అమరచింత పురపాలకసంఘం
అమరచింత పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] అమరచింత పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
అమరచింత పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°28′38″N 77°43′20″E / 16.4773605°N 77.7223162°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి |
మండలం | అమరచింత |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | మంగమ్మ |
- వైస్ చైర్పర్సన్ | జిఎస్ గోపి |
వైశాల్యము | |
- మొత్తం | 19.82 km² (7.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 11,225 |
- పురుషుల సంఖ్య | 5,540 |
- స్త్రీల సంఖ్య | 5,685 |
- గృహాల సంఖ్య | 2,576 |
పిన్ కోడ్ - 509130 | |
Area code(s) | ఎస్.టి.డి కోడ్ - 08504 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న అమరచింత, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
మార్చుఅమరచింత 19.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°22′26″N 77°46′19″E / 16.374°N 77.772°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 140 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం వనపర్తి నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 11225 మంది కాగా, అందులో 5540 మంది పురుషులు, 5685 మంది మహిళలు ఉన్నారు. 2576 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 10 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం మంగమ్మ చైర్‌పర్సన్‌గా, జిఎస్ గోపి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
మార్చు- లక్ష్మి
- మంగ లావణ్య
- విజయ రాములు
- సింధు
- రాజ్‌కుమార్
- మాధవి
- ఉషా
- మంగమ్మ
- రాజశేఖర్
- జిఎస్. గోపి
మూలాలు
మార్చు- ↑ "Amarchinta Municipality". amarchintamunicipality.telangana.gov.in. Archived from the original on 14 ఏప్రిల్ 2021. Retrieved 14 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 14 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 14 April 2021.
- ↑ "Basic Information of Municipality, Amarchinta Municipality". amarchintamunicipality.telangana.gov.in. Retrieved 14 April 2021.[permanent dead link]
- ↑ "Council, Amarchinta Municipality". amarchintamunicipality.telangana.gov.in. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 14 April 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 14 April 2021.
వెలుపలి లంకెలు
మార్చు- అమరచింత పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-04-14 at the Wayback Machine