అనసూయ కులకర్ణి ప్రముఖ సంగీత విద్వాంసురాలు, తెలుగు సినిమా నేపథ్య గాయని. లలిత కళల పట్ల మక్కువ చూపనివారుండరు. ఆకర్షణగా మొదలైన ఆసక్తిని అభ్యాసం ద్వారా అవలోకన చేసుకుని అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు అనసూయా కులకర్ణి . అంతటితో ఆగక వివిధ దేశాల్లో విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.

అనసూయ కులకర్ణి

చలన చిత్ర ప్రవేశం మార్చు

కర్ణాటక సంగీతంలో గాన కళారత్న ఆర్‌.ఆర్‌.కేశవమూర్తి శిష్యరికంలో ఓనమాలు దిద్దిన అనసూయ, 1952వ సంవత్సరంలో బెంగుళూరు ఆల్‌ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నై మ్యూజిక్‌ అకాడమీ నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకోవడం విశేషం. ప్రముఖ గురువు మైసూర్‌ టి.చౌడయ్య వద్ద కూడా కొంతకాలం శిష్యరికం చేశారు. ఆమె గాన మాధుర్యానికి ఆకర్షితులై ప్రముఖ సినీ దర్శకులు ఎం.వి.సుబ్బయ్యనాయుడు 1961లో 'భక్త ప్రహ్లాద' చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.

కుటుంబ జీవితం మార్చు

వివాహానంతరం ఆమెకు భర్తతో పాటు దేశ విదేశాలు తిరిగి చూడడం, అక్కడి సంగీత రీతులు, సంగీత వాద్యాలను తెలుసుకునే అవకాశం లభించింది. అదే ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. 1964లో భర్త ఉద్యోగ రీత్యా కాబూల్‌కు మారడంతో అక్కడి ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ సరంగ్‌ శిష్యరికంతో హిందూస్తానీ సంగీతం అభ్యసించే సదవకాశం ఆమెకు దొరికింది. ఉస్తాద్‌ తన ప్రియ శిష్యురాలికి స్వరమండలం ‌ అనే తంత్రీవాద్యాన్ని కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. సంగీత వాద్యాలను సేకరించాలనే తన ఆలోచనకు నాంది పలికింది గురువుగారు బహూకరించిన ఆ తంత్రీవాద్యమే అంటారు అనసూయ. కాబూల్‌లో కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత భర్తతో కలిసి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, కెన్యా, పపువా న్యూ గినియా, ఉగాండా, మంగోలియా, ఇథియోపియా, భూటాన్‌, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఆదేశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులతో సత్సంబంధాలు కొనసాగించారు. ఎన్నో యూనివర్శిటీలలో ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం కింద సంగీతం నేర్పించారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ .... వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు.

ప్రతి వాద్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తేవడం ఓ ఎత్తైతే దాన్ని పాడవకుండా భద్రపరచడం మరో ఎత్తు. ఇది నిజంగా ఓ సవాలు అంటారు అనసూయ. ఇండోనేషియాలో ఆమె మొదటిసారిగా అంగ్‌క్లంగ్‌ను (వెదురుబొంగులను వరుసక్రమంలో బిగించిన చట్రం. చూడడానికి జైలోఫోల్‌ (కర్రముక్కల సంగీతపు పెట్టె) మాదిరిగా ఉండే అతిపెద్ద వాద్యం) చూశారు. అది పూర్తిగా ఒక పెద్ద గదిని ఆక్రమించేది. పైగా దానిలో స్వరాలు పలికించడానికి వాద్యకారులు ముందుకు వెనుకకు పరుగెత్తవలసి వచ్చేది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో గాయనీ గాయకులు నిలబడడం, పరుగెత్తడం వంటివి లేకుండా కూర్చొని ప్రేక్షకులు చూసి ఆనందించేలా ఆలపిస్తారు.

