూడా, లో వోల్టేజ్ సమస్య తీరిపోగలదు. ఈ కేంద్రం 2015, ఏప్రిల్-17వ తేదీనాడు ప్రారంభించారు. [8]

  • ఎస్.సి.కాలనీలోని కమ్యూనిటీ హాలు.
  • గ్రామంలో సి.సి.రహదారులు ఏర్పరచుకున్నారు.

త్రాగునీటి సౌకర్యం మార్చు

గ్రామంలో 32 ఎకరాలలో విస్తరించియున్న మంచినీటి చెరువులో, 3 సంవత్సరాల క్రితం, నెదర్లాండ్స్ దేశ సహకారంతో ఒక త్రాగునీటి పథకాన్ని ఏర్పాటుచేసారు. కానీ ఒక సంవత్సరం పనిచేసిన ఈ పథకం తరువాత మూలనపడినది. అందువలన గ్రామస్థులు వేసవిలో త్రాగునీటికి పలు కష్టాలు పడినారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో పూడికతీత పనులకు 3 లక్షల రూపాయలు మంజూరుకాగా, ఆ నిధులతో పూడికతీత పనులు నిర్వహించారు. రైతులు సారవంతమైన ఈ పూడికమట్టిని ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకొని పోయినారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటినిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలలకు ఎరువుల ఖర్చు గూడా గణనీయంగా తగ్గినదని రైతులు సంతోషం వ్యక్తం చేసారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ కుడికాలువనుండి ఈ చెరువును, మోటార్లతో నీటిని నింపగా చెరువులో జలకళ సంతరించుకున్నది. [12]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

ఈ గ్రామం సమీపం నుండియే నాగార్జునసాగర్ కుడికాలువ ప్రవహించుచుండటంతో, ఎవరికి వారు వ్యవసాయం చేసుకుంటూ, ఐకమత్యంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. [4]

గ్రామ పంచాయతీ మార్చు

  1. ఈ గ్రామం నియోజకవర్గంలోనే అతిపెద్దది.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, వలపా చినరాములమ్మ, సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం మార్చు

దేవస్థానం

ఈ గ్రామం సమీపంలో ఉన్న నిదానంపాటి అమ్మవారి క్షేత్రం నల్లమల అటవి ప్రాంతానికి సమీపాన ఉంది. ఈ క్షేత్రానికి సుమారు 700 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాలుణమాసంలో ఉగాదికి రెండు వారాల ముందు, తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ తిరుణాళ్ళకు జిల్లా నుండియేగాక, రెండు తెలుగు రాష్ట్రాలలోని 10 జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. ఆరోజు ఆదివారం అమ్మవారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు, కుంకుమపూజలు నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళకు చుట్టుప్రక్కల గ్రామాలనుండి రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన భజనాభాండ్లు (కుంకుమబండ్లు) తీసికొని వచ్చెదరు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. వేలమంది మహిళలు అమ్మవారి సన్నిధిలో పొంగళ్ళు తయార్చేసి అమ్మవారికి నివేదించెదరు. వచ్చిన ప్రతివారూ మొక్కుబడులు చెల్లించుకొనడం ఆనవాయితీ. ఈ తిరునాళ్ళకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం, మాచెర్ల, వినుకొండ, పిడుగురాళ్ళ, డిపోల నుండి, ఆర్.టి.సి. వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసెదరు. 2017, మార్చి-19వతెదీ ఆదివారం నుండి నిర్వహించు అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవం నుండి, ప్రతి సంవత్సరం, ప్రతి భక్తునికీ, అమ్మవారి ప్రసాదం ఉచితంగా పంచిపెట్టుటకు ఆలయ యాజమాన్యం ప్రకటించింది. జాతర రోజున అమ్మవారి సన్నిధికి వచ్చు వేలాదిమంది భక్తులకు, ఆలయ సమీపంలో ఉన్న సత్రంలో, శ్రీ లక్ష్మీఅమ్మవారి సేవాసమితి వారు, పలువురు భక్తుల, దాతక్ల సహకారంతో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించెదరు. ఈ అమ్మవారి వంశానికి చెందినవారు యాగంటి వంశస్థులు. ప్రస్తుతం ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ యాగంటి వెంకటేశ్వర్లు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మార్చు

