అనిత (జననం: ఏప్రిల్ 14, 1981) ఒక భారతీయ నటి, మోడల్. ఆమె తెలుగు, హిందీ, తమిళ, కన్నడ లాంటి పలు భాషల సినిమాల్లోనూ, సీరియళ్ళలోనూ నటించింది. 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయం అయింది. ఈ సినిమా పలు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకుంది.

అనిత
Anita Hassanandani Reddy snapped promoting the film Bareilly Ki Barfi (02) (cropped).jpg
అనిత
జననం
అనిత హస్సానందాని

(1981-04-14) 14 ఏప్రిల్ 1981 (వయస్సు 40)[1][2]
జాతీయతభారతీయురాలు
వృత్తిమోడల్, నటి
జీవిత భాగస్వాములురోహిత్ రెడ్డి(m.2013-)

వ్యక్తిగత జీవితంసవరించు

అనిత ఏప్రిల్ 14, 1981 న ముంబై లో జన్మించింది. అక్టోబరు 14, 2013 న వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని గోవాలో వివాహం చేసుకుంది.[3]

కెరీర్సవరించు

అనిత 2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా చిత్రరంగానికి పరిచయం అయింది. తరువాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో రెండో హీరోయిన్ గా నటించింది. తొట్టిగ్యాంగ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. 2003 లో థ్రిల్లర్ సినిమా కుచ్ తో హై ద్వారా హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించింది. కళావర్ కింగ్ సినిమాలో ఓ అతిథి నృత్యంలో కనిపించింది.[4]

ఎవర్ యూత్, బోరో ప్లస్, సన్ సిల్క్ లాంటి ఉత్పత్తులకు ప్రచారం చేసింది.[5]

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. Goswami, Parismita (14 April 2016). "'Yeh Hai Mohabbatein' actress Anita Hassanandani celebrates her birthday with Karan Patel and others". International Business Times, India Edition. Retrieved 2016-06-12. CS1 maint: discouraged parameter (link)
  2. "Anita Hassanandani gets a special birthday gift from husband". The Indian Express. 12 April 2016. Retrieved 2016-06-12. CS1 maint: discouraged parameter (link)
  3. "Anita Hassanandani ties the knot with Rohit Reddy". Times of India. 16 October 2013. Retrieved 17 October 2013. CS1 maint: discouraged parameter (link)
  4. "'నువ్వు-నేను' అనిత కూడా ఆ రూట్ లోనే." telugu.filmibeat.com. ఫిల్మీ బీట్. Retrieved 17 November 2016. CS1 maint: discouraged parameter (link)
  5. "debut on the television screen". indianexpress.com. Retrieved 6 Jun 2012. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అనిత&oldid=2879973" నుండి వెలికితీశారు