ఆ విధంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంలో కూడా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రేక్షకులు వినగల్గేలా ఎందుకు ప్రదర్శించకూడదు? అనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా జరగాలంటే మొదటగా ఆ పరికరం పరిమాణం తగ్గించాలి. ఆ పనిని అంగ్‌క్లంగ్‌ వాద్య నిపుణుల సహకారంతో చేయాలని ఆమె భావించారు. ధ్వని, మాధుర్యం, స్వరస్థానాలలో ఏ మాత్రం మార్పు లేకుండా దాని పరిమాణం తగ్గించడంలో ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. పునరుద్ధరించిన ఆ వాద్యానికి 'అంగ్‌క్రంగ్‌' అనే పేరునిచ్చారు. అక్టోబర్‌ 24న తన ఇద్దరు కుమారులు, దినేష్‌ (మృదంగం), ఉమేష్‌ (ఘటం) వాద్య సహకారంతో ఇండోనేషియా దూరదర్శన్‌లో కర్ణాటక సంగీత ప్రదర్శన ఇచ్చారు. తర్వాత పెర్త్‌ నగరంలో జరిగిన హిందూమహాసముద్ర ఉత్సవంలో (ఓషన్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఆర్ట్‌) ఆమెను ఇండోనేషియా ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది.

కళారంగంలో ముందడుగు మార్చు

పపువా న్యూ గినియాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాకు చెందిన సంగీతవాద్య ప్రదర్శన ఇవ్వడమంటే సాధారణ విషయం కాదు. అతికొద్ది కాలంలోనే అంగ్‌క్లంగ్‌తో ఒక గంట కచేరీ చేయగలిగేంతగా ఆ వాద్యంపై పట్టు సాధించారు అనసూయ. భారతదేశం లోనే కాక ఇతర దేశాలలోనూ ప్రపంచ సంగీత సాధనాల గురించి ప్రదర్శనాత్మక ఉపన్యాసం ఇచ్చారు. సందర్శకులంతా ఈ వాద్యాలను పవర్‌ పాయింట్‌ స్లైడ్స్‌లో వాయించి చూపితే బాగుంటుందని కోరడంతో ఆమె తన దగ్గరున్న వాద్యాలను స్వయంగా ప్రదర్శించి చూపాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపడం వల్ల ప్రేక్షకులు ఆ వాద్యనాదంలో పూర్తిగా లీనమవగల్గుతారు. ఏది ఎలా ఉన్నా ప్రతిసారీ ఈ విలువైన వాద్యాలను కదిలించడం సాధ్యంకాదు కదా! ఇదంతా ఎప్పటికి సాధ్యపడుతుందో! అంటారు అనసూయ సాలోచనగా.

మరొక శ్లాఘనీయమైన అంశం ఏమిటంటే అనసూయ గౌరవార్థం బెంగళూరులోని పలు సంస్థలకు, మలేషియాలోని ఒక సంస్థకు ఆమె పేరు పెట్టారు. అనసూయ ఎన్నో టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొనడమే కాకుండా ఎన్నో పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశారు. 2001 వ సంవత్సరంలో అన్నామలై యూనివర్శిటీ నుంచి కర్ణాటక సంగీతం లో ఆమె డాక్టరేట్‌ అందుకున్నారు. 2008వ సంవత్సరంలో అంగ్‌క్లంగ్‌ వాద్యంలో భారతీయ శాస్త్రీయ సంగీతబాణీలో పలికించినందుకు గాను ఆమె పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేశారు.