ఈ గ్రామంలో 2014, మే-30 శుక్రవారం నాడు, బొడ్రాయి, శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతోపాటు, పలు దేవతామూర్తుల ప్రతిష్ఠా వార్షికోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయానికి 12 ఎకరాల మాన్యం భూమి ఉంది.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం మార్చు

ఈ గ్రామంలో, 20 లక్షల రూపాయల గ్రామస్థుల, పలువురి దాతల సహకారంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంతోపాటు, ఆలయ ధ్వజస్తంభం, విమాన శిఖరం, బలిపీఠం ప్రతిష్ఠాపన మహోత్సవాలు 2015, జూన్-6వ తేదీ శనివారం ఉదయం నిర్వహించారు. పలువురు ఋత్విక్కులు వేదమంత్రాలనడుమ, ఉదయం 7-30 కి నిత్యపూజ, 8 గంటలకు గర్తపూజ, 8-20కి రత్నన్యాసం, 8-46 గంటలకు యంత్రస్థాపన, తదుపరి శ్రీ సీతారామాంద్రస్వామితోపాటు, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి, జీవధవజస్తంభం, విమానశిఖరం, బలిపీఠం లను ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలనుండి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో అన్నదానం నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. [9]

శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం మార్చు

అడిగొప్పుల గ్రామ శివారులో, సాగరు కుడికాలువ సమీపంలో, మేదరవారికుంట సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని, గ్రామానికి చెందిన మేదరసంఘంవారు, 8 లక్షల రూపాయలతో నూతనంగా పునర్నిర్మించారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-12వ తేదీ శుక్రవారం ఉదయం 9-20 గంటలకు, పలువురు ఋత్విక్కుల వేదమంత్రాల నడుమ, ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నదానం నివహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు ఈ గ్రామం నుండియేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా, అధికసంఖ్యలో విచ్చేసారు. [10]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం మార్చు

ఈ ఆలయం, అడిగొప్పల గ్రామంలోని గుట్టమీద కూడలిలో ఉంది. ఈ ఆలయానికి 30 ఎకరాల మాన్యంభూమి ఉంది.

శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామివారి ఆలయం మార్చు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం మార్చు

శ్రీతలాదేవి (బొడ్డు రాయి) మార్చు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు మార్చు

ఒక్కపుడు ఈ గ్రామం మవోయిస్టులతో మారుమ్రోగేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. పిల్లలను ఉన్నత ఉద్యోగాల కోసం కష్టపడి చదివించుచూ పట్టణాలకు పంపించుచున్నారు. గ్రామంలోని పలువురు యువకులు రాష్ట్రంలోనేగాక, ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలో గూడా కొలువులు చేపట్టినారు. గ్రామంలోని కొందరు యువకులు, గ్రామాభివృద్ధిని కాంక్షించి, అన్ని కులాలవారితోనూ కలిసి, ఒక గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పరచుకొని, గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టుచున్నారు.

ఈ గ్రామానికి చెందిన కోండ్రు శాంతి అను విద్యార్థిని, చిలకలూరిపేటలోని ఎ.ఎం.జి. జూనియర్ కళాశాలలో చదువుచున్నది. ఈమె ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్ క్యారంస్ ఛాంపియన్ షిప్ పోటీలలో, టీం ఛాపియన్ షిప్ విభాగంలో స్వర్ణపతకం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించింది.

గణాంకాలు మార్చు

2013 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 17250. పురుషుల సంఖ్య 9226, మహిళలు 8024, నివాసగృహాలు 4312, విస్తీర్ణం 5349 హెక్టారులు, సాగు భూమి 6,000 ఎకరాలు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".