నువ్వు నేను 2001 లో తేజ దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. ఇందులో ఉదయ్ కిరణ్, అనిత ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్. పి. పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి.

నువ్వు నేను
దర్శకత్వంతేజ
రచనతేజ
కొండపల్లి దశరథ్
గోపీ మోహన్
నిర్మాతపి. కిరణ్
తారాగణంఉదయ్ కిరణ్
అనిత
సునీల్
ఛాయాగ్రహణంరసూల్ ఎల్లోర్
సంగీతంఆర్. పి. పట్నాయక్
విడుదల తేదీ
2001 ఆగస్టు 10 (2001-08-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

రవి ఒక ధనవంతుల కుటుంబంలోని ఏకైక సంతానం. రవికి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ఉంటాడు. తండ్రి వ్యాపారంలో తీరికలేకుండా అతన్ని సరిగా పట్టించుకోకుండా ఉంటే ఇంట్లో నమ్మకస్తుడైన రాళ్ళపల్లి అతని బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. వసుంధర పాతబస్తీలోని ఒక పాలవాని కూతురు. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతుంటారు. రవి చదువులో వెనుకబడి ఉంటే వసుంధర మాత్రం ఎప్పుడూ ముందజలో ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. కానీ పెద్దలు వీరి ప్రేమను ఆమోదించక ఇద్దరినీ వేరు చేస్తారు. చివరికి మిత్రుల సహాయంతో పెద్దలను ఎదిరించి వీరు పెళ్ళి చేసుకుంటారు.

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

పాటలు సవరించు

  • నీకోసమే ఈ అన్వేషణ
  • ప్రియతమా.. ఓ... ఫ్రియతమా
  • నీకునేను...నాకునువ్వు..ఒకరికొకరం..నువ్వు నేను
  • గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా

పురస్కారములు సవరించు

ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారములు
నంది పురస్కారములు

బయటి లంకెలు సవరించు