అదే సంవత్సరం అక్టోబర్‌ 24 న ఐరాస దినోత్సవం సందర్భంగా 90 నిమిషాల పాటు దాదాపు 20 సంగీత వాద్యాలను ఒక సహచరుని సాయంతో పరిచయం చేస్తూ ప్రదర్శించారు. ఆ ప్రదర్శన యవనికలోని నృపతుంగరోడ్‌లో జరిగింది. అనసూయ మాత్రం సంగీత వాద్యాల సేకరణ, వాటిని వాయించే విధానం, ముఖ్యంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంపై తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించారు. మొదట నేను సేకరించిన వాద్యాలను మొదటి అంతస్తులో భద్రపరిచేదాన్ని. కానీ క్రమంగా సేకరణ వాద్యాలు ఎక్కువయ్యాయి. దాంతో రెండవ అంతస్తు కూడా నిర్మించి, రెండు అంతస్తుల్లోనూ అరలు, బీరువాలు డిజైన్‌ చేసి ప్రదర్శనకు వీలుగా తయారుచేశాము. కానీ ఇప్పుడు ఈ రెండు అంతస్తులు కూడా నిండిపొయ్యాయి అని నవ్వుతూ చెప్తారు అనసూయ. మొత్తంగా ఇప్పటికి ఆమె సేకరించిన సంగీత వాద్యాల సంఖ్య అక్షరాలా 300. అంగ్‌క్లంగ్‌ కళాకారిణిగా ఆమె 'కర్ణాటక కళాశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.

నేను ఇక ఎక్కువ కాలం పాడలేననేది నిజం. అయినప్పటికీ పాడగలిగిన విద్వాంసులకు ఏ మాత్రం కొరతలేదు. కానీ అంగ్‌క్లంగ్‌పై శాస్త్రీయ సంగీతాన్ని పలికించగల ఏకైక కళాకారిణిని మాత్రం నేనే అని సగర్వంగా చెప్తారు అనసూయ.

లలిత కళల పట్ల మక్కువ చూపనివారుండరు. ఆకర్షణగా మొదలైన ఆసక్తిని అభ్యాసం ద్వారా అవలోకన చేసుకుని అటు గృహిణిగా, ఇటు కళాకారిణిగా, గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు అనసూయా కులకర్ణి. అంతటితో ఆగక వివిధ దేశాల్లో విద్యార్థులను తయారుచేస్తూ, భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు. అదే సమయంలో 300 సంగీత వాద్యాలు సేకరించడమే కాక, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రదర్శిస్తున్నారు.

కర్ణాటక సంగీతంలో గాన కళారత్న ఆర్‌.ఆర్‌.కేశవమూర్తి శిష్యరికంలో ఓనమాలు దిద్దిన అనసూయ, 1952వ సంవత్సరంలో బెంగుళూరు ఆల్‌ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు. అదే సంవత్సరం చెన్నరు మ్యూజిక్‌ అకాడమీ నుంచి గోల్డ్‌మెడల్‌ అందుకోవడం విశేషం. ప్రముఖ గురువు మైసూర్‌ టి.చౌడయ్య వద్ద కూడా కొంతకాలం శిష్యరికం చేశారు. ఆమె గాన మాధుర్యానికి ఆకర్షితులై ప్రముఖ సినీ దర్శకులు సుబ్బయ్య నాయుడు 1961లో 'భక్త ప్రహ్లాద' చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు.

వివాహానంతరం ఆమెకు భర్తతో పాటు దేశ విదేశాలు తిరిగి చూడడం, అక్కడి సంగీత రీతులు, సంగీత వాద్యాలను తెలుసుకునే అవకాశం లభించింది. అదే ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది. 1964లో భర్త ఉద్యోగ రీత్యా కాబూల్‌కు మారడంతో అక్కడి ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ మొహమ్మద్‌ హుస్సేన్‌ సరంగ్‌ శిష్యరికంతో హిందూస్తానీ సంగీతం అభ్యసించే సదవకాశం ఆమెకు దొరికింది. ఉస్తాద్‌ తన ప్రియ శిష్యురాలికి స్వరమండలం ‌ అనే తంత్రీవాద్యాన్ని కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. సంగీత వాద్యాలను సేకరించాలనే తన ఆలోచనకు నాంది పలికింది గురువుగారు బహూకరించిన ఆ తంత్రీవాద్యమే అంటారు అనసూయ. కాబూల్‌లో కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత భర్తతో కలిసి బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, కెన్యా, పపువా న్యూ గినియా, ఉగాండా, మంగోలియా, ఇథియోపియా, భూటాన్‌, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఆదేశాలలో ప్రముఖ సంగీత విద్వాంసులతో సత్సంబంధాలు కొనసాగించారు. ఎన్నో యూనివర్శిటీలలో ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాం కింద సంగీతం నేర్పించారు. ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రీ, సుషిర, అవనత్ధ .... వంటి భిన్న సంగీత వాద్యాలను సేకరించారు.

