తొట్టిగ్యాంగ్
తొట్టిగ్యాంగ్ 2002, డిసెంబరు 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, అల్లరి నరేష్,[1] సునీల్, అనిత, గజాలా[2] నాయికానాయకులుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
తొట్టిగ్యాంగ్ | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి. సత్యనారాయణ |
రచన | ఇ.వి.వి. సత్యనారాయణ |
నిర్మాత | ఇ.వి.వి. సత్యనారాయణ |
తారాగణం | ప్రభు దేవా అల్లరి నరేష్ సునీల్ అనిత గజాలా |
ఛాయాగ్రహణం | లోగనాథం శ్రీనివాసన్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | ఇవివి సినిమా |
విడుదల తేదీ | డిసెంబరు 6, 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చునరేష్, ప్రభుదేవా, సునీల్ ఒక తొట్టిగ్యాంగ్. శవాలను తరలించడం, కుక్కలను పట్టుకోవడం వీరి పని. గజాలాను చూడగానే ప్రభుదేవా ప్రేమిస్తాడు. కానీ గజాలా ఛీ కొడుతుంది. నరేష్ మంచితనం చూసి ఆమె అతన్ని ప్రేమిస్తుంది. చిన్నప్పుడు తను ప్రేమించిన వెంకటలక్ష్మిని తప్ప ఎవర్నీ ప్రేమించలేనని నరేష్ చెప్పుతాడు. గజాలా వెంటనే ఓ కథ అల్లి, వెంకటలక్ష్మికి ఇప్పటికే పెళ్ళి అయిందని, ఇద్దరు పిల్లలు కూడా అని చెప్పుతుంది. దీంతో స్నేహితులిద్దరిని వదిలేసి గజాలాతో సింగుతుంటాడు. ఫ్రెండ్‌ను దూరం చేసిన గజాలాపై కక్ష సాధించేందుకు ప్రభుదేవా, సునీల్‌లు ప్లాన్ వేస్తారు. ఈలోపు వారికి వెంకటలక్ష్మి (అనిత) పరిచయమవుతుంది. సొంత బావ తనను 'పూజకు పనికి రాని పువ్వు'గా చేయడంతో వెంకటలక్ష్మి సన్యాసిగా మారాలని నిశ్చయించుకుంటుంది. కానీ ఈ పువ్వును నరేష్ చెవ్విలో పెడుతామని శపథం చేసి గజాలాను కిడ్నాప్ చేస్తారు. ఇక గజాలా వీరిని ముప్పుతిప్పలు పెట్టి నరేష్‌కు దగ్గరవుతుంది, అనితను నరేష్ పెళ్ళిచేసుకుంటాడా లేదా అనేది మిగతా కథ.
నటవర్గం
మార్చు- ప్రభుదేవా (సూరిబాబు)
- అల్లరి నరేష్ (అచ్చిబాబు)
- సునీల్ (సత్తిబాబు)
- అనిత (వెంకటలక్ష్మీ)
- షకీలా (మాతాశ్రీ)
- ఎల్. బి. శ్రీరామ్ (అలెగ్జాండర్)
- ఎం. ఎస్. నారాయణ, చలపతిరావు (బొంగు బ్రదర్స్)
- జయ ప్రకాష్ రెడ్డి (అతిథి పాత్ర)
- బ్రహ్మానందం (గాలిగొట్టం గోవిందశాస్త్రి)
పాటలు
మార్చుపాటపేరు | గాయకులు | నిడివి |
---|---|---|
నువ్వే కావాలి | ఎస్. పి. చరణ్, సుమంగళి | 04:28 |
ఓ ఓ సోదరా | రంజిత్ | 05:26 |
వెచ్చని వెచ్చని దేహం | రాజేష్, కె. ఎస్. చిత్ర | 05:22 |
ఓరినాయనో | సాందీప్, కల్పన | 05:15 |
గుండెల్లో నువ్వే | దేవిశ్రీ ప్రసాద్, ఫెబి | 05:23 |
కన్నెపిల్ల అరె కన్నెపిల్ల | కార్తిక్, మాతంగి జగదీష్ | 05:28 |
మూలాలు
మార్చు- ↑ ఈనాడు. "యాభై సినిమాలూ...ఎన్నో అనుభవాలూ!". Archived from the original on 26 జూలై 2017. Retrieved 13 July 2017.
- ↑ ఆంధ్రజ్యోతి. "గజాలా పెళ్లి భాజాలు..." Retrieved 13 July 2017.[permanent dead link]