ప్రతి వాద్యాన్ని జాగ్రత్తగా ఇంటికి తేవడం ఓ ఎత్తైతే దాన్ని పాడవకుండా భద్రపరచడం మరో ఎత్తు. ఇది నిజంగా ఓ సవాలు అంటారు అనసూయ. ఇండోనేషియాలో ఆమె మొదటిసారిగా అంగ్‌క్లంగ్‌ను (వెదురుబొంగులను వరుసక్రమంలో బిగించిన చట్రం. చూడడానికి జైెలోఫోల్‌ (కర్రముక్కల సంగీతపు పెట్టె) మాదిరిగా ఉండే అతిపెద్ద వాద్యం) చూశారు. అది పూర్తిగా ఒక పెద్ద గదిని ఆక్రమించేది. పైగా దానిలో స్వరాలు పలికించడానికి వాద్యకారులు ముందుకు వెనుకకు పరుగెత్తవలసి వచ్చేది. భారతీయ శాస్త్రీయ సంగీతంలో గాయనీ గాయకులు నిలబడడం, పరుగెత్తడం వంటివి లేకుండా కూర్చొని ప్రేక్షకులు చూసి ఆనందించేలా ఆలపిస్తారు.

ఆ విధంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంలో కూడా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రేక్షకులు వినగల్గేలా ఎందుకు ప్రదర్శించకూడదు? అనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా జరగాలంటే మొదటగా ఆ పరికరం పరిమాణం తగ్గించాలి. ఆ పనిని అంగ్‌క్లంగ్‌ వాద్య నిపుణుల సహకారంతో చేయాలని ఆమె భావించారు. ధ్వని, మాధుర్యం, స్వరస్థానాలలో ఏ మాత్రం మార్పు లేకుండా దాని పరిమాణం తగ్గించడంలో ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. పునరుద్ధరించిన ఆ వాద్యానికి 'అంగ్‌క్రంగ్‌' అనే పేరునిచ్చారు. అక్టోబరు 24న తన ఇద్దరు కుమారులు, దినేష్‌ (మృదంగం), ఉమేష్‌ (ఘటం) వాద్య సహకారంతో ఇండోనేషియా దూరదర్శన్‌లో కర్ణాటక సంగీత ప్రదర్శన ఇచ్చారు. తర్వాత పెర్త్‌ నగరంలో జరిగిన హిందూమహాసముద్ర ఉత్సవంలో (ఓషన్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఆర్ట్‌) ఆమెను ఇండోనేషియా ప్రభుత్వం ప్రతినిధిగా నియమించింది.

పపువా న్యూ గినియాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాకు చెందిన సంగీతవాద్య ప్రదర్శన ఇవ్వడమంటే సాధారణ విషయం కాదు. అతికొద్ది కాలంలోనే అంగ్‌క్లంగ్‌తో ఒక గంట కచేరీ చేయగలిగేంతగా ఆ వాద్యంపై పట్టు సాధించారు అనసూయ. భారతదేశంలోనే కాక ఇతర దేశాలలోనూ ప్రపంచ సంగీత సాధనాల గురించి ప్రదర్శనాత్మక ఉపన్యాసం ఇచ్చారు. సందర్శకులంతా ఈ వాద్యాలను పవర్‌ పాయింట్‌ స్లైడ్స్‌లో వాయించి చూపితే బాగుంటుందని కోరడంతో ఆమె తన దగ్గరున్న వాద్యాలను స్వయంగా ప్రదర్శించి చూపాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపడం వల్ల ప్రేక్షకులు ఆ వాద్యనాదంలో పూర్తిగా లీనమవగల్గుతారు. ఏది ఎలా ఉన్నా ప్రతిసారీ ఈ విలువైన వాద్యాలను కదిలించడం సాధ్యంకాదు కదా! ఇదంతా ఎప్పటికి సాధ్యపడుతుందో! అంటారు అనసూయ సాలోచనగా.

మరొక శ్లాఘనీయమైన అంశం ఏమిటంటే అనసూయ గౌరవార్థం బెంగళూరులోని పలు సంస్థలకు, మలేషియాలోని ఒక సంస్థకు ఆమె పేరు పెట్టారు. అనసూయ ఎన్నో టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొనడమే కాకుండా ఎన్నో పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశారు. 2001 వ సంవత్సరంలో అన్నామలై యూనివర్శిటీ నుంచి కర్ణాటక సంగీతంలో ఆమె డాక్టరేట్‌ అందుకున్నారు. 2008వ సంవత్సరంలో అంగ్‌క్లంగ్‌ వాద్యంలో భారతీయ శాస్త్రీయ సంగీతబాణీలో పలికించినందుకు గాను ఆమె పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేశారు.

అదే సంవత్సరం అక్టోబర్‌ 24న ఐరాస దినోత్సవం సందర్భంగా 90 నిమిషాల పాటు దాదాపు 20 సంగీత వాద్యాలను ఒక సహచరుని సాయంతో పరిచయం చేస్తూ ప్రదర్శించారు. ఆ ప్రదర్శన యవనికలోని నృపతుంగరోడ్‌లో జరిగింది. అనసూయ మాత్రం సంగీత వాద్యాల సేకరణ, వాటిని వాయించే విధానం, ముఖ్యంగా అంగ్‌క్లంగ్‌ వాద్యంపై తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించారు. మొదట నేను సేకరించిన వాద్యాలను మొదటి అంతస్తులో భద్రపరిచేదాన్ని. కానీ క్రమంగా సేకరణ వాద్యాలు ఎక్కువయ్యాయి. దాంతో రెండవ అంతస్తు కూడా నిర్మించి, రెండు అంతస్తుల్లోనూ అరలు, బీరువాలు డిజైన్‌ చేసి ప్రదర్శనకు వీలుగా తయారుచేశాము. కానీ ఇప్పుడు ఈ రెండు అంతస్తులు కూడా నిండిపొయ్యాయి అని నవ్వుతూ చెప్తారు అనసూయ. మొత్తంగా ఇప్పటికి ఆమె సేకరించిన సంగీత వాద్యాల సంఖ్య అక్షరాలా 300. అంగ్‌క్లంగ్‌ కళాకారిణిగా ఆమె 'కర్ణాటక కళాశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.

అనసూయా కులకర్ణి జీవితం ఎందరెందరికో మార్గదర్శకమైంది. తమకు కావలసింది ఏమిటో కచ్చితంగా తెలుసుకొని, అదే దిశగా పయనించి లక్ష్యాన్ని చేరుకుని తాము ఎంతో సాధించామని పొంగిపోయేవారు కొందరైతే, లక్ష్యసాధనలో అవరోధాలకు జడిసి, తమ జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లి, ఏమీ సాధించలేక పరిస్థితులను నిందిస్తూ కూర్చొనేవారు మరికొందరు. కానీ అనసూయ జీవితంలో తనకు ఎదురైన అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుని ప్రపంచ సంగీత రంగాన్నే తన జీవితంగా మలచుకొని ఆరు పదుల వయసులో కూడా పరిస్థితులతో ఎలాంటి రాజీ పడకుండా సాగిస్తున్న పయనాన్ని హర్షించకుండా ఉండలేం. నేను ఇక ఎక్కువ కాలం పాడలేననేది నిజం. అయినప్పటికీ పాడగలిగిన విద్వాంసులకు ఏ మాత్రం కొరతలేదు. కానీ అంగ్‌క్లంగ్‌పై శాస్త్రీయ సంగీతాన్ని పలికించగల ఏకైక కళాకారిణిని మాత్రం నేనే అని సగర్వంగా చెప్తారు అనసూయ.

మార్పు మార్చు

  • వివరాలు...- నాగ శిరీష

వెలుపలి లింకులు మార్చు